Royal Enfield 350cc Series Bikes Comparison: రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం బైక్ కాదు, అది ఒక ఫీలింగ్. ఈ బ్రాండ్‌కి ప్రత్యేక గుర్తింపునిచ్చేది 350సీసీ సెగ్మెంట్. ప్రస్తుతం కంపెనీ మొత్తం అమ్మకాల్లో మేజర్ షేర్ ఇచ్చేది కూడా ఈ విభాగమే. తాజా Classic 350, Hunter 350, Meteor 350, Bullet 350, Goan Classic 350 బైక్‌లు అన్నీ ఒకే J-ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వచ్చినా, ప్రతి బైక్‌ను ప్రత్యేకమైన రైడర్ స్టైల్ కోసం డిజైన్ చేశారు.
ఒకే ఇంజిన్, వేర్వేరు అనుభవంఈ ఐదు బైక్‌లన్నీ 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తాయి. ఈ ఇంజిన్ 20.2 HP పవర్, 27 Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ కూడా ఇప్పుడు హంటర్, మెటియోర్ మోడల్స్‌లో లభిస్తుంది.
Hunter 350 - సిటీ రైడర్‌కి పర్ఫెక్ట్‌రాయల్ ఎన్‌ఫీల్డ్ 350లో అతి తక్కువ ధర, తేలికైన వెర్షన్ హంటర్ 350. రూ. 1.38 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలయ్యే ఈ బైక్ నగర ట్రాఫిక్‌లో సులభంగా నడిపించవచ్చు. కేవలం 181 కిలోల వెయిట్, 790 మిల్లీమీటర్ల సీటు ఎత్తు, అప్‌డేట్ అయిన సస్పెన్షన్, స్లిప్ క్లచ్ - ఇవన్నీ కలిసి యువ రైడర్ల ఆలోచనలకు సరిగ్గా సరిపోయే రోడ్‌స్టర్‌గా నిలుస్తుంది. హయ్యర్ వెర్షన్‌లలో LED లైటింగ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్పర్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Meteor 350 - లాంగ్ రైడ్స్‌లో సౌకర్యంమెటియోర్ 350 సిరీస్ బైక్స్ కంఫర్ట్, లాంగ్ రైడ్‌లకు బెస్ట్ ఎంపిక. రూ. 1.91 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లభించే ఈ బైక్ ఇప్పుడు ట్రిప్పర్ నావిగేషన్, LED హెడ్‌ల్యాంప్స్, LED టర్న్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లతో వచ్చింది. రైడింగ్ పొజిషన్ కూడా లేడ్‌బ్యాక్‌గా ఉండటంతో సుదీర్ఘ ప్రయాణాలకు సూపర్. 765 మిల్లీమీటర్ల సీటు ఎత్తు, ఫార్వర్డ్ ఫుట్ పెగ్స్ కలిసి అసలు క్రూయిజర్ ఫీలింగ్ ఇస్తాయి.
మిగిలిన మోడల్స్ - Classic, Bullet, Goan Classicక్లాసిక్ 350 అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ సిగ్నేచర్. ఇది రెట్రో లుక్‌తో పాటు సాలిడ్ బిల్డ్ క్వాలిటీని అందిస్తుంది. బుల్లెట్ 350 మాత్రం డై-హార్డ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ RE బైక్ తన ఫ్యాన్స్‌కి ఎదురులేని రైడ్ అనుభవాన్ని ఇస్తుంది. కొత్తగా వచ్చిన గోవాన్ క్లాసిక్ 350 ట్రోపికల్ స్టైలింగ్‌తో కొత్త జెన్‌రేషన్ రైడర్లను టార్గెట్ చేస్తుంది.
అన్నీ 350cc నే - ఏది కొనాలి?
సిటీ రైడర్ అయితే హంటర్ 350, లాంగ్ డ్రైవ్‌ల కోసం మెటియోర్ 350, క్లాసిక్ లవర్స్ క్లాసిక్ 350, ప్యూర్ హెరిటేజ్ కోసం బుల్లెట్ 350, న్యూ-ఏజ్ స్టైల్ కోసం గోవాన్ క్లాసిక్ 350 సరైన ఎంపిక. ఏదైనా ఎంచుకున్నా - రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిరీస్ అందించే థంప్ సౌండ్, రైడింగ్ చార్మ్ మాత్రం ఎప్పటికీ మారదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.