Royal Enfield Hunter 350 vs Triumph Speed T4 News: ఇండియ‌న్ మిడ్-కెపాసిటీ బైక్ మార్కెట్లో ఇప్పుడు కొత్త సందడి మొదలైంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తన 350cc లైనప్‌ను స్పీడ్ T4, స్పీడ్ 400, త్రక్స్టన్, స్క్రాంబ్లర్ వెర్షన్లతో విస్తరించింది. మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన పాపులర్ మోడల్ హంటర్ 350ని సరికొత్త మార్పులతో రీఫ్రెష్ చేసింది. సిటీ రైడర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వచ్చిన ఈ రెండు బైకులలో ఏది బెస్ట్ అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

ఇంజిన్ సామర్థ్యం - పర్ఫార్మెన్స్..రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో మనకు సుపరిచితమైన 349cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ J-సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ మోటార్ 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ రైడింగ్ కోసం ఇది చాలా బాగుంటుంది. ఇక కొత్తగా వచ్చిన ట్రయంఫ్ స్పీడ్ T4 విషయానికి వస్తే, ఇందులో కూడా 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఇది హంటర్ కంటే ఎక్కువ పవర్ అంటే 29 hp, 31 Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉండటమే కాకుండా టార్క్-అసిస్ట్ క్లచ్ సదుపాయం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పాత 398cc మోడల్ కంటే కొంచెం పవర్ తగ్గినా, హంటర్‌తో పోలిస్తే మాత్రం ఇది చాలా శక్తివంతమైనది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Continues below advertisement

హార్డ్‌వేర్ - సస్పెన్షన్..హంటర్ 350 ట్విన్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. 2025 అప్‌డేట్‌లో భాగంగా సస్పెన్షన్ ట్యూనింగ్ మార్చారు. దీనివల్ల గతుకుల రోడ్లపై ప్రయాణం మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 10 మిమీ పెరిగి 160 మిమీకి చేరుకుంది. బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఉంది. ట్రయంఫ్ స్పీడ్ T4 లైట్ వెయిట్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్‌ ఆర్మ్‌తో వస్తుంది. ముందు వైపు 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు అడ్జస్టబుల్ మోనోషాక్ ఉండటం వల్ల ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రేడియల్ కాలిపర్ ఉన్న 300 మిమీ ఫ్రంట్ డిస్క్ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ధరల వివరాలు..బడ్జెట్ విషయానికి వస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెట్రో బైకుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది ఒక చౌకైన ఆప్షన్. అదేవిధంగా ట్రయంఫ్ స్పీడ్ T4 350 ప్రారంభ ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్కువ పవర్, ప్రీమియం హార్డ్‌వేర్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్ అవుతుంది. ఓవ‌రాల్ గా చెప్పాలంటే, తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే సిటీ బైక్ కావాలంటే హంటర్ బెస్ట్. అలా కాకుండా హై-పర్ఫార్మెన్స్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే ట్రయంఫ్ స్పీడ్ T4 వైపు మొగ్గు చూపవచ్చని విశ్లేష‌కులు అంటున్నారు.