Renault and Nissan : గత కొన్నేళ్లుగా Renault, Nissan భారతదేశంలో పెద్దగా కొత్త కార్లను విడుదల చేయలేదు. Renault కొన్ని అప్‌డేటెడ్ మోడల్స్, స్పెషల్ ఎడిషన్లను మాత్రమే విడుదల చేయగా, Nissanకు చెందిన X-Trail ఎక్కువ మందికి చేరువ కాలేదు. ఇప్పుడు రెండు కంపెనీలు మళ్లీ భారతదేశంలో పెరుగుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. అందుకే వచ్చే రెండేళ్లను మార్కెట్‌లో దుమ్ము రేపేందుకు సిద్ధమయ్యాయి. 2026, 2027లో అనేక కొత్త వాహనాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ కార్ల లక్ష్యం మధ్యతరగతి, కుటుంబ కొనుగోలుదారులను ఆకట్టుకోవడం.
Nissan Gravite తో కొత్త ఆరంభం
Nissan 2026 ప్రారంభాన్ని తన కొత్త కారు Nissan Gravite తో చేయనుంది. ఇది సబ్-4 మీటర్ల 7-సీటర్ MPV అవుతుంది. ఇది Renault Triber ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు, అయితే కొన్ని విభిన్న డిజైన్ మార్పులు చేసినట్టు సమాచారం. ముందు భాగంలో పెద్ద గ్రిల్, బలమైన బంపర్, కొత్త లుక్ దీనిని Triber నుంచి వేరు చేస్తాయి. తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ ఆప్షన్ కోరుకునే వారికి ఈ కారు సరైనది.
కొత్త తరం Renault Duster పునరాగమనం
Renault తన పాపులర్ SUV Duster ను 3వ తరంలో 26 జనవరి 2026 న పరిచయం చేయనుంది. ఈ కొత్త Duster మునుపటి కంటే ఎక్కువ SUV లాగా కనిపిస్తుంది. కొత్త ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని తీర్చి దిద్దారు. భారతీయ మోడల్‌లో ప్రత్యేకమైన DRLలు, మార్పు చెందిన ముందు భాగం, వెనుక భాగంలో కలిపిన లైట్లు చూడవచ్చు. ఇందులో 1.0, 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభించవచ్చు. భవిష్యత్తులో హైబ్రిడ్ ఆప్షన్ కూడా రావచ్చు.
Nissan Tekton 7-సీటర్ SUV
Renault Duster ఆధారంగా Nissan Tekton కూడా 2026లో విడుదల చేయనుంది. దీని డిజైన్ Nissan స్టైల్‌లో ఉంటుంది, అయితే ఇంజిన్, ఇతర ఫీచర్లు చాలా వరకు Duster లాగానే ఉంటాయి. అంతేకాకుండా, Renault, Nissan రెండూ తమ సొంత 7-సీటర్ SUV లను కూడా తీసుకురానున్నాయి. Renaultకు చెందిన 7-సీటర్ Duster లో మరింత ప్రీమియం ఫీచర్లు లభించవచ్చు, అయితే Nissan దాని సొంత కార్లలవోనే విభిన్న వెర్షన్‌ను అందిస్తుంది.
మార్కెట్ ఆట మారుతుందా?
ఈ అన్ని లాంచ్‌లతో Renault, మరియు Nissan భారతీయ మార్కెట్‌లో మరోసారి బలంగా పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాయి. ధర సరైనది అయితే, ఈ కార్లు మిడ్-సైజ్ SUV, MPV విభాగాలలో గట్టి పోటీని ఇవ్వగలవు.