Renault Car Discounts and Offers for May:కారు కొనుగోలుదారులకు రెనో ఇండియా ఈ మే నెలలో సూపర్ ఆఫర్లను తీసుకొచ్చింది. తన లైనప్‌లో ఉన్న మూడు ప్రధాన మోడళ్లు కైగర్, ట్రైబర్, క్విడ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. మోడల్, స్టాక్ సంవత్సరాన్ని బట్టి ఈ బెనిఫిట్స్ మారుతుంటాయి. ఈ నెలలో అన్నింటికంటే ఎక్కువగా రెనో కైగర్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే తాజాగా లాంచ్ అయిన డస్టర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీపై మాత్రం ఎటువంటి ఆఫర్ స్కీమ్ అందుబాటులో లేదు. ఈ ఆఫర్లు అన్నీ మే 31, 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. డీలర్ షిప్, నగరాన్ని బట్టి ఆఫర్ వివరాల్లో స్వల్ప మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.

Continues below advertisement

రెనో కైగర్ (Renault Kiger)..ఈ మే నెలలో కైగర్ పై అన్నింటికంటే పెద్ద డిస్కౌంట్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న విన్ (VIN) 2026 స్టాక్ పై మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4,000 రూరల్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు పాత మోడల్ ఎంవై (MY) 2025 స్టాక్ తీసుకుంటే ఏకంగా రూ. 88,500 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. కైగర్ ధర రూ. 5.81 లక్షల నుండి రూ. 10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

రెనో ట్రైబర్ (Renault Triber)..ఫ్యామిలీ కారుగా పేరున్న ట్రైబర్ విన్ 2026 స్టాక్ పై రూ. 45,000 వరకు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అర్హులైన కొనుగోలుదారులకు రూ. 4,000 గ్రామీణ ప్రాంత ఆఫర్ కూడా వర్తిస్తుంది. పాత ఎంవై 2025 స్టాక్ ఎంచుకునే వారు రూ. 60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.81 లక్షల నుండి రూ. 8.48 లక్షల వరకు ఉంటుంది.

Continues below advertisement

రెనో క్విడ్ (Renault Kwid)..రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ పై ఈ నెలలో కొంత తక్కువ ఆఫర్లు ఉన్నాయి. విన్ 2026 స్టాక్ పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4,000 రూరల్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ. 40,000 వరకు ఆఫర్లు లభిస్తాయి. ఎంవై 2025 స్టాక్ పై మాత్రం రూ. 50,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. క్విడ్ ధర రూ. 4.30 లక్షల నుండి రూ. 5.88 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో అందుబాటులో ఉంది.

పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్ కి సంబంధించినవి మాత్రమే. ఈ ఆఫర్లు అన్నీ మే 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరం, డీలర్ షిప్, స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్లు మారుతుంటాయి. కాబట్టి కారు కొనే ముందు మీకు దగ్గరలో ఉన్న రెనో డీలర్ షిప్ కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మంచి ఫీచర్లు, సేఫ్టీ ఉన్న ఈ కార్లను తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.