Real World Mileage: SUVకి బదులుగా మిడ్‌సైజ్ సెడాన్ కొనాలనుకునేవారికి Skoda Slavia & Honda City మంచి ఎంపికలు. ఈ రెండు కార్ల పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్లు భిన్నమైన ఇంజిన్లతో వచ్చాయి. గతంలో, ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో Slavia పైచేయి సాధించింది. ఇంధన సామర్థ్యం (మైలేజ్‌)లో ఏ కారు మెరుగ్గా ఉందనే ప్రశ్నకు రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్ష సమాధానం ఇచ్చింది.

Continues below advertisement

ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు

Skoda Slaviaలో 1.0-లీటర్ 3-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 110hp పవర్ & 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8AT టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు.

Continues below advertisement

Honda Cityలో 1.5-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121hp పవర్ & 145Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 7-స్టెప్ CVT గేర్‌బాక్స్ యాడ్‌ చేశారు.

పవర్ విషయంలో City ముందున్నప్పటికీ, Slavia 33Nm ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది. రెండు కార్లలోనూ FWD డ్రైవ్ లేఅవుట్ ఉంది.

Skoda Slavia బరువు ఎక్కువగా ఉంటుంది. దీని కెర్బ్‌ వెయిట్‌ 1,234-1,258kg కాగా, Honda City బరువు 1,144-1,168kg మధ్య ఉంటుంది. అంటే Slavia గరిష్ఠంగా 90kg వరకు ఎక్కువ బరువుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం Slaviaలో 45 లీటర్లు, Cityలో 40 లీటర్లు.

ఇది కూడా చదవండి: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే

రియల్ వరల్డ్ మైలేజ్‌

కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ లెక్కల్లో Slavia మెరుగ్గా ఉన్నప్పటికీ, వాస్తవ పరీక్షలో Honda City ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని చూపించింది.

పరీక్షలో Honda City సగటున 13.30kpl మైలేజ్ ఇచ్చింది. Skoda Slavia సగటు మైలేజ్ 12.06kplగా నమోదైంది. అంటే, Slavia కంటే City ఒక లీటర్‌కు 1.24 కి.మీ. ఎక్కువ మైలేజ్ అందించింది.

సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేసినప్పుడు Slavia కంటే Honda City 1.37kpl మెరుగైన మైలేజ్ ఇచ్చింది. హైవే మీద డ్రైవ్‌ చేసినప్పుడు ఈ తేడా 1.1kplకు తగ్గింది. అయినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లోనూ Honda City బెటర్‌గా నిలిచింది.

Slavia మైలేజ్ తక్కువగా రావడానికి దాని అధిక బరువు ఒక కారణమని ఎక్స్‌పర్ట్‌లు వెల్లడించారు. టెస్ట్‌ జరిగిన రోజున ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా AC ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. దీంతో ఇంధన సామర్థ్యం తగ్గి ఉండవచ్చని ఎక్స్‌పర్ట్‌లు అంచనా.

Slaviaలో ఆటో ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ ఉంది. Honda Cityలో ఈ ఫీచర్ లేదు. అయితే Cityలో ఇంధన పొదుపునకు ప్రాధాన్యం ఇచ్చే ECON మోడ్ అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?

ధరలు, వేరియంట్లు

పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలను పరిశీలిస్తే Slavia మంచి ఎంపికగా కనిపిస్తుంది. దీని ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.29 లక్షల వరకు ఉన్నాయి. Honda City ధరలు రూ.14.51 లక్షల నుంచి రూ.17.36 లక్షల వరకు ఉన్నాయి.

బేస్ వేరియంట్ స్థాయిలో City కంటే Slavia రూ.2.02 లక్షలు తక్కువ ధరకే వస్తుంది. టాప్ వేరియంట్ విషయంలో ఈ వ్యత్యాసం రూ.7,000 మాత్రమే. వేరియంట్ల సంఖ్యలోనూ Slavia ముందుంది. Slaviaలో 5 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉండగా, Cityలో 3 వేరియంట్లు ఉన్నాయి.

మైలేజ్ పరీక్ష ఎలా నిర్వహించారు?

ఎక్స్‌పర్ట్‌లు, రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్ష ప్రారంభించే ముందు కార్ల ఫ్యూయల్ ట్యాంకులను పూర్తిగా నింపారు. తయారీ సంస్థ సూచించిన ప్రకారం టైర్ ప్రెషర్‌ను సెట్ చేశారు. ఆ తర్వాత, నవీ ముంబై పరిసరాల్లో నిర్ణీత సిటీ & హైవే మార్గాల్లో కార్లను నడిపారు. పరీక్ష సమయంలో నిర్దిష్ట సగటు వేగాన్ని కొనసాగించారు. ప్రతి కారులో డ్రైవర్ ఒక్కరే ఉంటారు. సాధారణ వినియోగదారుల మాదిరిగానే అవసరమైనప్పుడు AC, ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు & వైపర్లను ఉపయోగించారు. డ్రైవింగ్ విధానంలో తేడాల ప్రభావాన్ని తగ్గించేందుకు మధ్య మధ్యలో డ్రైవర్లను మార్చారు. ప్రతి పరీక్ష పూర్తయిన తర్వాత మళ్లీ ఫ్యూయల్ ట్యాంకును పూర్తిగా నింపి, అప్పటివరకు ఖర్చయిన ఇంధనం ఆధారంగా మైలేజ్‌ను లెక్కించారు.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.