2025 Renault Triber Pros And Cons In Telugu: భారతీయ మార్కెట్లో తక్కువ ధరలో 7 సీటర్‌ MPV కావాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ మంచి ఆప్షన్‌. 2019లో వచ్చిన ఈ కారు, ఇప్పుడు 2025 ఫేస్‌లిఫ్ట్‌తో కొత్త ఫీచర్లు, అదనపు సేఫ్టీ టెక్నాలజీతో మరింత ఆకర్షణీయంగా మారింది. కానీ, కొనుగోలు చేసేముందు ఈ MPV (మల్టీ పర్పస్‌ వెహికల్‌) బలాలు, బలహీనతలు రెండూ తెలుసుకోవడం అవసరం.

Continues below advertisement


రెనాల్ట్ ట్రైబర్‌లో ఉన్న ముఖ్యమైన ప్రయోజనాలు


1. ఆకర్షణీయమైన ధర



  • ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ట్రైబర్ ధరలు రూ. 6.3 లక్షల నుంచి ప్రారంభమై, టాప్‌-స్పెక్‌కు రూ. 9.17 లక్షల వరకు ఉంటాయి.

  • దీనితో పోల్చుకుంటే, మారుతి ఎర్టిగా ధరలు రూ. 9.12 లక్షల వద్ద మొదలవుతాయి, కియా కారెన్స్‌ ధరలు రూ. 11.41 లక్షల నుంచి మొదలవుతాయి.

  • అంటే టాప్‌-ఎండ్‌ ట్రైబర్ ఆటోమేటిక్‌ (AMT) వేరియంట్‌ అయినా రూ. 9.17 లక్షలకే దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే అత్యంత చవకైన ఆటోమేటిక్‌ 7 సీటర్‌ MPV ఇదే.


2. మూడో వరుస సీట్లలోనూ విశాలమైన స్పేస్‌



  • సబ్‌-4 మీటర్లలో వచ్చినా, ట్రైబర్ మూడో వరుస సీట్లలో మంచి హెడ్‌రూమ్‌, సరైన కంఫర్ట్‌ ఇస్తుంది.

  • సీట్లు అడ్జస్టబుల్‌ హెడ్‌రెస్టులతో వస్తాయి.

  • వాడకంలో లేనప్పుడు ఆ సీట్లు తీయగలిగేలా ఉంటాయి, అప్పుడు బూట్‌స్పేస్‌ 625 లీటర్ల వరకు పెరుగుతుంది.

  • అదనంగా CNG ఫిట్‌మెంట్‌ ఆప్షన్‌ కూడా ఉండటం వల్ల విస్తృతంగా వాడుకోగల వినియోగదారులకు ఇది సరిగ్గా సరిపోతుంది.


3. ఫీచర్లు & సేఫ్టీ



  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, EBD, TPMS, Isofix, 3-పాయింట్‌ సీటు బెల్టులు - ఇవన్నీ స్టాండర్డ్‌గా వస్తాయి.

  • మిడ్‌ ట్రిమ్‌ (Techno) నుంచే సరైన ఫీచర్లు లభిస్తాయి:

  • 15 అంగుళాల వీల్స్‌, ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్‌

  • ఎలక్ట్రిక్‌ ORVM అడ్జస్ట్మెంట్‌

  • 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ (Android Auto, Apple CarPlay సపోర్ట్‌తో)

  • స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, కూల్డ్‌ సెంటర్‌ కన్సోల్‌

  • రెండో వరుసలో 12V చార్జింగ్‌ సాకెట్‌.

  • అంటే, బేస్‌ వేరియంట్‌ సింపుల్‌గానే ఉన్నా, మిడ్‌-రేంజ్‌ మోడల్స్‌ ఫీచర్లు, సేఫ్టీ రెండింటిలోనూ బాగా బలంగా ఉంటాయి.


రెనాల్ట్ ట్రైబర్‌లో ఉన్న పరిమితులు


1. ఇంజిన్‌ పరిమితి



  • కేవలం ఒకే ఇంజిన్‌ ఆప్షన్‌: 72hp, 1.0 లీటర్‌ 3-సిలిండర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌.

  • అవుట్‌పుట్‌ తక్కువగా ఉండటం వల్ల పూర్తి లోడ్‌తో నడిపేటప్పుడు, లేదా ఎత్తైన రోడ్లపై డ్రైవింగ్‌ చేస్తే ఇంజిన్‌ను బాగా వర్క్‌ చేయించాల్సి ఉంటుంది.

  • టర్బో-పెట్రోల్‌ ఆప్షన్‌ లేకపోవడం దీని పెద్ద లోపం.

  • 5-స్పీడ్‌ మాన్యువల్‌ స్టాండర్డ్‌, AMT మాత్రం కేవలం టాప్‌ వేరియంట్‌లోనే ఉంటుంది.


2. ఇంటీరియర్‌ క్వాలిటీ



  • డాష్‌బోర్డ్‌, డోర్‌ ట్రిమ్స్‌లో ఎక్కువ భాగం హార్డ్‌ ప్లాస్టిక్స్‌తో తయారైంది.

  • SUV స్టైల్‌ డాష్‌బోర్డ్‌ (Kiger తరహాలో) డిజైన్‌ బాగానే ఉన్నా, సాఫ్ట్‌-టచ్‌ మెటీరియల్స్‌ ఉంటే మరింత ప్రీమియం ఫీల్‌ వచ్చేది.

  • అయినప్పటికీ, చవక ధరను దృష్టిలో పెట్టుకుంటే ఇది పెద్ద మైనస్‌ కాకపోవచ్చు.


ఫైనల్‌గా...


రెనాల్ట్ ట్రైబర్ ధర పరంగా అద్భుతమైన 7 సీటర్‌ ఆప్షన్‌.


తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్‌ కావాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.


సేఫ్టీ ఫీచర్లు బాగున్నాయి, స్పేస్‌ కూడా బాగా అందిస్తుంది.


అయితే, శక్తివంతమైన ఇంజిన్‌, ప్రీమియం ఇంటీరియర్‌ కోరుకునే వారికి ఇది పూర్తిగా తృప్తి ఇవ్వకపోవచ్చు.


మొత్తానికి, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ, బడ్జెట్‌ MPV కావాలనుకుంటే ట్రైబర్ మంచి ఎంపిక. కానీ ఎక్కువ పవర్‌, లగ్జరీ ఫీలింగ్‌ కావాలనుకుంటే ఎర్టిగా లేదా కారెన్స్‌ వైపు చూడడం మంచిది.