Skoda Kodiaq vs Volkswagen Tayron mileage: పెర్ఫార్మెన్స్‌తో పాటు మంచి డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వారికి స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌ SUVలు ఆసక్తికరమైన ఎంపికలు. ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి. ఆయా కంపెనీల ఫ్లాగ్‌షిప్ SUVలుగా కొనసాగుతున్నాయి. ధరలు కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి. అంతేకాదు, రెండింటిలోనూ ఒకే 2.0-లీటర్ EA888 టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. అయితే, ఈ కార్ల ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ మాత్రం భిన్నం. రియల్ వరల్డ్‌లో ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పరీక్షలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి.

Continues below advertisement

 ఇంజిన్, ధరలు

Skoda Kodiaq, Volkswagen Tayron R-Line రెండింటిలోనూ 1,984cc నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204hp పవర్, 320Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు SUVల్లోనూ 7-speed DCT గేర్‌బాక్స్‌ను అందించారు.

Continues below advertisement

అయితే బరువు, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం, ధరల్లో తేడాలున్నాయి.

వివరాలుSkoda KodiaqVolkswagen Tayron R-Line
ఇంజిన్2.0L టర్బో పెట్రోల్2.0L టర్బో పెట్రోల్
ఇంజిన్ సామర్థ్యం1,984cc1,984cc
పవర్204hp204hp
టార్క్320Nm320Nm
గేర్‌బాక్స్7-speed DCT7-speed DCT
ఫ్యూయల్ ట్యాంక్61 లీటర్లు62 లీటర్లు
కర్బ్ వెయిట్1,825kg1,864kg
క్లెయిమ్డ్ మైలేజీ14.86kplవెల్లడించలేదు
ధరరూ.36.99-46.99 లక్షలురూ.41.99-47.74 లక్షలు

Tayron కంటే Kodiaq 39kg తక్కువ బరువు ఉంది. Tayronతో పోలిస్తే దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఒక లీటర్ తక్కువ. ధరల పరంగా కూడా Kodiaq తక్కువ ధరకు అందుబాటులో ఉంది. Skoda తన SUV క్లెయిమ్డ్ మైలేజీని వెల్లడించగా, Volkswagen మాత్రం Tayron మైలేజీ వివరాలను ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!

 రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్‌లో ఏది బెస్ట్?

రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పరీక్షలో Kodiaq స్వల్ప ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా హైవే డ్రైవింగ్‌లో ఈ SUV మెరుగైన మైలేజీ ఇచ్చింది.

మైలేజీ వివరాలుSkoda KodiaqVolkswagen Tayron
సిటీ మైలేజీ8.23kpl8.30kpl
హైవే మైలేజీ13.43kpl12.30kpl
సగటు మైలేజీ10.83kpl10.30kpl
ఫుల్ ట్యాంక్ రేంజ్660.63km638.6km

సిటీ డ్రైవింగ్‌లో Volkswagen Tayron 8.30kpl మైలేజీ ఇచ్చింది. Kodiaq 8.23kpl మాత్రమే అందించింది. అంటే సిటీలో Tayron స్వల్పంగా 0.07kpl ఆధిక్యంలో ఉంది.

హైవే డ్రైవింగ్‌లో ఫలితం మారిపోయింది. Kodiaq 13.43kpl మైలేజీ ఇవ్వగా, Tayron 12.30kpl మాత్రమే ఇచ్చింది. అంటే హైవేలో Kodiaq 1.13kpl ఎక్కువ మైలేజీ అందించింది.

ఈ వ్యత్యాసానికి Tayron అధిక బరువు, వెడల్పైన టైర్లు, పెద్ద వీల్స్ కారణమని ఎక్స్‌పర్ట్‌లు పేర్కొన్నారు. Kodiaqలో 235/55 R18 టైర్లు ఉండగా, Tayronలో 255/45 R19 టైర్లు ఉన్నాయి.

మొత్తం మీద సగటు మైలేజీలో Kodiaq 10.83kplతో ముందుంది. Tayron 10.30kpl మాత్రమే ఇచ్చింది. అంటే Kodiaq ప్రతి లీటర్‌కు 0.53km ఎక్కువ ప్రయాణిస్తుంది. ఈ లెక్క ప్రకారం, ఫుల్ ట్యాంక్‌తో Kodiaq సుమారు 660.63km ప్రయాణించగలదు. Tayron రేంజ్ 638.6km. ఈ రెండింటి మధ్య తేడా దాదాపు 22km.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్‌లో క్లచ్ బాధ వద్దు.. రూ.6 లక్షల్లో వచ్చే ఈ 6 సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కార్లను పరిశీలించండి

 మైలేజీ పరీక్ష ఎలా నిర్వహించారు?

ఈ పరీక్షలో రెండు SUVలను Eco డ్రైవింగ్ మోడ్‌లోనే నడిపారు. రెండు కార్లలో Eco-coasting ఫంక్షన్ ఉంది. డ్రైవర్ యాక్సిలరేటర్ నుంచి కాలు తీసినప్పుడు ఇంజిన్ ఐడ్లింగ్‌లో ఉండేలా వాహనం ఫ్రీ-వీల్ అవుతుంది. ఆటో ఇంజిన్ Stop/Start వ్యవస్థ కూడా ఇంధన ఆదాకు సహాయపడుతుంది.

పరీక్షకు ముందు రెండు కార్ల ట్యాంకులను పూర్తిగా నింపారు. తయారీ సంస్థ సూచించిన విధంగా టైర్ ప్రెషర్‌ను సెట్ చేశారు. నవీ ముంబయి పరిసరాల్లోని సిటీ, హైవే మార్గాల్లో పరీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సగటు వేగాలను పాటించారు.

ప్రతి కారులో ఒక్కరే ప్రయాణించారు. ACని 22 డిగ్రీల వద్ద Full Auto మోడ్‌లో ఉంచారు. ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఇండికేటర్లు, వైపర్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ ఫీచర్లను సాధారణ వినియోగదారుల మాదిరిగానే అవసరమైనప్పుడు ఉపయోగించారు. డ్రైవింగ్ శైలిలో తేడాలు తగ్గించేందుకు మధ్య మధ్యలో డ్రైవర్లను కూడా మార్చారు. ప్రతి పరీక్ష ముగిసిన తర్వాత మళ్లీ ట్యాంక్‌ను పూర్తిగా నింపి, అలా నింపడానికి మళ్లీ ఎంత ఫ్యూయల్‌ అవసరమైందో చూసి, దానిని బట్టి వాస్తవ మైలేజీని లెక్కించారు.

 ఏ SUVని ఎంచుకోవాలి?

ఇంజిన్, పవర్, టార్క్, గేర్‌బాక్స్ విషయంలో Skoda Kodiaq, Volkswagen Tayron రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయి. సిటీ మైలేజీలో Tayron స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, హైవే మైలేజీ, సగటు మైలేజీ, ఫుల్ ట్యాంక్ రేంజ్ విషయంలో Kodiaq ముందుంది. అంతేకాదు, Kodiaq ధర కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఈ పరీక్షలో మైలేజీ, ధరలను పరిగణనలోకి తీసుకుంటే Skoda Kodiaqకు స్వల్ప ఆధిక్యం లభించింది.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.