Ola Roadster vs Yazdi Roadster: భారతీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పును చూస్తోంది. ఒక వైపు దశాబ్దాల చరిత్ర కలిగిన పెట్రోల్‌ ఇంజిన్లు దుమ్మురేపుతుంటో, మరోవైపు నిశ్శబ్ధంగా అదే వేగంతో దూసుకుపోయే ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం. ఈ రెండు భిన్న ప్రపంచాల మధ్య పోటీని తలపిస్తున్నాయి. ఓలా రోడ్‌స్టర్‌, యెజ్డీ రోడ్‌స్టర్‌ రెండు కూడా రోడ్‌స్టర్ అనే పేరును పంచుకున్నప్పటికీ వీటి స్వభావం పని తీరు, టెక్నాలజీ పూర్తిగా భిన్నం. ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటీ? పూర్తి వ్యత్యాసాలను లోతుగా చూద్దాం. 

Continues below advertisement

ధర , వేరియంట్ల మధ్య వ్యత్యాసం ఏంటీ?

ధర విషయానికి వస్తే ఓలా రోడ్‌స్టర్‌ ఆధిక్యం చూపిస్తుంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌షోరూమ్ ధర కేవలం 1,04,999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన యెజ్డీ రోడ్‌స్టర్‌ ధర 1,95,592 నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి 2.10 లక్షల వరకు ఉంటుంది. యెజ్డీలో మొత్తం ఐదు వేరియంట్లు , ఐదు రంగుల్లో లభిస్తాయి. బడ్జెట్ పరంగా చూస్తే మాత్రం ఓలా రోడ్‌స్టర్ తక్కువ ధరకే లభిస్తుంది. 

పవర్‌, పర్ఫార్మెన్స్‌

పర్ఫార్మెన్స్‌ విషయంలో ఈ రెండు బైక్‌లు కూడా నువ్వా నేనా అన్నట్టు తలపుడుతన్నాయి. ఓలా రోడ్‌స్టర్‌లో ఎలక్ట్రిక్‌ మోటార్‌ 13kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి అత్యంత ఆకర్షణీయమైన అంశం యాక్సిలెరేషన్. ఇది 2.2 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 116కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్‌ స్పోర్ట్, హైపర్‌ వంటి వివిధ రైడింగ్‌ మోడ్లు ఉన్నాయి. యెజ్డీ రోడ్‌స్ట్‌లో 334సీసీ, సింగిల్‌ సిలింర్‌, లిక్వడ్‌ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 128.7bhp పవర్‌ని, 29.62Nస టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ బైక్ కావడంతో దీని గరిష్ట వేగం గంటకు 126కిలోమీటర్లు. ఇది ఓలా కంటే కొంచెం ఎక్కువ. ఇందులో ఆరు స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, అసిస్ట్‌ అండ్ స్లీపర్‌ క్లచ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Continues below advertisement

రైడింగ్ రేంజ్‌, మైలేజీ

ఎలక్ట్రిక్‌ , పెట్రోల్ వాహనాల మధ్య ప్రధాన పోటీ ఇక్కడే మొదలవుతుంది. ఓలా రోడ్‌స్టర్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి దీని రైడింగ్ రేంజ్‌ 151 కిలోమీటర్ల నుంచి 248 కిలోమీటర్లు వరకు ఉంటుంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం, వాస్తవ పరిస్థితుల్లో ఇది 30 నుంచి 232 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్‌ ఇంజిన్ కలిగిన యెజ్డీ రోడ్‌స్టర్ సుమారు 30 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని యూజర్లు చెబుతున్నారు. పెట్రోల్‌ ట్యాంక్ సామర్థ్యం ఆధారంగా ఇది సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. 

బ్యాటరీ- ఛార్జింగ్‌ సంగతేంటీ?

ఓలా రోడ్‌స్టర్‌ లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. దీనికి ఐపీ67 రేటింగ్‌ ఉంది. ఇది 0-100 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 7.9 గంటల సమయం డుతుంది. పాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ్వారా 4.6 గంటల నుంచి 7.9 గంటల మధ్య కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. యెజ్డీ పెట్రోల్ బైక్ కాబట్టి కేవలం కొద్ది నిమిషాల్లోనే పెట్రోల్ నింపుకొని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 

టెక్నాలజీ- ఫీచర్స్‌

టెక్నాలజీ పంగా ఓలా రోడ్‌స్టర్‌ భవిష్యత్‌ వాహనంలా కనిపిస్తుంది. ఓలా రోడ్‌స్టర్‌లో 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే, మ్యాప్ నావిేష్‌, బ్లూటూచ్‌ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్స్ ఉన్నాయి. అదనంగా కృత్రిమ్‌ వాయిస్‌ అసిస్టెంట్‌, స్మార్ట్ పార్క్‌, గక్రూప్ నావిగేషన్, ట్యాపర్ అలర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. యెజ్డీ క్లాసిక్‌ ఎల్‌సీడీప్లే ఉంది. ఇందులో డిజిటల్‌ స్పీడోమీట్‌, ఓడో మీటర్‌, గేర్‌ ఇండికేటర్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పాతతరం బైక్ ప్రియులను అలరించేలా మెకానికల్‌ సౌకర్యాల ఎక్కువ దృష్టి పెట్టింది. 

భద్రత, హార్డ్‌వేర్‌

భద్రత విషయంలో యెజ్డీ రోడ్‌స్టర్ డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ మెరుగ్గా ఉంది. ఓలా రోడ్‌స్టర్‌లో సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌మాత్రమే ఉంది. రెండింటిలోనూ ముందు, వెనుక డిస్క్‌బ్రేక్‌లు ఉన్నాయి. రెండింటిలోనూ ముందు వైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌ ఉన్నాయి.వెనుకవైపు ఓలాలో మోనోషాక్‌ ఉండగా, యెజ్డీలో డ్యూయల్‌ షాక్ అబ్జర్బార్‌లు ఉన్నాయి. యెజ్డీరోడ్‌స్టర్ బరువు 194 కేజీలు, ఇది వాహనానికి రోడ్‌పై మంచి స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. 

ఓలా తన బ్యాటరీ, మోటార్‌పై 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్ల వారంటీని ఇస్తుండగా, యెజ్డీ తన వాహనంై నాలుగేళ్లు, 50వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. మీరు తక్కువ ధరలో అత్యాధునిక టెక్నాలజీ, క్విక్ యాక్సిలరేషన్, సైలెంట్ ప్రయాణం, తక్కువ మెయింటెనెన్స్‌, కోరుకున్న వారు ఓలా రోడ్‌స్టర్‌ను ఎంచుకోవచ్చు. ఇది నగర్‌ ప్రయాణాలకు, టెక్ ప్రియులకు సరైన ఎంపిక. శక్తివంతమైన పెట్రోల్‌ఇంజిన్ శబ్దాన్ని ఇష్టపడుతూ, గంభీరమన మెటల్ బాడీ లుక్ కావాలనుకునే వాళ్లు యెజ్డీ రోడ్‌స్టర్‌ను ఎంచుకోవచ్చు.