Himalayan vs KTM Bikes Comparison 2025: GST 2.0 రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత 350cc కంటే ఎక్కువ ఇంజిన్‌ ఉన్న బైక్‌ల ధరలు పెరిగాయి. 350cc కంటే తక్కువ ఇంజిన్‌ బైక్‌ల రేట్లు మాత్రం తగ్గి, మరింత చకగా మారాయి. ఈ మార్పు వల్ల అడ్వెంచర్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 & KTM 390 అడ్వెంచర్‌ X మధ్య మంచి పోటీ మొదలైంది. ఇప్పుడు వీటి ధరలలో ఎంత మార్పు వచ్చిందో పరిశీలిద్దాం.

Continues below advertisement

GST 2.0 తర్వాత Royal Enfield Himalayan 450 ధర హిమాలయన్‌ 450 ధరలు ఇప్పుడు పెరిగాయి. GST 2.0 కు ముందు ఈ బైక్‌ ధర రూ. 2.85 లక్షల నుంచి రూ. 2.98 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉండేది. కొత్త GST 2.0 రేట్లు వర్తించడంతో ఇప్పుడు ఈ బైక్‌ ధరలు రూ. 3.06 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) పెరిగాయి. హన్లే బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ అత్యధిక ధర కలిగి ఉంది.

హిమాలయన్‌ 450లో 452cc లిక్విడ్‌-కూల్డ్‌ “షెర్పా” ఇంజిన్‌ ఉంది, ఇది 40hp పవర్‌, 40Nm టార్క్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌ సిక్స్‌-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంది. ఆఫ్‌-రోడ్‌ రైడింగ్‌ కోసం ఇది సాలిడ్‌గా ఉంటుంది. కానీ కొత్త GST ప్రభావంతో ధర పెరగడం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ లవర్స్‌కు కొంచెం షాక్‌.

Continues below advertisement

GST 2.0 తర్వాత KTM 390 Adventure X ధర KTM మాత్రం, తన ప్రియమైన కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. 390 అడ్వెంచర్‌ X ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. GST 2.0 కు ముందు ఇది రూ. 2.90 లక్షలకు (ఎక్స్‌-షోరూమ్‌) లాంచ్‌ అయింది. ఆ తరువాత కొన్ని ప్రీమియం ఫీచర్లు - క్రూయిజ్‌ కంట్రోల్‌, రైడింగ్‌ మోడ్స్‌ (స్ట్రీట్‌, రైన్‌, ఆఫ్‌-రోడ్‌), కార్నరింగ్‌ ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటివి జత చేయడంతో ధర రూ. 3.03 లక్షలకు (ఎక్స్‌-షోరూమ్‌) పెరిగింది. ఇప్పుడు, GST 2.0 తర్వాత కూడా అదే ధర కొనసాగుతోంది. అదనపు GST ఖర్చును KTM కంపెనీయే భరించింది, కస్టమర్‌పై వేయలేదు. అందుకే ఈ బైక్‌ విలువకు తగ్గ బెస్ట్‌ ప్యాకేజ్‌గా మారింది.

ప్రధాన ఫీచర్లు & పోలికఈ రెండు బైక్‌లు 400సీసీ రేంజ్‌లో ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా KTM ముందంజలో ఉంది. KTMలో అలాయ్‌ వీల్స్‌ (19-ఇంచ్‌ ముందు, 17-ఇంచ్‌ వెనుక) వస్తాయి, ట్యూబ్‌లెస్‌ టైర్లు ఉంటాయి. హిమాలయన్‌ 450లో అయితే స్పోక్‌ వీల్స్‌ ఉంటాయి, ట్యూబ్‌లెస్‌ టైర్లు కావాలంటే అదనపు చెల్లింపు చేయాలి.

ఏ బైక్‌ ముందంజలో ఉంది?GST 2.0 కి ముందు హిమాలయన్‌ 450 కొంచెం అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. KTM 390 అడ్వెంచర్‌ X ను హిమాలయన్‌ 450 టాప్‌ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. 17,000 తక్కువ ధరలో లభిస్తోంది.

ఫీచర్లు, టెక్నాలజీ పరంగా KTM ముందుంది. అయితే, హిమాలయన్‌ ఆఫ్‌-రోడ్‌ ప్రదర్శనలో మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీ రైడింగ్‌ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు - ఫీచర్‌ లవర్స్‌కు KTM బెస్ట్‌, అడ్వెంచర్‌ స్పిరిట్‌ ఉన్నవారికి హిమాలయన్‌ పర్ఫెక్ట్‌.