Updated Royal Enfield Hunter 350 Features Price: రాయల్ ఎన్‌ఫీల్డ్‌, తన చౌకైన బైక్ హంటర్ 350 ని కొత్త అవతారంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని కొత్త కలర్ ఆప్షన్ "గ్రాఫైట్ గ్రే"లో ‍‌(Hunter 350 Graphite Grey) కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త రంగు మిడ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది & హంటర్ మొత్తం 7 కలర్ ఆప్షన్స్‌కు యాడ్‌ అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఈ బండిని దాదాపు రూ. 1.82 లక్షల ఆన్‌-రోడ్‌ ధర (Hunter 350 on-road, Hyderabad Vijayawada) నుంచి కొనుగోలు చేయవచ్చు.

హంటర్‌ 350 లుక్స్‌రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 కాంపాక్ట్‌ & స్పోర్టీ డిజైన్‌తో నగర రైడింగ్‌కు పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. రెట్రో స్టైల్‌తో పాటు మోడర్న్‌ టచ్‌ కలిగిన రౌండ్‌ హెడ్‌ల్యాంప్స్‌ & షార్ప్‌ ట్యాంక్‌ డిజైన్‌ దానికి ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి. తక్కువ సీటు ఎత్తు, వెడల్పైన హ్యాండిల్‌బార్‌ రైడర్‌కి కంఫర్ట్‌ & కంట్రోల్‌ ఇస్తాయి. రంగుల కాంబినేషన్లు, నాణ్యమైన ఫినిషింగ్‌తో హంటర్‌ 350 రోడ్డు మీద అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.      

హంటర్‌ 350 అప్‌గ్రేడెడ్‌ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లు యాడ్‌ అయ్యాయి. ఈ లిస్ట్‌లో.. LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ & టైప్-సి USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి. సీటును అధిక సాంద్రత కలిగిన ఫోమ్‌తో అందించారు, ఇది లాంగ్ రైడ్‌లకు ప్రత్యేకంగా సరిపోతుంది. బైక్ కొత్త రియర్‌ సస్పెన్షన్ & మెరుగైన సీటింగ్ సౌకర్యం వంటి ఫీచర్లు రైడర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి & సౌకర్యవంతమైన రైడ్ అందిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 పవర్ & బుకింగ్ఇంజిన్ దగ్గరకు వస్తే, హంటర్ 350 లో 349cc J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 bhp పవర్‌ను & 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. అంటే, రైడింగ్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో, అంత స్మూత్‌గా కూడా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350  కొత్త కలర్ ఎడిషన్ (గ్రాఫైట్ గ్రే) కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనిని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ డీలర్‌షిప్‌, అధికారిక వెబ్‌సైట్ & యాప్ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

గ్రాఫైట్ గ్రే కలర్‌ స్పెషాలిటీ ఏంటి?కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 గ్రాఫైట్ గ్రే వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది, ఇది చాలా ఆకర్షణీయమైన లుక్స్‌ ఇస్తుంది. ఈ వేరియంట్‌కు నియాన్ ఎల్లో హైలైట్స్ ఇచ్చారు & అర్బన్ గ్రాఫిటీ ఆర్ట్ నుంచి ప్రేరణతో దీనిని తీసుకున్నారు. ఈ రంగు మిడ్ వేరియంట్‌లలో, రియో వైట్ & డాపర్ గ్రే తో పాటు అందుబాటులో ఉంది. హంటర్ 350ని యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేశారు & ఇది నగర రైడింగ్‌కు ఒక స్టైలిష్ ఎంపిక.