భారత మార్కెట్‌లో SUV సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), రెనాల్ట్ డస్టర్ (Renault Duster), కియా సెల్టోస్ (Kia Seltos) వంటి వాహనాలు అత్యధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ సరైన SUVని ఎంచుకునే విషయానికి వస్తే, కేవలం లుక్స్ లేదా ధర మాత్రమే కాదు.. ఫీచర్లు, కంఫర్ట్, టెక్నాలజీ కూడా చాలా ముఖ్యమైనవి. నేటి రోజుల్లో కస్టమర్లు ఎక్కువ ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకుంటున్నారు. అటువంటప్పుడు ఏ SUVలో అత్యంత అధునాతన ఫీచర్లు లభిస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. 

Continues below advertisement

ఏది అత్యంత ప్రీమియం ఫీల్‌ని ఇస్తుంది?

డిజైన్ విషయానికి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ రెండూ మోడ్రన్.. ప్రీమియం లుక్‌కు పేరుగాంచాయి. క్రెటా డిజైన్ కొంచెం సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది, ఇది ఫ్యామిలీ యూజ్‌కి బాగుంటుంది. మరోవైపు కియా సెల్టోస్ మరింత స్పోర్టీగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. రెనాల్ట్ డస్టర్ లుక్ మిగిలిన రెండు కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది మరింత రఫ్, పటిష్టమైన SUV వంటి ఫీల్‌ని ఇస్తుంది. రెనాల్ట్ డస్టర్ డిజైన్ అంత మోడ్రన్‌గా ఉండదు. కానీ స్ట్రాంగ్, ఆఫ్-రోడ్ లుక్‌ను ఇష్టపడతారో వారికి ఇది నచ్చవచ్చు.

Continues below advertisement

ఇంటీరియర్, ఫీచర్లలో ఎవరు ముందున్నారు?

ఫీచర్ల పరంగా హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ చాలా ముందున్నాయి. రెండింటిలోనూ పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. సెల్టోస్‌లో కొంచెం ఎక్కువ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లభిస్తుంది. రెనాల్ట్ డస్టర్ ఈ విషయంలో కొంచెం వెనుకంజలో ఉంది. ఇందులో బేసిక్ ఫీచర్లు ఉన్నాయి. కానీ మోడ్రన్ టెక్నాలజీ లోటు కనిపిస్తుంది. మీకు ఎక్కువ ఫీచర్లు కావాలంటే, క్రెటా, సెల్టోస్ బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. 

డ్రైవింగ్‌లో ఏది బెస్ట్ ?

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 3 SUVలు మంచి ఇంజన్ ఆప్షన్లను ఇస్తాయి. క్రెటా, కియా సెల్టోస్‌లో పెట్రోల్, డీజిల్ రెండూ ఆప్షన్లు లభిస్తాయి. అలాగే టర్బో ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. వీటి డ్రైవింగ్ స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. రెనాల్ట్ డస్టర్ దాని దృఢమైన సస్పెన్షన్,  అధ్వాన్నమైన రోడ్లపై మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

సేఫ్టీ, టెక్నాలజీ

సేఫ్టీ విషయానికి వస్తే క్రెటా, కియా సెల్టోస్ రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, 360 డిగ్రీ కెమెరాతో పాటు ADAS వంటి ఫీచర్లు లభిస్తాయి. సెల్టోస్ ఇక్కడ కొంచెం ముందుంది. ఇందులో మరింత అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీ లభిస్తుంది. డస్టర్‌లో బేసిక్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. కానీ కొత్త టెక్నాలజీ లోటు ఉంది. అందుకే సేఫ్టీ మీ ప్రాధాన్యత అయితే, క్రెటా, సెల్టోస్ మెరుగైన ఎస్‌యూవీలుగా ఉన్నాయి.