Continues below advertisement

Most Expensive Car Rolls Royce Boat Tail | ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల కంపెనీ రాల్స్ రాయిస్ కార్లు అంటే సెలబ్రిటీలకు చాలా ఇష్టం. ఆ కంపెనీ గురించి కార్లు కొనాలని ఉన్నా ధర, సౌలభ్యం లాంటి కారణాలతో ప్రతి ఒక్కరూ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేయలేరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ తయారు చేస్తుంది. కంపెనీకి చెందిన ఒక కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ఉంది. ప్రపంచంలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు. ఈ కారు మోడల్ వివరాలు, దాని యజమానులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. 

ఈ ఖరీదైన కారు ధర ఎంత? 

ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ బోట్ టైల్. రోల్స్ రాయిస్ బోట్ టైల్ మోడల్ ధర 28 మిలియన్ USD డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు 232 కోట్ల రూపాయలకు సమానం. రోల్స్ రాయిస్ ఈ కారును కేవలం 3 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. ఈ మూడు యూనిట్లను కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అనుకూలంగా తయారు చేసి విక్రయించింది. ప్రపంచంలో ముగ్గురి వద్ద మాత్రమే ఉండటంతో ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది. 

Continues below advertisement

ఈ కారుకు ప్రత్యేకమైన డిజైన్ 

రోల్స్ రాయిస్ ఈ కారుకు బోట్ లాంటి డిజైన్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారుకు సంబంధించి 3 మోడళ్లను మాత్రమే తయారు చేశారు. రోల్స్-రాయిస్ బోట్ టైల్ 4 సీటర్ కారు. ఈ కారులో 2 రిఫ్రిజిరేటర్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి షాంపైన్ ఉంచడానికి తయారు చేశారు. రోల్స్ రాయిస్ ఈ కారు పూర్తిగా సూపర్ స్టైలిష్ కారు. కంపెనీ ఈ కారుతో 1910 నాటి తన కారుకు కొత్త డిజైన్ తీసుకొచ్చింది.

3 యూనిట్లకు యజమానులు ఎవరు? 

రోల్స్ రాయిస్ బోట్ టైల్ మూడు కార్లలో ఒకదానికి యజమాని బిలియనీర్, రాపర్ జే-Z, అతని భార్య బియాన్సే. రెండవ కారు మోడల్ యజమాని విషయానికి వస్తే అతను ముత్యాలు, ఆభరణాల పరిశ్రమకు చెందిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారుకు మూడవ యజమాని అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మౌరో ఇకర్డి. ఈ కారు క్లాసిక్ యాచ్ డిజైన్ ద్వారా రూపొందించారు. ఇది ప్రత్యేకమైన నేవీ బ్లూ రంగును కలిగి ఉంది.