Renault Mini Duster

Continues below advertisement

30 కి.మీ. పైగా మైలేజ్: 'Mini Duster'ను ప్రవేశపెట్టనున్న Renault—దీని కీలక విశేషాలు ఏమిటో తెలుసుకోండి.

భారత ఆటో మార్కెట్‌లో SUV సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ఇందులో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది.  పోటీని దృష్టిలో ఉంచుకుని Renault తన కొత్త కాంపాక్ట్ SUV మినీ డస్టర్ అంటే Renault Bridgerపై ఫోకస్ చేసింది. ఈ SUV కంపెనీకి చెందిన పాపులర్ Renault Duster ఆధారంగా రూపొందించారు. అయితే సైజ్ చిన్నదిగా, ధరలో మరింత తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పటిష్టమైన SUV లుక్, బెస్ట్ మైలేజీ, ఆధునిక ఫీచర్లు ఉన్న కారును తక్కువ బడ్జెట్‌లో కొనాలనుకునే కస్టమర్ల కోసం రెనాల్ట్ కంపెనీ దీనిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది.

Continues below advertisement

ఏ వాహనాలకు పోటీ ఇస్తుంది.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెనాల్ట్ బ్రిడ్జర్ (Renault Bridger) సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది Tata Nexon, మారుతి సుజుకీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza), Hyundai Venue, కియా సోనెట్ (Kia Sonet) వంటి ప్రజాధరణ పొందిన SUVలతో పోటీపడుతుంది. రెనాల్ట్ కంపెనీ ఇందులో స్ట్రాంగ్, బాక్సీ డిజైన్‌ను అందించవచ్చు. దాంతో వాహనం చూసేందుకు చాలా రఫ్ అండ్ టఫ్ SUVలా కనిపిస్తుంది. ఇందులో పెద్ద గ్రిల్, రూఫ్ రైల్స్, LED DRL, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కనిపించవచ్చు.

 మైలేజీ ఎంత ఇస్తుంది?కొత్త రెనాల్ట్ Bridgerను ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. తాజా నివేదికల ప్రకారం, కంపెనీ ఇందులో కొత్త పవర్‌ట్రైన్‌ను అందించవచ్చు. ఈ ఇంజిన్‌తో వస్తున్న మినీ డస్టర్ అంటే బ్రిడ్జర్ లీటరుకు దాదాపు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. అలాంటి పరిస్థితిలో ఇది తక్కువ ఖర్చుతో నడిచే SUV కావొచ్చు. ఈ కారులో 1.2 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ అందించనున్నారు. ఇది 3 సిలిండర్ ఇంజిన్. ఇది మిల్లర్ సైకిల్‌పై పనిచేస్తుంది. ఈ ఇంజిన్ స్పెషాలిటీ ఏంటంటే  దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ (ఇంధన సామర్థ్యం). దీని ద్వారా అధిక మైలేజీని కస్టమర్లకు అందించడమే రెనాల్ట్ లక్ష్యం.

ఎస్‌యూవీ ఫీచర్లుఫీచర్ల విషయానికి వస్తే, రెనాల్ట్ బ్రిడ్జర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్ లభించే అవకాశం ఉంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందించాలని చూస్తున్నారు. 

Renault Bridgerను కంపెనీ 2027 నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేస్తుందని అంచనా వేశారు. దీనిని మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా చూడాలి. ఈ SUV భారత్‌లో లాంచ్ అయితే ఇది Renault కంపెనీకి బిగ్ గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు. ఎందుకంటే భారత కస్టమర్లు ప్రస్తుతం స్టైలిష్ డిజైన్, మంచి మైలేజీతో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కాంపాక్ట్ SUVలను  ఇష్టపడుతున్నారు.