Royal Enfield Hunter 350 Review: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ J సిరీస్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఇప్పటికే అనేక బైక్‌లు వచ్చాయి. ప్రతి బైక్‌కి ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్‌ ఉంది. కానీ ఆ లైనప్‌లో అత్యంత లైట్‌, సిటీ యూజ్‌కి బాగా సరిపోయే, చురుకైన బైక్‌ ఏదంటే... Hunter 350 అనే సమాధానం వస్తుంది. అందుకే చాలా మంది దీనిని డైలీ ఆఫీస్‌ కమ్యూట్‌ కోసం కొంటున్నారు. మరి నిజంగా ఇది రోజూ ఆఫీస్‌ వెళ్లేవారికి ఎంతవరకు సరిపోతుందో తెలుసుకోవడానికి ఎక్స్‌పర్ట్‌లు రెగ్యులర్‌ రూట్‌లో టెస్ట్‌ చేశారు.

Continues below advertisement

J సిరీస్‌ ఇంజిన్‌ అనుభవం

Hunter 350లో ఉన్న J సిరీస్‌ 349cc ఇంజిన్‌ నగర రైడింగ్‌లో చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఎక్స్‌పర్ట్‌ల రోజువారీ రూట్‌లో భాగమైన హైవే స్ట్రెచ్‌లో, నాలుగో గేర్‌లోనే గంటకు 80 కి.మీ. వేగంతో బస్సులను ఓవర్‌టేక్‌ చేయడం సులభంగా అనిపించింది. లో ఎండ్‌ టార్క్‌ బాగా ఉపయోగపడుతుంది.

Continues below advertisement

అయితే, ఈ మోటార్‌ సైకిల్‌ గంటకు 100 కి.మీ. వేగం దాటాలంటే కొంచెం శ్రమ పడుతుంది. ఆ సమయంలో స్వల్పంగా వైబ్రేషన్లు కూడా కనిపిస్తాయి. వేగంగా దూసుకెళ్లే స్టైల్‌ కన్నా, 60-70 కి.మీ. మధ్య కంఫర్ట్‌గా క్రూయిజ్‌ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్‌ జోన్‌.

ట్రాఫిక్‌లో Hunter 350 ఎలా ఉంది?

ఆఫీస్‌ కమ్యూట్‌ అంటే ట్రాఫిక్‌ తప్పదు. ఈ విషయంలో Hunter 350 అంచనాల కంటే కూడా మెరుగ్గా నిలిచింది. క్లచ్‌ చాలా లైట్‌గా ఉంటుంది. ఎక్కువ సేపు స్టాప్‌ అండ్‌ గో ట్రాఫిక్‌లో నడిపినా చేతికి అలసట తక్కువగా ఉంటుంది.

ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి ప్రత్యేకమైన థంప్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఆ శబ్దం చాలామందికి చాలా ఇష్టం & ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేస్తుంది.

రైడ్‌ కంఫర్ట్‌, హ్యాండ్లింగ్‌

41mm టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, డ్యుయల్‌ గ్యాస్‌ చార్జ్డ్‌ షాక్స్‌తో Hunter 350 రైడ్‌ క్వాలిటీ మెరుగైంది. ఇది చాలా సాఫ్ట్‌గా కాకపోయినా, గుంతలు ఉన్న రోడ్లపై ఇబ్బంది పెట్టదు.

హైవే మీద బైక్‌ బాగా గ్రిప్పీగా అనిపిస్తుంది. 140 సెక్షన్‌ రియర్‌ టైర్‌ కారణంగా మలుపుల్లో, రౌండ్‌అబౌట్స్‌లోనూ మంచి నమ్మకం ఇస్తుంది. చిన్న వీధుల్లో యూ టర్న్స్‌ తిప్పడం కూడా సులభంగా అనిపించింది.

బ్రేకింగ్‌ పనితీరు

ముందు 300mm డిస్క్‌, వెనుక 270mm డిస్క్‌ రోజువారీ నగర వినియోగానికి సరిపడే పనితీరుని ఇస్తాయి. హైవే వేగాల్లో మొదటి బైట్‌ బాగానే ఉన్నా, ఇంకా కాస్త స్టాపింగ్‌ (బ్రేకింగ్‌) పవర్‌ ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినా సిటీ కమ్యూట్‌కి ఇది పెద్ద లోపం కాదు.

ఫీచర్లు, కన్సోల్‌

సెమీ డిజిటల్‌ కన్సోల్‌లో స్పీడోమీటర్‌, ట్రిప్‌ మీటర్‌, ఫ్యూయల్‌ గేజ్‌, సర్వీస్‌ రిమైండర్‌ స్పష్టంగా కనిపిస్తాయి. ఎండలో కూడా రీడింగ్‌ సమస్య లేదు. ట్రిప్పర్‌ నావిగేషన్‌ ఫీచర్‌ ట్రాఫిక్‌ జామ్‌లను తప్పించుకోవడంలో ఉపయోగపడుతుంది.

రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌

డైలీ సిటీ-హైవే మిక్స్‌ రైడింగ్‌లో Hunter 350 మైలేజ్‌ 32-34 kmpl మధ్య నమోదైంది. వేగం తగ్గించి స్థిరంగా నడిపితే ఇంకా మెరుగైన మైలేజ్‌ వస్తుంది.

ఎర్గోనామిక్స్‌, డిజైన్‌

181 కిలోల బరువుతో ఇది J సిరీస్‌లోనే లైట్‌ బైక్‌. సీటింగ్‌ పొజిషన్‌ న్యూట్రల్‌గా ఉండటంతో 1-2 గంటల రైడ్‌లోనూ అలసట రాదు. పిలియన్‌ (వెనుక) సీట్‌ తక్కువ దూరం ప్రయాణాలకు సరిపోతుంది.

ఫైనల్‌గా

రూ. 1.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమయ్యే Hunter 350, రోజువారీ ఆఫీస్‌ కమ్యూట్‌ కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ J సిరీస్‌లో బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది. 100% పర్ఫెక్ట్‌ కాకపోయినా, ప్రాక్టికాలిటీ, కంఫర్ట్‌, బ్రాండ్‌ ఫీల్‌ కోరుకునే వారికి ఇది సరైన బైక్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.