Rohit Sharma Tesla Model Y Features Specifications: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ SUVతో మరోసారి చర్చల్లోకి వచ్చాడు. క్రికెట్ మైదానంలో సిక్సర్లు కొట్టే రోహిత్, ఈసారి ఆటోమొబైల్ ఫ్యాన్స్‌ హృదయాల్లోకి టెస్లా మోడల్‌ Y తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. స్టెల్త్ గ్రే కలర్‌లో ముంబయి వీధుల్లో అతను నడిపిన ఈ కొత్త టెస్లా కారు అందరి చూపును ఆకర్షించింది.

ప్రత్యేక నెంబర్ 3015 వెనుక సెంటిమెంట్

రోహిత్ కొత్త SUV రిజిస్ట్రేషన్‌ నంబర్ “3015”. ఈ నంబర్‌ వెనుక అతనికి ఓ సెంటిమెంట్‌ ఉంది. ఈ అంకెల్లో అతని పిల్లలు సమైరా (30 డిసెంబర్), ఆహాన్ (15 నవంబర్) జన్మదిన తేదీలను మిళితం చేశాడు. మొత్తంగా 3+0+1+5 = 45, అంటే అతని జెర్సీ నెంబర్!. ఈ సెంటిమెంట్‌ను తన లంబోర్గిని ఊరస్ SE మీద కూడా కొనసాగించిన రోహిత్, వ్యక్తిగత భావోద్వేగం, స్టైల్ రెండింటినీ మిళితం చేయడంలో సక్సెస్ అయ్యాడు.

Tesla Model Y ధరలు & వేరియంట్లు

భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

Long Range RWD - ₹67.89 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

Standard RWD - ₹59.89 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

ఈ ధరలతో, మోడల్ Y దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత గల్జరీ ఎలక్ట్రిక్‌ SUVలలో ఒకటిగా నిలిచింది.

పనితీరు & రేంజ్

టెస్లా మోడల్ Yలో, 78.1 kWh బ్యాటరీ ఉన్న లాంగ్ రేంజ్ వెర్షన్‌ ఒక్కసారి చార్జ్‌తో 622 km ప్రయాణిస్తుంది. బేస్‌ వెర్షన్‌లోని 60 kWh బ్యాటరీ 500 km వరకు రేంజ్‌ ఇస్తుంది. వేగం విషయంలో కూడా ఇది పవర్‌ఫుల్‌ SUV - 0 నుంచి 100 km  వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో చేరుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 km.

లగ్జరీ ఇంటీరియర్‌ ఫీచర్లు

టెస్లా మోడల్ Yలో లోపలి డిజైన్‌ భవిష్యత్ తరహాలో ఉంది:

హీట్‌, వెంటిలేట్‌ అయ్యే ముందు సీట్లు

15.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌

పనోరమిక్ గ్లాస్ రూఫ్‌

9 స్పీకర్ హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌

ADAS డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌, వైర్‌లెస్ కనెక్టివిటీ, టూ-జోన్‌ క్లైమేట్ కంట్రోల్‌

ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునేవారికి, Full Self-Driving (FSD) ప్యాకేజీని ₹6 లక్షలు అదనంగా చెల్లించి పొందవచ్చు, ఇది సెమీ ఆటానమస్ డ్రైవింగ్‌ సదుపాయాన్ని అందిస్తుంది.

రోహిత్ గ్యారేజ్‌ గ్రీన్ అప్‌డేట్

రోహిత్ గ్యారేజ్‌లో ఇప్పటికే Mercedes-Benz GLS 400d, BMW M5 F1 Edition, Toyota Fortuner, Lamborghini Urus SE ఉన్నాయి. ఇప్పుడు టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ కారు కూడా చేరడంతో అతని గ్యారేజ్‌కి “ఎకో-ఫ్రెండ్లీ టచ్‌” వచ్చింది.

సస్టెయినబుల్‌ డ్రైవింగ్‌కు రోహిత్ మద్దతు

టెస్లా ఎంపికతో రోహిత్ కేవలం స్టైల్‌ కాదు, పర్యావరణ చైతన్యాన్ని కూడా ప్రోత్సహించాడు. సెలబ్రిటీలలో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ కార్లపై ఆసక్తికి అతను ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు.