Best All-Rounder SUV Under 20 Lakh: ₹20 లక్షల లోపు పర్ఫార్మెన్స్, కంఫర్ట్, స్టైల్ - ఈ మూడూ కలిపిన కారు కావాలంటే హ్యుందాయ్ క్రెటా నిజంగా అద్భుతమైన ఆప్షన్. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాదు, ఓ పూర్తి ప్యాకేజ్. డ్రైవ్ చేయడం ఆనందంగా ఉంటుంది, రోజువారీ వాడకానికి కూడా అద్భుతంగా సరిపోతుంది.
పెర్ఫార్మెన్స్ & ఇంజిన్ ఆప్షన్లు హ్యుందాయ్ క్రెటా రెండు ప్రధాన ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి - డీజిల్ ఆటోమేటిక్ & 1.5 లీటర్ టర్బో పెట్రోల్. మీరు లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తే, డీజిల్ ఆటోమేటిక్ SX(O) వేరియంట్ చక్కగా సరిపోతుంది. ఇది స్మూత్ డ్రైవ్ అనుభవాన్ని ఇస్తూ, సిటీ ట్రాఫిక్‌లోనూ సులభంగా నడుస్తుంది. టర్బో పెట్రోల్ వేరియంట్ అయితే పవర్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ఛాయిస్. స్పీడ్, రెస్పాన్స్ రెండూ అద్భుతంగా ఉంటాయి.
కంఫర్ట్ & మ్యూజిక్ సిస్టమ్ హ్యుందాయ్ క్రెటా లోని బోస్ సౌండ్ సిస్టమ్ అనుభవం మరో లెవల్‌లో ఉంటుంది. క్యాబిన్ ఇన్సులేషన్ చాలా బాగుండటంతో బయటి శబ్దాలు లోపలకు వినిపించవు. రోడ్డుపై కూడా కారు నిశ్శబ్దంగా సాగిపోతుంది. వెనుక సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. హైవేలోనైనా, గ్రామీణ రోడ్లలోనైనా సాఫీగా నడుస్తుంది.
బూట్ స్పేస్ & యుటిలిటీ బూట్ స్పేస్ పరంగా కూడా క్రెటా ముందంజలో ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్లు, ట్రిప్స్, పిక్నిక్స్ లేదా వీకెండ్ లాంగ్ డ్రైవ్స్ కోసం సరిపోయేంత సౌకర్యం ఉంది. కారు డిజైన్ కూడా క్లాసీగా ఉండి, రోడ్డుపైన స్టైల్‌గా కనిపిస్తుంది. మీ బంధుమిత్రుల్లో మీ లైఫ్‌స్టైల్‌ను మరో లెవెల్‌కు పెంచుతుంది.
రిలయబిలిటీ & రీసేల్ హ్యుందాయ్ సర్వీస్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా బలంగా ఉంది. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండి, రీసేల్ విలువ కూడా బాగుంటుంది. చాలా మంది కొనుగోలుదారులు క్రెటాను “పీస్ ఆఫ్ మైండ్” కారు అని పిలుస్తారు.
ప్రత్యామ్నాయాలు డ్రైవింగ్ ప్లెజర్ కోసం చూస్తే, వోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) లేదా స్కోడా కుషాక్ (Skoda Kushaq) 1.5 TSI DSG మోడళ్లు కూడా బాగుంటాయి. అవి మరింత రగ్డ్ లుక్‌తో ఉండి, అద్భుతమైన హ్యాండ్లింగ్ ఫీల్ ఇస్తాయి. అయితే ఈ కార్ల సర్వీస్ నెట్‌వర్క్ హ్యుందాయ్ లెవల్‌లో ఉండదు.
ధరతెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,72,593 నుంచి ప్రారంభం అవుతుంది. బేస్ వేరియంట్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.01 లక్షలు, బీమా కోసం రూ. 54,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించాలి. మొత్తం కలిపి, క్రెటా ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.39 లక్షలు అవుతుంది.
మొత్తానికి, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్, ఆఫ్టర్-సేల్ సర్వీస్, రీసేల్, రిలయబిలిటీ అన్నీ సమతుల్యంగా కావాలంటే Hyundai Creta SX(O) నిజంగా “బెస్ట్ ఆల్ రౌండర్” SUV. డీజిల్ కావచ్చు, టర్బో పెట్రోల్ కావచ్చు - ఈ రెండు వేరియంట్లూ మీకు సంతృప్తికమరైన డ్రైవింగ్ ఫీల్ ఇస్తాయి.