Rolls Royce Motor Cars Ghost Series II: భారతదేశంలో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘోస్ట్ సిరీస్ 2ని రోల్స్ రాయిస్ విడుదల చేసింది. మునుపటి మోడల్‌లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు ఫీచర్లను ఈ సిరీస్‌లో జోడించింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఎలుపల అధునాతన డిజిటల్ టెక్నాలజీలు ఆకట్టుకోనున్నాయని కంపెనీ చెబుతోంది. 

ప్రారంభోత్సవం సందర్భంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్‌కు చెందిన ఆసియా-పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఐరీన్ నిక్కీన్ మాట్లాడుతూ- " “ఘోస్ట్ సిరీస్ ఫీచర్స్‌ను మా వినియోగదారులు తప్పకుండా ప్రశంసిస్తారని ఆశిస్తున్నాం. ఘోస్ట్ సిరీస్ 2కు ఉండే ప్రత్యేకత సరికొత్త అనుభూతిని ఇస్తుంది.  మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతికత వినియాగంతో ఈ డ్రైవర్ ఫోకస్డ్ వీ 12 రోల్స్ రాయిస్ లగ్జరీ కారు ప్రత్యేకత చాటుకోనుంది. 2024 నాటికి మూడింట ఒక వంతు మార్కెట్ విస్తరణతో భారతదేశంలో ఎక్కుమంది కోరుకునే లగ్జరీ బ్రాండ్‌గా  రోల్స్ రాయిస్ తమ స్థానాన్ని పదిలం చేసుకుంది.  ఘోస్ట్ సిరీస్ 2 ప్రస్తుతం భారతదేశంలో లభ్యం కానుంది. ఇప్పుడు .” అని  రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఐరీన్ నిక్కైన్ తెలిపారు. 

Also Read: టోల్‌గేట్స్‌కు కొత్త బాధ్యతలు- కారు ఓనర్లకు దబిడిదిబిడే- ఇన్సూరెన్స్ లేకపోతే జైలుకే!

భారత్ లో లభించే మూడు ఘోస్ట్ సిరీస్ 2 వేరియంట్లు ఇవే..⦁ ఘోస్ట్ సిరీస్ 2⦁ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2⦁ ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ధరలు ఇవే

చెన్నై, ఢిల్లీ షోరూంలలో ఈ కార్లను ఆర్డరు చేసుకునే సౌకర్యం ఉంది. వినియోగదారులకు కావల్సిన ఫీచర్లను బట్టి రోల్స్ రాయిస్ ధర ఉంటుంది.⦁ ఘోస్ట్ సిరీస్ 2 ధర - రూ. 8,95,00,000⦁ ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2 ధర – రూ. 10,19,00,000⦁ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 ధర – రూ. 10,52,00,000

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫీచర్స్ ఇవే

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2లో 6.75 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్  V12 ఇంజిన్‌ వస్తోంది. ఇది వరుసగా 600 Hp , 900 Nm హైపవర్‌ ఓల్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఎనిమిది-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది.  

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్‌లను సర్దుబాటు చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్‌బేరర్ సిస్టమ్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్‌లు కూడా ఉన్నాయి.  

Also Read: లక్షన్నర ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 500కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఓ రేంజ్ ఆఫర్ ఇది.