Renault March 2026 Offers: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా, 2026 ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అమ్మకాల జోరును పెంచడమే లక్ష్యంగా తన పోర్ట్‌ఫోలియోలోని పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో పాటు లాయల్టీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. బడ్జెట్ కార్ల నుండి ఫ్యామిలీ ఎమ్‌పీవీల (MPV) వరకు అన్ని కేటగిరీలలో ఈ తగ్గింపులు వర్తిస్తాయి.

Continues below advertisement

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

మొదటిసారి కారు కొనేవారికి ఫేవరెట్ ఛాయిస్ అయిన రెనాల్ట్ క్విడ్ పై రూ. 70,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మాన్యువల్, ఏఎమ్‌టీ (AMT) ఆప్షన్లలో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మార్చి స్కీమ్ కింద నగదు తగ్గింపు, పాత కారు మార్పిడిపై వచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్ కలుపుకుంటే క్విడ్ ధర గణనీయంగా తగ్గుతుంది. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ కారు కోరుకునే వారికి ఇది మంచి డీల్.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)

ఏడుగురు ప్రయాణించే వీలున్న అత్యంత చౌకైన ఎమ్‌పీవీగా ట్రైబర్‌కు మంచి పేరుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ లేఅవుట్, ప్రాక్టికల్ డిజైన్ దీని ప్రత్యేకత. ఈ మార్చి నెలలో ట్రైబర్ కొనుగోలుపై రూ. 80,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. పెద్ద కుటుంబాలకు, ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప వరమని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన 7-సీటర్లలో ట్రైబర్ అగ్రస్థానంలో నిలుస్తోంది.

Continues below advertisement

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)

సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ పడుతున్న రెనాల్ట్ కైగర్ పై కూడా రూ. 80,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇది నాచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని అగ్రెసివ్ లుక్, ఫీచర్లతో నిండిన క్యాబిన్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా టర్బో వేరియంట్లపై లభిస్తున్న ఆఫర్లు కారు వాల్యూను మరింత పెంచుతున్నాయి. స్టైలిష్ ఎస్‌యూవీని తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ నెలాఖరులోపు షోరూమ్‌ను సందర్శించడం లాభదాయకం.