పెట్రోల్ ధరలు పెరుగుతున్న క్రమంలో ఖర్చలు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో, స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. కొత్త Revolt RV1 మీకు సరైన ఛాయిస్ కావచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం రూ. 84,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌లలో ఒకటి కానుంది. 

Continues below advertisement

పర్యావరణ హితం కోరుకోవడంతో పాటు రెగ్యూలర్ ఇంధన ఖర్చులకు చెక్ పెట్టేందుకు ఈవీలు కొనేస్తున్నారు. ఎందుకంటే వీటితో తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్, అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. Revolt RV1 బైక్ రోజువారీ ప్రయాణాలకు మీకు చాలా బాగుంటుంది. ఈ బైక్ బ్యాటరీ, రేంజ్, స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేయండి.

బైక్ పవర్ ఎలా ఉంది?

Revolt RV1 లో 3.2 kWh లిథియం- అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది కేవలం 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని సమాచారం. ఈ బైక్ సింగిల్ ఛార్జింగ్ తో 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే రియల్ టైంలో అయితే మైలేజీ రేంజ్ మీరు నడిపే రైడింగ్ మోడ్‌, ట్రాఫిక్ మీద ఆధారపడి ఉంటుంది. మోడ్ ద్వారా మీరు అవసరాన్ని బట్టి స్పీడ్, రేంజ్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ బైక్ RV1, RV1 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Continues below advertisement

Revolt RV1 లో బెస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇచ్చారు. ఈ బైక్ సిటీ ట్రాఫిక్‌లో స్మూత్, సైలెంట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. బైక్ టాప్ స్పీడ్ గంటకు 70- 85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది రోజువారీ ఆఫీసు జర్నీకి, డైలీ బిజినెస్ జర్నీ అవసరాలకు సరిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల ట్రాఫిక్ లో చిక్కుకున్నా మీకు పదే పదే గేర్లు మార్చే ఇబ్బంది ఉండదు. దీని యాక్సిలరేషన్ కూడా వేగంగా ఉంటుంది.

బైక్ ఫీచర్లు, రేంజ్

Revolt కంపెనీకి చెందిన ఈ బైక్‌లో మీరు కోరుకునే పలు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 6 ఇంచుల డిజిటల్ LCD డిస్ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

  • RV1 వేరియంట్ అయితే.. ఇందులో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. 

  • RV1 ప్లస్ వేరియంట్ అయితే.. ఇందులో 3.24 kWh బ్యాటరీని ఇచ్చారు. ఇది ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.