ఎట్టకేలకు భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ (Renault Duster) లాంచ్ అయింది. డస్టర్ ఎస్‌యూవీ బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.49 లక్షలుగా ఉంది. టాప్ మోడల్ ధర రూ. 18.49 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలలో డస్టర్ SUV తన సెగ్మెంట్లో ఇతర కార్ల కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవడంతో పాటు డస్టర్ ఎస్‌యూవీ బాడీ స్ట్రాంగ్‌గా ఇచ్చారు.

హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ ధరలు..

హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ బేస్ మోడల్ Authentic 1.0 Turbo (Petrol) ఎక్స్ షోరూమ్ ధర రూ.10,49,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 12,09,056 వరకు ఉంది. హైదరాబాద్‌లో టాప్ మోడల్ Iconic Launch Edition DCT (Petrol) ఎక్స్‌షోరూమ్ ధర రూ. 18,49,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ. 21,33,192 వరకు ఉంది. ఎక్స్‌షోరూమ్, ఆన్ రోడ్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది. 

రెనాల్ట్ కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే హైబ్రిడ్ మోడల్ కొంతకాలం తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే చాలా కాలం తరువాత భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన రెనాల్డ్ డస్టర్ డిజైన్, ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

డస్టర్ డిజైన్, లుక్రెనాల్ట్ కొత్త డస్టర్ డిజైన్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా, గతంలో కంటే మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇందులో పాత మోడల్ షేడ్స్ కనిపిస్తున్నప్పటికీ, మరింత మోడ్రన్, రఫ్ లుక్ ఇచ్చారు. మందపాటి బాడీ క్లాడింగ్, 18 ఇంచుల పెద్ద వీల్స్, ఎత్తైన స్టాన్స్ దీనికి పవర్‌ఫుల్ SUV లుక్‌ను అందిస్తాయి. కొత్త డస్టర్ మరియు డిజైన్ ఇతర SUVల నుండి దీనిని ప్రత్యేకం చేస్తాయి. వెనుక వైపు C-పిల్లర్‌లోని డోర్ హ్యాండిల్స్ కారుకు మరింత యూనిక్ స్టైల్‌ను ఇస్తాయి.

ఇంటీరియర్, ఫీచర్లుకొత్త డస్టర్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ బ్లాక్, గ్రీన్ థీమ్‌లో వస్తుంది. ఇది కొత్త డస్టర్ వాహనానికి డిఫరెంట్ లుక్‌ను ఇస్తుంది. డిజైన్ సింపుల్‌గా, క్లియర్‌గా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల క్వాలిటీ  మరింత మెరుగ్గా ఉండాలని కస్టమర్లు భావిస్తున్నారు. ఇందులో ఫీచర్లకు కొదవ లేదు. 360 డిగ్రీల కెమెరా, ADAS,గూగుల్ బిల్ట్ ఇన్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ డ్రైవర్ సైడ్ బెండ్ అవడం వల్ల యూజ్ చేయడానికి కంఫర్ట్‌గా అవుతుంది. బూట్ స్పేస్ చాలా పెద్దదిగా ఉండటం ఈ సెగ్మెంట్లో దీనిని బెస్ట్‌గా ఉంచుతుంది. క్యాబిన్ కొంచెం ఇరుకుగా అనిపించవచ్చు. దీనివల్ల ఎత్తుగా ఉన్న వారికి తక్కువ స్థలం ఉన్నట్లు ఫీలవుతారు. 

ఇంజిన్, డ్రైవింగ్ లో ఎలా ఉంటుంది..కొత్త డస్టర్‌లో పలు ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 100bhp పవర్ ఇచ్చే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీంతో పాటు 160bhp పవర్ ఇచ్చే 1.3 లీటర్ టర్బో ఇంజిన్  ఉంది. ఇది మాన్యువల్ లేదా DCT గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇందులో ఎక్కువ భాగం డ్రైవింగ్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సాధ్యమవుతుంది. డ్రైవింగ్ చేయడానికి ఈ SUV చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, దీని రైడ్ క్వాలిటీ బాగుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

మీరు దీనిని కొనవచ్చా?మీరు ఒక స్ట్రాంగ్, ఫీచర్లు ఎక్కువగా ఉన్న, భిన్నంగా కనిపించే SUV కావాలనుకునే వారికి  కొత్త రెనాల్ట డస్టర్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. ముఖ్యంగా 1.3 లీటర్ టర్బో ఇంజిన్ మోడల్ ప్రస్తుతం బెస్ట్‌గా భావిస్తారు. ఒకవేళ మీరు ఎక్కువ మైలేజీని ఆశిస్తుంటే, హైబ్రిడ్ వెర్షన్ కోసం కొంతకాలం వేచి ఉండక తప్పదు. 

రెనో డస్టర్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 10.49 లక్షలుగా ఉంది. కొత్త డస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ వంటి మిడ్ సైజ్ SUVలతో పోటీ పడుతుంది.