రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో ప్రజాదరణ పొందిన, చవకైన బైక్ హంటర్ 350 నుంచి 2026 మోడల్‌ను విడుదల చేసింది. ఈసారి కంపెనీ ఇందులో కొత్త వేరియంట్‌లు, కొత్త రంగు ఆప్షన్లు తీసుకొచ్చింది. లక్నోలో ఈ బైక్‌ను ప్రదర్శించడంతో పాటు లాంచింగ్ కార్యక్రమం జరిగింది. కొత్త హంటర్ 350 బుకింగ్ ఏప్రిల్ 4 అనగా ఈ రోజు (శనివారం) నుండి భారత్ అంతటా ప్రారంభమైంది. హంటర్ 350 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,49,900. ఇది బేస్ ప్రీమియం వేరియంట్ ధర. హంటర్ టాప్ వేరియంట్ ధర రూ. 1,69,804 వరకు ఉంది. ఈ ధరతో, ఈ బైక్ దాని విభాగంలో బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.

Continues below advertisement

కొత్త బేస్ ప్రీమియం వేరియంట్ ప్రత్యేకత ఏమిటి?

ఈసారి అతిపెద్ద మార్పు కొత్త “బేస్ ప్రీమియం” వేరియంట్ తీసుకురావడం. ఇది ప్రత్యేకంగా కస్టమర్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చారు. గతంలో బేస్ మోడల్‌లో కొన్ని ఫీచర్లలో అంత సరిగ్గా లేదు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అందులో అవసరమైన మార్పులు చేసింది. ఈ హంటర్ వేరియంట్‌లో ఇప్పుడు స్పోక్ వీల్స్‌కు బదులుగా అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. దీనివల్ల హంటర్ 350 బైక్ రూపురేఖలు, పనితీరు రెండూ మెరుగుపడతాయి. దీనితో పాటు, ఇందులో డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్విచ్‌గేర్ ఇచ్చారు. ఇది మోడ్రన్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ మార్పు ముఖ్యంగా తక్కువ ధరలో మంచి ఫీచర్‌లను కోరుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

హంటర్ 350 ఫీచర్లు, భద్రతలో మెరుగుదల

కొత్త హంటర్ 350లో ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లపై కూడా ఫోకస్ చేశారు. ఇందులో కొత్త స్టిచ్డ్ సీటు ఇచ్చారు. దీనివల్ల కూర్చోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే స్పోర్టీ గ్రాబ్ రైల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్‌లను కూడా జోడించారు. హంటర్ 350 సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు. ఇది బ్రేకింగ్ సమయంలో సరిగ్గా నియంత్రణను అందిస్తుంది. ఈ అన్ని ఫీచర్ల కారణంగా, ఈ బైక్ రోజువారీ ఉపయోగం కోసం మరింత సౌకర్యవంతంగా, సేఫ్టీగానూ మారుతుంది.

Continues below advertisement

కొత్త రంగులతో యువతను ఆకర్షిస్తున్న బైక్ 

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్లప్పుడూ తన అద్భుతమైన కలర్ ఎంపికలతో మార్కెట్లోకి వస్తోంది. ఈసారి కూడా కంపెనీ నిరాశపరచలేదు. హంటర్ 350 టాప్ వేరియంట్‌లో ముంబై ఎల్లో, మూన్‌షాట్ వైట్ వంటి కొత్త, ఆకర్షణీయమైన రంగులను కలిపి ఇచ్చింది.  ఈ రంగులు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు.  దీనివల్ల బైక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కొత్త రంగులు, ఫీచర్లతో హంటర్ 350 నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో సైతం వేగంగా కస్టమర్ల ఆదరణ పొందుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ భావిస్తోంది.