Royal Enfield New Bike Launch India: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (RE) ప్రతిసారి కొత్త మోడల్‌ తీసుకొచ్చినప్పుడు యంగ్‌ రైడర్లు ఫుల్‌ ఎగ్జైట్‌ అవుతారు. ఇప్పుడు అదే వైబ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లేలా "హిమాలయన్‌ మనా బ్లాక్‌ ఎడిషన్‌" లాంచ్‌ చేసింది. ఇటలీలో జరిగిన EICMA 2025లో ఫస్ట్‌ లుక్‌ చూపించి, ఇప్పుడు Motoverse 2025 స్టేజ్‌పై ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను అధికారికంగా రిలీజ్‌ చేసింది.

Continues below advertisement

ఈ మోడల్‌ స్పెషల్‌గా కనిపించే కారణం ఏంటంటే, ఇదొక సింపుల్‌ కలర్‌ అప్‌డేట్‌ మాత్రమే కాదు… ఫ్యాక్టరీ ఫిటెడ్‌ అడ్వెంచర్‌ యాక్సెసరీస్‌తో పుట్టుకతోనే అడ్వెంచర్‌ రెడీగా మారింది.

మనా బ్లాక్‌ ఎడిషన్‌లో కొత్తగా వచ్చిందేంటి?

Continues below advertisement

ఈ బైక్‌ లో ప్రధాన ఆకర్షణ దాని ఆల్‌-బ్లాక్‌ లుక్‌. బాడీ మొత్తం బ్లాక్‌తో పాటు మ్యాట్‌ గ్రే టచ్‌ ఇచ్చారు. రోడ్డుపై ఎవరు చూసినా వెంటనే “ఇది స్పెషల్‌ ఎడిషన్‌” కదా అని ఫీలయ్యేలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ వెర్షన్‌లో ఫ్యాక్టరీలోనే అమర్చిన యాక్సెసరీస్‌ యూత్‌ రైడర్లను స్పెషల్‌గా అట్రాక్ట్‌ చేస్తాయి, అవి:

  • నక్కుల్‌ గార్డ్స్‌ – ఆఫ్‌రోడ్‌, హైవే రెండింట్లోనూ హ్యాండ్‌ ప్రొటెక్షన్‌
  • టాలర్‌ & ఫ్లాట్‌ ర్యాలీ సీట్‌ – ఎక్కువ సేపు రైడ్‌ చేసే వాళ్లకు కంఫర్ట్‌
  • హై మౌంటెడ్‌ ఫ్రంట్‌ మడ్‌గార్డ్‌ – అడ్వెంచర్‌ లుక్‌కు పర్‌ఫెక్ట్‌
  • ట్యూబ్‌లెస్‌ వైర్‌-స్పోక్‌ వీల్స్‌ – ఆఫ్‌రోడ్‌కు మస్త్‌ బూస్ట్‌

ఇవన్నీ ఎక్స్‌ట్రా మనీ పెట్టి కొనాల్సినవి కావు… ఈ ఎడిషన్‌లోనే డైరెక్ట్‌గా వస్తాయి. ఇదే ఈ మోడల్‌కి పెద్ద హైలైట్‌.

ఇంజిన్‌ & పెర్ఫార్మెన్స్‌: అదే 452cc పవర్‌

మనా బ్లాక్‌ ఎడిషన్‌ స్టైల్‌ & యాక్సెసరీస్‌ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ, మెకానికల్‌ సైడ్‌ మాత్రం స్టాండర్డ్‌ హిమాలయన్‌ 450తోనే పూర్తిగా సమానంగా ఉంటుంది. దీనిలో...

  • 452cc లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌
  • 40hp పవర్‌ @ 8000rpm
  • 40Nm టార్క్‌ @ 5500rpm

200mm సస్పెన్షన్‌ ట్రావెల్‌ (ఫ్రంట్‌, రియర్‌ రెండింటికీ)

అంటే సిటీ, హైవే, ఘాట్స్‌, ఆఫ్‌రోడ్‌… ఎక్కడికైనా తీసుకెళ్లేంత పవర్‌ఫుల్‌ సెటప్‌ ఇక్కడ రెడీగా ఉంది.

బుకింగ్స్‌ ఓపెన్ - ధర ఎంతంటే?

కలర్‌, ఫీచర్లు అప్‌డేట్‌ అయ్యేసరికి కానీ ధర కూడా కొంచెం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ మనా బ్లాక్‌ ఎడిషన్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹3.37 లక్షలు. దీనికి ముందున్న స్టాండర్డ్‌ వెర్షన్లు ₹3.06 లక్షలు నుండి ₹3.20 లక్షల వరకు ఉన్నాయి. అంటే మనా బ్లాక్‌ ఎడిషన్‌ ధర కొంచెం ప్రీమియంగా ఉంటుంది, కానీ ఫ్యాక్టరీ యాక్సెసరీస్‌ అడ్వాంటేజ్‌ చూసుకుంటే అది పూర్తిగా జస్టిఫై అవుతుంది.

RE హిమాలయన్‌ మనా బ్లాక్‌ ఎడిషన్‌ కోసం ఇప్పటికే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ యాప్‌, వెబ్‌సైట్‌, అన్ని డీలర్‌షిప్‌ల్లో బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి. లుక్స్‌ యూనిక్‌గా, యాక్సెసరీస్‌ రెడీగా ఉండటం, ఆఫ్‌రోడ్‌ ఫ్రెండ్లీ సెటప్‌, సిటీ‌లో కూడా ఈజీగా నడిపించే ఇంజిన్‌ - అన్నీ కలిపి ఈ మోటార్‌ సైకిల్‌ను యూత్‌ సెగ్మెంట్‌కు సరిగ్గా సరిపోయేలా చేస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.