Simple One Gen 2 Electric Scooter Price And Features: భారతదేశ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి Simple Energy తాజాగా తీసుకొచ్చిన మోడల్‌ Simple One Gen 2. ఈ కొత్త జెన్‌ మోడల్‌ 4.5kWh, 5kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌పర్ట్‌లు 5kWh బ్యాటరీ వేరియంట్‌ను రైడ్‌ చేసి వారి ఎక్స్‌పీరియన్స్‌ను రాశారు. వాళ్ల అనుభవం ఆధారంగా, ఈ స్కూటర్‌ను ఎందుకు కొనాలి, అలాగే ఎందుకు స్కిప్‌ చేయొచ్చు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

Simple One Gen 2 కొనదగిన 3 ప్రధాన కారణాలు

1) Air మోడ్‌లో స్మూత్‌ పెర్ఫార్మెన్స్‌

Continues below advertisement

Simple One Gen 2లో మొత్తం ఆరు రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. Eco X, Eco, Ride, Air, Sonic, Sonic X అనే మోడ్స్‌తో రైడర్‌కు విస్తృత ఎంపిక లభిస్తోంది. వీటిలో Air మోడ్‌ మిడిల్‌ రేంజ్‌లో ఉండటం వల్ల నగర ప్రయాణాలకు, హైవే డ్రైవ్‌కు మంచి బ్యాలెన్స్‌ ఇస్తుంది. యాక్సిలరేషన్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా 85 kmph స్పీడ్‌ వద్ద సాఫీగా వెళ్లగలగడం ఈ మోడ్‌లో ప్రధాన ప్లస్‌ పాయింట్‌.

2) మెరుగైన కంఫర్ట్‌

Simple One Gen 2లో ముందు, వెనుక సస్పెన్షన్‌ను రీట్యూన్‌ చేశారు. తక్కువ స్పీడ్‌లో స్పీడ్‌ బ్రేకర్లు, చిన్న గుంతలపై వెళ్లినప్పుడు రైడ్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. రోజువారీ నగర ప్రయాణాల్లో ఇది స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఎక్కువ స్పీడ్‌లో పెద్ద గుంతలు ఎదురైనప్పుడు కొంచం వణుకుతున్న ఫీల్‌ వస్తుంది. అయినప్పటికీ, సాధారణ వినియోగానికి కంఫర్ట్‌ విషయంలో ఇది మంచి స్కూటర్‌నే.

3) పాత మోడల్‌తో పోలిస్తే మెరుగుదల

ఈ జెన్‌ మోడల్‌లో పెద్ద మార్పు బ్యాటరీ సెటప్‌. ముందు ఉన్న రిమూవబుల్‌ బ్యాటరీకి బదులు ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్‌ మౌంటెడ్‌ ఫిక్స్‌డ్‌ 5kWh బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గింది. మొత్తం బ్యాటరీ బరువు 30 కిలోలు మాత్రమే, అంటే ముందు మోడల్‌తో పోలిస్తే దాదాపు 4 కిలోలు తక్కువ. IDC ప్రకారం రేంజ్‌ 248 km నుంచి 265 kmకు పెరిగింది. బ్యాటరీని కింద అమర్చడం వల్ల సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ మెరుగై, హ్యాండ్లింగ్‌ కూడా బాగుంది.

Simple One Gen 2 స్కిప్‌ చేయాల్సిన 2 కారణాలు

1) ఎక్కువ స్పీడ్‌లో స్థిరత్వ లోపం

తక్కువ, మధ్య స్పీడ్‌లో స్కూటర్‌ బాగా కంట్రోల్‌లో ఉంటుంది. కానీ Sonic, Sonic X మోడ్స్‌లో 95 kmph పైగా వెళ్లినప్పుడు హ్యాండిల్‌బార్‌ వద్ద ప్రకంపనలు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ముందు భాగంలో అస్థిరతను కలిగిస్తుంది. ఒకే స్కూటర్‌లో కాకుండా, ఎక్కువ స్కూటర్లలోనూ ఇదే సమస్య కనిపించడంతో, హై స్పీడ్‌ రైడింగ్‌ కోరుకునే వారికి ఇది మైనస్‌ పాయింట్‌.

2) ఫీచర్ల ఫంక్షనాలిటీ

ఈ స్కూటర్‌లో ఫీచర్ల లిస్ట్‌ చాలా పెద్దది. ఎడమ వైపు ఇచ్చిన జాయ్‌స్టిక్‌ ద్వారా అనేక ఆప్షన్లను యాక్సెస్‌ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే, జాయ్‌స్టిక్‌ ప్రతిసారి సరిగ్గా స్పందించకపోవడాన్ని ఎక్స్‌పర్ట్‌లు గమనించారు. కొన్ని సార్లు ఒకే ఆప్షన్‌కు రెండు మూడు సార్లు ప్రెస్‌ చేయాల్సి వచ్చింది. ఫీచర్లు ఉన్నా, వాటి ఫంక్షనాలిటీ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది.

Simple One Gen 2 ఆన్‌రోడ్‌ ధరలు

విజయవాడలో ఆన్‌రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,69,999EMPS 2024 సబ్సిడీ: - ₹ 5,000RTO: ₹ 21,900ఇన్సూరెన్స్‌: ₹ 7,385ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,94,284

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,69,999EMPS 2024 సబ్సిడీ: - ₹ 5,000RTO: ₹ 1,500ఇన్సూరెన్స్‌: ₹ 7,449ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,73,948

మొత్తానికి, Simple One Gen 2 నగర వినియోగానికి, మంచి రేంజ్‌ కోరుకునే వారికి సరైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. కానీ హై స్పీడ్‌ రైడింగ్‌, పర్ఫెక్ట్‌ ఫీచర్‌ రెస్పాన్స్‌ ఆశించే వారు ఒకసారి టెస్ట్‌ రైడ్‌ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.