ప్రస్తుతం ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు హవా కొనసాగుతోంది. వీటిని కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, ఇతర స్మార్ట్ ఫీచర్లను సైతం ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు గూగుల్ మ్యాప్స్, ఫోన్ కాల్స్, మ్యూజిక్‌ను సైతం ఆపరేట్ చేయవచ్చు. మీరు స్టైలిష్, స్మార్ట్ స్కూటర్ కొనాలనుకుంటే, మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లలో మంచి ఫీచర్లతో పాటు ఎక్కువ రేంజ్ కూడా లభించే వాటిని తీసుకుంటే రోజువారీ జర్నీ చేసు వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
సింపుల్ వన్ (Simple One)Simple One ఎలక్ట్రిక్ స్కూటర్ లాంగ్ రేంజ్ (ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం)తో పేరుగాంచిన ఈవీ. ఇందులో 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇందులో గూగుల్ మ్యాప్స్, ఫోన్ కాల్, సౌండ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్‌తో కూడా కనెక్ట్ అవుతుంది. ఈవీ చోరీ జరిగినప్పుడు మీకు అలర్ట్ పంపిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో మార్కెట్లోకి వచ్చింది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 265 కి.మీ వరకు ప్రయాణించడం దీని ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.
Ather 450XAther 450X ఎలక్ట్రిక్ స్కూటర్ తన అద్భుతమైన డిజైన్‌తో పాటు టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ వస్తుంది. దీనిని మీరు మొబైల్ లాగా ఉపయోగించవచ్చు. ఇందులో గూగుల్ మ్యాప్స్, కాల్ -మ్యూజిక్ కంట్రోల్, అలెక్సా సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 1.46 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 161 కిమీ వరకు నడుస్తుంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ స్కూటర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఓలా ఎస్1 ప్రో జెన్ 3 (Ola S1 Pro Gen 3)Ola S1 Pro Gen 3 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 1.02 లక్షలు. ధర ద్వారా ఇది చాలా మందికి అందుబాటులో ఉండే వాటిలో ఒకటిగా నిలిచింది. అందులో కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడిచే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో మ్యాప్స్, కాల్, మ్యూజిక్ కంట్రోల్ సౌకర్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 242 కిమీ రేంజ్ వెళ్తుంది. ఓలా ఎస్1 ప్రో జెన్3 రోజువారీ వాడకానికి బెటర్ ఆప్షన్.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube ST), Ather RiztaTVS iQube ST అనేది ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో మ్యాప్స్, కాల్- మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కస్టమర్లకు ప్రయోజనం. 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని పెద్ద మోడల్ 212 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర 1.71 లక్షలు.
ఇక Ather Rizta ధర రూ. 1.30 లక్షలు. ఇందులో కూడా 7 ఇంచుల స్మార్ట్ డిస్ప్లే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 159 కిమీ వరకు వెళ్తుంది. నమ్మకమైన ఈవీలలో ఇది ఒకటి.
