Skoda Slavia Facelift Details In Telugu: స్కోడా స్లావియాకు తొలిసారి పెద్ద అప్‌డేట్ వచ్చింది. 2022లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ సెడాన్‌కు ఇప్పుడు కొత్త రూపం, అదనపు ఫీచర్లు వచ్చాయి. ముఖ్యంగా కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కీలక మార్పుగా నిలిచింది. ప్రత్యర్థులైన Hyundai Verna, Honda Cityకి పోటీగా స్లావియా మరింత ఆధునికంగా మారింది.

Continues below advertisement

డిజైన్‌ మార్పులు

కారు డిజైన్‌లో పెద్ద మార్పులు లేనప్పటికీ... చేసిన చిన్న మార్పులు చక్కగా కుదిరాయి. ముందుభాగంలో కొత్త గ్రిల్ డిజైన్ కనిపిస్తుంది. LED హెడ్‌ల్యాంప్‌లలో కొత్త DRL సిగ్నేచర్ వచ్చింది. బంపర్ డిజైన్ కూడా మారింది. కొత్త LED ఫాగ్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇచ్చారు.

Continues below advertisement

వెనుక భాగంలో కూడా మార్పులు ఉన్నాయి. టెయిల్ ల్యాంప్‌లలో కొత్త LED ఎలిమెంట్స్ వచ్చాయి. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. రెండు టెయిల్ ల్యాంప్‌లను కలిపే కొత్త ట్రిమ్ పీస్‌కు పెద్ద అక్షరాల్లో SKODA అని ఇచ్చారు. కొత్త ఆర్కిటిక్ సిల్వర్, కాపుచినో బేజ్ రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

క్యాబిన్‌లో మార్పులు మరింత ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రెస్టీజ్ వేరియంట్‌లో బేజ్ & బ్లాక్ కలర్ థీమ్ ఉంటుంది. మాంటే కార్లోలో బ్లాక్ థీమ్‌తో ఎరుపు రంగు వివరాలు ఉంటాయి. సీట్లు వెడల్పుగా ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణాల్లో మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.

వెనుక సీటు స్పేస్ స్లావియా బలాల్లో ఒకటి. లెగ్‌రూమ్, ఫుట్‌రూమ్ పుష్కలంగా ఉంటాయి. అయితే పొడవైన ప్రయాణికులకు హెడ్‌రూమ్ కొంత తక్కువగా అనిపించొచ్చు. వెనుక సీటు ఆకారం, మధ్యలో ఉన్న ట్రాన్స్‌మిషన్ హంప్ కారణంగా ముగ్గురి కంటే ఇద్దరు పెద్దలకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది.

521 లీటర్ల బూట్ స్పేస్ సెగ్మెంట్‌లోనే పెద్దదిగా ఉంది. వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో మడిచే సౌకర్యం ఉంది. స్పేర్ టైర్, బూట్ కింద సబ్‌వూఫర్ కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Mahindra Thar Electric వస్తోంది.. టెస్టింగ్‌లో తొలిసారి కనిపించిన కారు లుక్, అంచనా ధర వివరాలు

ఫీచర్లు

ఫీచర్ల విషయంలో స్లావియా గణనీయంగా మెరుగుపడింది. వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్ రావడం ప్రత్యేక ఆకర్షణ. ఈ తరహా ఫీచర్ సాధారణంగా ఖరీదైన కార్లలో కనిపిస్తుంది. డ్రైవర్ డిస్‌ప్లే 8 అంగుళాల నుంచి 10.25 అంగుళాలకు పెరిగింది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 10 అంగుళాల నుంచి 10.1 అంగుళాలకు పెరిగింది.

360 డిగ్రీ కెమెరా మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్. దీని స్పష్టత కూడా ఆకట్టుకుంటుంది. కొత్త ఎయిర్ కండిషనింగ్ కంప్రెసర్ వల్ల కూలింగ్ పనితీరు మెరుగుపడింది.

ఇంజిన్ ఎంపికల్లో పెద్ద మార్పు లేదు. 1.0 లీటర్ మూడు సిలిండర్ల TSI ఇంజిన్ 115hp శక్తి, 178Nm టార్క్ ఇస్తుంది. 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల TSI ఇంజిన్ 150hp శక్తి, 250Nm టార్క్ అందిస్తుంది.

అసలు కొత్తదనం 1.0 TSIతో వచ్చిన 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. ఇది పాత 6 స్పీడ్ ఆటోమేటిక్‌ స్థానంలో వచ్చింది. దీనివల్ల, తక్కువ వేగాల్లోనూ కారు రన్నింగ్‌ ఇప్పుడు మరింత స్మూత్‌గా ఉంది.

ఇది కూడా చదవండి: Emraan Hashmi Car Collection: లగ్జరీ కారు కొన్న ఇమ్రాన్ హాష్మీ.. SUV ధర, ఫీచర్లు.. నటుడి కార్ కలెక్షన్ వివరాలు

ఇంజిన్‌

1.5 TSI ఇంజిన్‌ పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. వేగం పెంచడంలో ఇది మరింత చురుగ్గా ఉంటుంది. గేర్ మార్పులు కూడా వేగంగా ఉంటాయి. అయితే ఈ ఇంజిన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక ఇప్పుడు లేదు.

రైడ్ & హ్యాండ్లింగ్‌లో స్లావియా తన బలాన్ని కొనసాగించింది. 179mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ మలుపుల్లో కారు నియంత్రణ కోల్పోదు. బాడీ రోల్ కూడా అదుపులో ఉంటుంది. హైవేపై కారు స్థిరంగా, నమ్మకంగా సాగుతుంది.

లోపాలు

అయితే, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. తక్కువ వేగాల్లో డ్రైవింగ్‌ కొంత గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. 1.0 TSIలో ఇంజిన్ శబ్దం కొంత ఎక్కువగా వినిపిస్తుంది. ప్రత్యర్థి కార్లలో ఉన్న ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ADAS వంటి ఫీచర్లు లేవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.