Skoda slavia facelift Down Payment, Loan and EMI Details: సెడాన్ లవర్స్‌‌కు మైండ్ బ్లోయింగ్‌ న్యూస్! ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా.. తన మోస్ట్ పాపులర్ ప్రీమియం సెడాన్ 'స్లావియా'లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. అదిరిపోయే లుక్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్.. మార్కెట్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

స్టైలిష్ ఫీచర్లు & అధునాతన డిజైన్

కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్ విభాగాల్లో కొన్ని మార్పులు చేశారు. సిగ్నేచర్ గ్రిల్, LED హెడ్‌లాంప్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఇంటీరియర్‌లో పానోరమిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు & 360-డిగ్రీ కెమెరా సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC & గ్లోబల్ NCAC 5-స్టార్ రేటింగ్ దీని సొంతం.

Continues below advertisement

ఇంజిన్ సామర్థ్యం & మైలేజ్

ఈ కారు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (114 bhp) & 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (148 bhp) ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మ్యాన్యువల్, టార్కు కన్వర్టర్ & DSG గేర్‌బాక్స్ వేరియంట్లు ఉన్నాయి. లీటరుకు దాదాపు 18.73 నుండి 20.32 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ మైలేజ్‌ను ఇది అందిస్తుంది.

హైదరాబాద్‌లో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధరల వివరాలు

స్కోడా స్లావియా ఫేస్‌‌లిఫ్ట్ 2026 ధరలను అక్టోబర్‌ 6న అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి, ఫేస్‌లిఫ్ట్‌ ఆన్‌రోడ్‌ ధరను ఇప్పుడు లెక్కగట్టలేము. అయితే, ప్రస్తుత వెర్షన్‌లో బేస్ వేరియంట్ (క్లాసిక్) ఎక్స్‌-షోరూమ్‌‌ ధర రూ. 10 లక్షలు, టాప్ వేరియంట్ (మోంటే కార్లో) ధర రూ. 18.29 లక్షలు గా ఉంది. లైఫ్‌టైమ్ రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఫాస్టాగ్ వంటి ఇతర ఛార్జీలు కలిపిన తర్వాత, హైదరాబాద్‌లో బేస్‌ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర రూ. 12.05 లక్షలు, టాప్ వేరియంట్‌కు రూ. 22.70 లక్షలు అవుతుంది.

విజయవాడలో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధరల వివరాలు

విజయవాడలో, ప్రస్తుత స్లావియా బేస్ వేరియంట్ (క్లాసిక్) ఎక్స్‌-షోరూమ్‌‌ ధర రూ. 10 లక్షలు కాగా, టాప్ వేరియంట్ (మోంటే కార్లో) ధర రూ. 18.29 లక్షలు గా ఉంది. లైఫ్‌టైమ్ రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఫాస్టాగ్ వంటి ఇతర ఛార్జీలు కలిపిన తర్వాత, హైదరాబాద్‌లో బేస్‌ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర రూ. 12.15 లక్షలు, టాప్ వేరియంట్‌కు రూ. 22.50 లక్షలు అవుతుంది.

కనీస డౌన్‌పేమెంట్‌ & బ్యాంక్ వడ్డీ రేట్లు

మీరు, విజయవాడలో స్లావియా బేస్ వేరియంట్‌ను ఫైనాన్స్ ద్వారా కొనాలంటే, మీ సిబిల్‌ స్కోర్‌ను బట్టి, కనీస డౌన్‌పేమెంట్‌గా ఆన్‌రోడ్‌ ధరలో దాదాపు 20% అంటే రూ. 2,43,000 చెల్లించాలి. మిగిలిన రూ. 9,72,000 మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్.డి.ఎఫ్.సి., ఐ.సి.ఐ.సి.ఐ. & యాక్సిస్ బ్యాంక్‌లు కార్ లోన్‌లపై వార్షికంగా 8.5% నుంచి 14% వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త హ్యుందాయ్ ఆరా కొనడానికి ముందుగా ఎంత కట్టాలి? లోన్‌ ఎంత వస్తుంది?

10% వార్షిక వడ్డీ రేటుతో 4, 5, 6, 7 ఏళ్ల EMI లెక్కింపు

ఉదాహరణకు.. మీరు రూ. 2,43,000 డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ. 9.72 లక్షలను 10% వార్షిక వడ్డీతో లోన్‌గా తీసుకుంటే, నెలవారీ EMI అంచనాలు:

4 ఏళ్ల కాలవ్యవధి (48 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 24,6325 ఏళ్ల కాలవ్యవధి (60 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 20,6356 ఏళ్ల కాలవ్యవధి (72 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 17,9927 ఏళ్ల కాలవ్యవధి (84 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 16,123

మీరు రూ. 3.50 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ. 8.65 లక్షలను 10% వార్షిక వడ్డీతో లోన్‌గా తీసుకుంటే, నెలవారీ EMI అంచనాలు:

4 ఏళ్ల కాలవ్యవధి (48 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 21,9195 ఏళ్ల కాలవ్యవధి (60 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 18,3626 ఏళ్ల కాలవ్యవధి (72 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 16,0107 ఏళ్ల కాలవ్యవధి (84 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 14,347

ఈ ప్రకారం, మీరు రూ.3.50 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించి, లోన్‌ రీపేమెంట్‌ కోసం 7 ఏళ్ల కాలవ్యవధిని ఎంచుకుంటే, మీ నెలవారీ EMI సుమారు రూ.14,347 అవుతుంది.

ఇది కూడా చదవండి: రూ.6.31 లక్షలకే మారుతి డిజైర్.. లోన్‌పై కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి? ఎంత EMI పడుతుంది?

కారు బుక్ చేసుకునే ముందు మీ నగరంలోని స్కోడా డీలర్‌‌షిప్‌ వద్ద అందుబాటులో ఉన్న ఆఫర్లు & ఇన్సూరెన్స్ డిస్కౌంట్లను సరిపోల్చుకోండి. మీ క్రెడిట్ స్కోర్ (CIBIL Score) 750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంక్‌ నుంచి అతి తక్కువ వడ్డీ రేటుకే కార్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. 7 ఏళ్ల సుదీర్ఘ రుణ వ్యవధి కంటే 5 ఏళ్ల EMI ప్లాన్ ఎంచుకోవడం వల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.