Renault Duster vs Skoda Kushaq turbo-petrol DCT Mileage Test: భారత మార్కెట్లో మధ్యతరహా SUV సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. 2026 మార్చిలో, కొత్త రెనాల్ట్ డస్టర్ & అప్‌డేటెడ్ స్కోడా కుషాక్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు SUVలు శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్లు & వేగవంతమైన డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కార్ ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. అయితే పనితీరు ఎంత ముఖ్యమో, మైలేజ్ కూడా అంతే కీలకం. ఈ నేపథ్యంలో, ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షల్లో ఏ SUV మెరుగైన ఫలితాలు సాధించిందో తెలుసుకుందాం.

Continues below advertisement
 
రెనాల్ట్ డస్టర్
స్కోడా కుషాక్
ఇంజిన్
 
4cyls, 1,333cc, turbo-petrol
4cyls, 1,498cc, turbo-petrol
పవర్‌ (hp)
 
163
150
టార్క్ (Nm)
 
280
250
గేర్‌బాక్స్
 
6-speed wet-clutch DCT
7-speed dry-clutch DCT
ఇంధన ట్యాంక్ సామర్థ్యం (లీటర్లు)
 
50
50
కర్బ్ బరువు (kg)
 
1,363
1,322
ARAI-ధృవీకరించిన ఇంధన సామర్థ్యం (kpl)
 
18.45
18.72
టర్బో-పెట్రోల్ DCT ధరలు (రూ. లక్షల్లో)
 
14.49-18.49
18.79-18.99

రెనాల్ట్ డస్టర్‌లో తక్కువ సామర్థ్య ఇంజిన్ ఉన్నప్పటికీ, అది స్కోడా కుషాక్ 1.5 TSI కంటే 13 hp ఎక్కువ శక్తిని & 30 Nm ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కుషాక్‌లో 7-స్పీడ్ డ్రై క్లచ్ DCT గేర్‌బాక్స్ ఉండగా, డస్టర్‌లో వెట్ క్లచ్ DCT అందించారు. డ్రై క్లచ్ వ్యవస్థలో మెకానికల్ నష్టాలు తక్కువగా ఉండటం వల్ల ఇంధన వినియోగం కొంత మెరుగ్గా ఉంటుంది.

స్కోడా కుషాక్‌కు ఉన్న ప్రధాన ప్రత్యేకత యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ. హైవే వేగాల్లో ప్రయాణించే సమయంలో నాలుగు సిలిండర్లలో రెండింటిని తాత్కాలికంగా నిలిపివేసి ఇంధనాన్ని ఆదా చేస్తుంది. దీంతో హైవే మైలేజ్‌లో కుషాక్‌కు అదనపు ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా కుషాక్ డస్టర్ కంటే 41 కిలోల తక్కువ బరువుతో ఉండటం కూడా మైలేజ్‌కు అనుకూలంగా మారింది.

Continues below advertisement

రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌

రియల్ వరల్డ్ పరీక్షల్లో స్కోడా కుషాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. నగర ప్రాంతాల్లో డస్టర్ ప్రతీ లీటర్ పెట్రోల్‌కు కేవలం 4.47 కిలోమీటర్లు ప్రయాణించగా, కుషాక్ 9.55 కిలోమీటర్ల మైలేజ్ అందించింది. అంటే సిటీ డ్రైవింగ్‌లో కుషాక్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

హైవే ప్రయాణాల్లో కూడా స్కోడా కుషాక్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. డస్టర్ లీటర్ పెట్రోల్‌కు 13.47 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా, కుషాక్ 15.29 కిలోమీటర్లు సాధించింది. సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ అంచనాలకు మించి తేడా రాకపోయినా, కుషాక్ మంచి ఆధిక్యాన్ని కొనసాగించింది.

సగటు మైలేజ్ పరంగా చూస్తే డస్టర్ లీటరుకు 10.47 కిలోమీటర్ల ఫలితాన్ని నమోదు చేయగా, కుషాక్ 12.42 కిలోమీటర్లు సాధించింది. అంటే కుషాక్ దాదాపు 1.95 కిలోమీటర్లు ఎక్కువ మైలేజ్ అందించింది. ఈ తేడా, సుదీర్ఘ ప్రయాణాల్లో పెద్ద మొత్తంలో ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, స్కోడా కుషాక్ ఫుల్ ట్యాంక్‌తో సుమారు 621 కిలోమీటర్లు ప్రయాణించగలిగింది. అదే సమయంలో రెనాల్ట్ డస్టర్ 523.5 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వెళ్లింది. అంటే కుషాక్ దాదాపు 97.5 కిలోమీటర్ల అదనపు ప్రయాణ సామర్థ్యాన్ని అందించింది.

ధరలు

ధరల పరంగా చూస్తే.. డస్టర్ కంటే స్కోడా కుషాక్ 1.5 TSI వేరియంట్ ఖరీదైనది. బేస్ లెవల్‌లో కుషాక్ ధర దాదాపు రూ.4.3 లక్షలు ఎక్కువ. అయితే ఫుల్లీ లోడెడ్ (హై) వేరియంట్‌లను పోలిస్తే డస్టర్ ఇంకా రూ.50 వేల వరకు తక్కువ ధరలో లభిస్తుంది.

పనితీరు, టెక్నాలజీ & మైలేజ్‌ను సమగ్రంగా పరిశీలిస్తే, ఇంధన సామర్థ్యం కోరుకునే వినియోగదారులకు స్కోడా కుషాక్ మెరుగైన ఎంపికగా నిలిచింది. ముఖ్యంగా నగర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి కుషాక్ మైలేజ్ పరంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.