Best Automatic Car Under Rs 10 Lakhs: రూ.10 లక్షల బడ్జెట్‌లో మీకు సరిపోయే బూట్ స్పేస్‌ ఉండే, పవర్ కూడా తగ్గకుండా, పైగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే కార్ కావాలంటే ఆప్షన్లు చాలా ఎక్కువగా ఉండవు. కానీ ఈ అన్ని అవసరాలను ఒకేసారి తీర్చగల మోడల్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది, అది - Tata Nexon Smart + S AMT.

Continues below advertisement

ఈ వేరియంట్‌ ధర 10 లక్షల పరిధిలో ఉండటంతో పాటు, ధర–ఫీచర్లు–పర్ఫార్మెన్స్ పరంగా బాగా బ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా, 1.2 లీటర్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, మంచి బూట్ స్పేస్ - ఈ మూడు కూడా ఇందులో లభిస్తాయి.

బూట్ స్పేస్ ఎందుకు ముఖ్యమంటే?కుటుంబ ప్రయాణాల కోసం, వీకెండ్‌ ట్రిప్స్‌ కోసం చాలా మంది ఎంచుకునేది కార్‌నే. ఇలాంటప్పుడు బూట్ స్పేస్ కీలకం అవుతుంది. టాటా నెక్సాన్‌లో 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ సైజ్‌లోని కార్లలో ఇది మంచి ఫిగర్‌. పెద్ద ట్రావెల్ బ్యాగులు, వారాంతపు సామాను, చిన్న కుటుంబం లగేజ్ వంటివన్నీ సులభంగా పెట్టుకోవచ్చు.

Continues below advertisement

1.2 L టర్బో ఇంజిన్ – పవర్ కూడా తగ్గదుడీసెంట్‌ పవర్‌ కోసం 1.2 లీటర్ ఇంజిన్ కచ్చితంగా ఉండాలి అని కోరుకునేవాళ్ల కోసమే తయారైంది నెక్సాన్. ఇందులో ఉన్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ శక్తిమంతమైన పికప్ ఇస్తుంది. ఓవర్‌టేక్‌లు చేయడానికి, హైవే డ్రైవింగ్‌కి అవసరమైన పవర్‌ మాత్రమే కాకుండా, స్పోర్టీ ఫీలింగ్ కూడా ఇస్తుంది. డ్రైవర్‌కు డ్రైవింగ్‌ బోర్ రాకుండా చూసుకుంటే, మంచి ఫీలింగ్ ఇవ్వడం ఈ ఇంజిన్‌ ప్రత్యేకత.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ – సిటీ డ్రైవ్‌లో కంఫర్ట్ఇందులో AMT గేర్‌బాక్స్‌ ఉంటుంది. AMT ఎక్కువగా స్మూత్ కాకపోయినా, సిటీ ట్రాఫిక్‌లో మాత్రం డ్రైవింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నెక్సాన్ Smart + S AMT ఈ ప్రయోజనాన్ని మీ బడ్జెట్‌లోనే అందిస్తుంది.

భద్రత – ఇదే నెక్సాన్ USPమీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, టాటా నెక్సాన్ భారత మార్కెట్లో భద్రత పరంగా బెస్ట్ క్రాష్ రేటింగ్ సాధించిన కార్లలో ఒకటి. ఇది మీ కుటుంబ ప్రయాణానికి అదనపు విశ్వాసం ఇస్తుంది.

ఎందుకు ఇదే బెస్ట్ ఆప్షన్?

  • రూ.10 లక్షల బడ్జెట్‌
  • పెద్ద బూట్ స్పేస్
  • 1.2 టర్బో ఇంజిన్‌ శక్తి
  • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
  • టాటా బ్రాండ్ భద్రత
  •  స్టైలిష్ డిజైన్

ఇవన్నీ ఒకేసారి ఇచ్చే కార్ చాలా అరుదు. అందుకే నెక్సాన్ Smart + S AMT మీ అవసరాన్ని కచ్చితంగా తీర్చగల బెస్ట్ ఎంపికగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.