Skoda Kylq Price, Mileage And Features In Telugu: భారతదేశంలో తీవ్రమైన పోటీ ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలోకి, నవంబర్ 2024లో, స్కోడా కైలాక్ కొత్తగా ప్రవేశించింది. ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత తక్కువ ధర స్కోడా మోడల్. అందువల్ల, కైలాక్‌పై ప్రజలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. 

Continues below advertisement


స్కోడా కైలాక్‌ కొనాలనుకుంటుంటే, మీ కోసం 8 కీలక ప్రశ్నలు & సమాధానాలు


1. స్కోడా కైలాక్ ధర ఎంత?


కైలాక్ ధర బేస్ మోడల్‌ Classic MT వేరియంట్‌కు రూ. 8.25 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది & టాప్-స్పెక్ Prestige AT వేరియంట్‌కు రూ. 13.99 లక్షల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బండి ఆన్-రోడ్ ధర రూ. 10.01 - 17.30  లక్షల శ్రేణిలో ఉంటుంది. చౌకైన ఆటోమేటిక్‌ వేరియంట్ Kylaq Signature AT ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 10.95 లక్షలు. మాన్యువల్ గేర్‌బాక్స్ & అన్ని ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులకు, ఫుల్లీ లోడెడ్‌ కైలాక్ Kylaq Prestige MT ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 12.89 లక్షలు.


2. స్కోడా కైలాక్ ప్రత్యర్థి కార్లు ఏవి?


హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, కియా సైరోస్, మహీంద్రా XUV 3XO, మారుతి సుజుకి బ్రెజ్జా & టాటా నెక్సాన్ వంటి కాంపాక్ట్ SUVలు స్కోడా కైలాక్ ప్రత్యర్థి మోడళ్లు. ధర పరంగా, కైలాక్ సెగ్మెంట్‌లో కాస్త అధికంగా ఉంటుంది. అయితే, కైలాక్ కాంపాక్ట్ SUV విభాగంలో తాజా మోడల్ అని గమనించాలి. 5-స్టార్ భారత్ NCAP క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగిన కొన్నింటిలో ఇది కూడా ఒకటి.


3. స్కోడా కైలాక్‌లో సన్‌రూఫ్ ఉందా?


కైలాక్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది, కానీ టాప్‌ వేరియంట్‌ ప్రెస్టీజ్ ట్రిమ్ స్థాయిలో మాత్రమే ఉంటుంది. సన్‌రూఫ్‌ఫ్‌తో పాటు, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథరెట్ సీటింగ్‌, ప్యాడిల్ షిఫ్టర్లు, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 2 ట్వీటర్‌లతో 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో-డిమ్మింగ్ IRVM & మరిన్ని వంటి అద్భుతమైన సౌకర్యాలను పొందుతారు.


భద్రత సాంకేతికతలు


కైలాక్, 5-స్టార్ భారత్ NCAP స్కోర్‌ సాధించింది. బేస్‌ వేరియంట్‌లో కూడా ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్, EBD తో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఓవర్‌స్పీడ్ హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, అన్ని సీట్లకు రిమైండర్‌లతో 3-పాయింట్ సీట్ బెల్టులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్‌ వంటి భద్రతలు ఈ కారుకు ఉన్నాయి.


4. స్కోడా కైలాక్ ఏ ఇంజిన్‌ను కలిగి ఉంది?


కైలాక్ 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ పొందుతుంది, ఇది 115hp & 178Nmని జనరేట్‌ చేస్తుంది & 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. కైలాక్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు కాగ్స్‌ మార్చడానికి కొంచెం బలం అవసరం & క్లచ్ బరువుగా అనిపిస్తుంది, అయితే టార్క్ కన్వర్టర్ చాలా వరకు స్మూత్‌గా ఉంటుంది. కానీ, లోయర్‌ గేర్స్‌లో షిఫ్టింగ్‌ జెర్కీగా అనిపించవచ్చు.


5. స్కోడా కైలాక్ మైలేజ్ ఎంత?


కైలాక్ మాన్యువల్ వేరియంట్‌లు, ARAI- క్లెయిమ్ చేసిన ప్రకారం, 19.68 kmpl మైలేజీ ఇస్తాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లు 19.05 kmpl సంఖ్యను సాధిస్తాయి. అయితే, రియల్‌-వరల్డ్‌ ఇంధన సామర్థ్యం ప్రకారం... మాన్యువల్ వేరియంట్‌ సగటు (నగరం & హైవే) మైలేజీ 12.86 kmpl & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సగటు మైలేజీ 11.03 kmpl.


6. భారతదేశంలో స్కోడా కైలాక్‌ డిమాండ్‌ ఎలా ఉంది?


2025లో ఇది స్కోడా బ్రాండ్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌. 2025 జనవరి నుంచి జూన్ వరకు, స్కోడా భారతదేశంలో 23,714 యూనిట్లకు పైగా కైలాక్‌ను విక్రయించింది. ఈ కాంపాక్ట్ SUV స్కోడాకు భారీ విజయాన్ని అందించింది. ఏప్రిల్ 2025లో, దీని కోసం వెయిటింగ్‌ పిరియడ్‌ దాదాపు ఐదు నెలలు.


7. మారుతి బ్రెజ్జా స్కోడా కైలాక్ కంటే పెద్దదా?


కైలాక్ పెద్ద వీల్‌బేస్ కలిగి ఉంది, కానీ బ్రెజ్జాకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కైలాక్ 3,995mm పొడవు, 1,783mm వెడల్పు & 1,619mm ఎత్తు, 2,566mm వీల్‌బేస్ & 189mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కొలతలతో పోలిస్తే, బ్రెజ్జా వెడల్పు 7mm, ఎత్తు 66mm ఎక్కువ.  గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 9mm ఎక్కువ. రెండు కార్ల పొడవు ఒకటే & కైలాక్‌ వీల్‌బేస్‌ 66mm ఎక్కువ. కైలాక్ 360-లీటర్ బూట్ కూడా బ్రెజ్జా కంటే 32 లీటర్లు ఎక్కువ.


8. Skoda Kylaq లేదా Skoda Kushaq కొనాలా?


స్కోడా కుషాక్ లోపల మరింత విశాలంగా ఉంటుంది & బలమైన ఇంజిన్‌ ఉంది. స్కోడా కుషాక్ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 19.09 లక్షల వరకు ఉంటుంది, ధర పరంగా రెండూ దాదాపు ఒకే రేంజ్‌లో ఉన్నాయి. ఫీచర్ల పరంగా, కైలాక్ & కుషాక్ రెండూ వాస్తవంగా సరిపోతాయి. కానీ, ఇంజిన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, Kushaq నిస్సందేహంగా మంచి ఎంపిక. 


కుషాక్‌లో 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది, బలమైన 150hp పవర్‌ ఇస్తుంది. అయితే, ఈ ఇంజిన్‌ను కుషాక్ స్పోర్ట్‌లైన్ ట్రిమ్ (రూ. 17.69 లక్షలు) లో మాత్రమే పొందవచ్చు. మీ బడ్జెట్ దీనికంటే తక్కువ ఉంటే, మీకు ఉన్న ఏకైక ఎంపిక కైలాక్.