2026 Skoda Kushaq Facelift: స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఎట్టకేలకు తెరమీదకు వచ్చింది. కొత్త మోడల్‌లో డిజైన్‌ అప్‌డేట్స్‌, అదనపు ఫీచర్లు, కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వంటి కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా, ఈసారి స్కోడా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. గత మోడల్‌లో తర్వాత వచ్చినన Monte Carlo స్పోర్టీ వేరియంట్‌ను, ఈసారి మొదటి రోజే లైనప్‌లో చేర్చింది. ఇప్పుడు టాప్‌ ఎండ్‌లో Monte Carloతో పాటు Prestige ట్రిమ్‌ కూడా ఉంటుంది. రెండూ ఫుల్‌ లోడెడ్‌ వేరియంట్లే అయినా, వాటి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో తేడాలు

Skoda Kushaq Prestige కంటే Monte Carlo మరింత స్పోర్టీ ఫ్లేవర్‌తో కనిపిస్తుంది. Prestige వేరియంట్‌లో కనిపించే క్రోమ్‌ ఎలిమెంట్లను Monte Carlo పూర్తిగా తప్పించింది. వాటి స్థానంలో గ్లోస్‌ బ్లాక్‌ ట్రిమ్‌ వాడారు.

Continues below advertisement

ముందు భాగంలో Monte Carlo గ్రిల్‌ స్లాట్స్‌ అన్నీ బ్లాక్‌ ఫినిష్‌లో ఉంటాయి. వాటిలో రెండు స్లాట్స్‌ను రెడ్‌ కలర్‌తో హైలైట్‌ చేశారు. ఇది స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతుంది. ఈ రెడ్‌ స్లాట్స్‌ మధ్య చిన్న చెకర్డ్‌ ఫ్లాగ్‌ బ్యాడ్జ్‌ కూడా కనిపిస్తుంది. స్కిడ్‌ ప్లేట్‌ కూడా Prestige‌లో సిల్వర్‌గా ఉంటే, Monte Carloలో బ్లాక్‌ కలర్‌లో ఉంటుంది.

సైడ్‌ ప్రొఫైల్‌ చూస్తే, Monte Carloకి ఫ్రంట్‌ ఫెండర్లపై ప్రత్యేక బ్యాడ్జ్‌లు, ప్రత్యేక డిజైన్‌తో 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, రెడ్‌ బ్రేక్‌ క్యాలిపర్స్‌ ఇస్తారు. రూఫ్‌ రైల్స్‌, ORVMలు, విండో లైన్స్‌ అన్నీ బ్లాక్‌ ఫినిష్‌లో ఉంటాయి. వెనుక భాగంలో బ్లాక్‌ ‘KUSHAQ’ లెటరింగ్‌, ‘Monte Carlo’ బ్యాడ్జ్‌, బ్లాక్‌ బూట్‌ మోల్డింగ్‌, స్కిడ్‌ ప్లేట్‌ ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే… డ్యూయల్‌ టోన్‌ (బ్లాక్‌ రూఫ్‌) ఆప్షన్‌ కేవలం Monte Carlo వేరియంట్‌కే అందుబాటులో ఉంటుంది. బ్రిలియంట్‌ సిల్వర్‌, క్యాండీ వైట్‌, చెర్రీ రెడ్‌, శిమ్లా గ్రీన్‌, స్టీల్‌ గ్రే రంగుల్లో ఈ డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ వస్తుంది.

ఇంటీరియర్‌, కంఫర్ట్‌ ఫీల్‌

ఇంటీరియర్‌లో ఈ రెండు వేరియంట్ల మధ్య తేడా వెంటనే తెలుస్తుంది. Prestige వేరియంట్‌లో లైట్‌ బీజ్‌ కలర్‌ థీమ్‌ వాడారు. డ్యాష్‌బోర్డ్‌, డోర్‌ ప్యానెల్స్‌, సీట్లు అన్నీ ప్రీమియం, ఎయిరీ ఫీల్‌ ఇస్తాయి.

Monte Carlo వేరియంట్‌లో మాత్రం ఆల్‌ బ్లాక్‌ క్యాబిన్‌ ఉంటుంది. సెంట్రల్‌ డ్యాష్‌బోర్డ్‌, సెంటర్‌ కన్సోల్‌, డోర్‌ ట్రిమ్‌ పీసెస్‌పై క్రిమ్సన్‌ రెడ్‌ ఫినిష్‌ కనిపిస్తుంది. బ్లాక్‌ సీట్లపై క్రిమ్సన్‌ స్టిచింగ్‌ ఇవ్వడంతో ఇంటీరియర్‌ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

ఫీచర్ల విషయంలో తేడా ఉందా?

ఇక్కడే ఆసక్తికరమైన విషయం. ఫీచర్ల పరంగా Monte Carlo, Prestige రెండూ ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ... 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, 10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, ప్యానోరమిక్‌ సన్‌రూఫ్‌, రియర్‌ సీట్‌ మసాజ్‌ ఫంక్షన్‌, 6 స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌, వెంటిలేషన్‌తో 6-వే పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సార్లు వంటి ఫీచర్లు అందుతాయి.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ ఆప్షన్లు

ఇంజిన్‌ విషయంలో కూడా ఈ రెండు వేరియంట్ల మధ్య ఎలాంటి తేడా లేదు.

1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 115 hp

1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 150 hp

1.5 TSI ఇంజిన్‌కు 7-స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌ మాత్రమే ఇస్తారు. 1.0 TSIకి 6-స్పీడ్‌ మాన్యువల్‌, 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఆప్షన్లు ఉంటాయి. అయితే Monte Carlo, Prestige వేరియంట్లలో ప్రధానంగా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

చివరగా ఏది ఎంచుకోవాలి?

ప్రీమియం, సాఫ్ట్‌ లుక్‌ ఇష్టపడే వారికి Prestige సరిపోతే, స్పోర్టీ డిజైన్‌, బ్లాక్‌ థీమ్‌ కావాలనుకునే వారికి Monte Carlo బెస్ట్‌ ఎంపిక. ఫీచర్లు, ఇంజిన్‌, కంఫర్ట్‌ అన్నీ ఒకేలా ఉండటంతో, చివరకు మీ స్టైల్‌ ప్రిఫరెన్స్‌ మీదే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.