Numeros n First Electric Scooter Launch: బెంగళూరు కేంద్రంగా పని చేసే EV స్టార్టప్ న్యూమెరోస్ మోటార్స్ (Numeros Motors) మరోసారి యువ రైడర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చింది. ఎన్-ఫస్ట్ (n-First) పేరుతో లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ప్రారంభ ధర కేవలం ₹64,999 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. మొదటి 1,000 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ప్రత్యేక ధర వర్తిస్తుంది, ఆలస్యం చేస్తే ఈ సూపర్ ఆపర్చునిటీ చేజారి పోతుంది.
సిటీ రైడర్ల కోసం స్పెషల్ డిజైన్n-First మోడల్ ప్రధానంగా అర్బన్ రైడర్లను, మరీ ముఖ్యంగా మహిళా కస్టమర్లను టార్గెట్ చేస్తోంది. బైక్ డిజైన్‌ను ఇటలీకి చెందిన Wheelab Design Studio తో కలిసి రూపొందించారు. తక్కువ బరువు, స్లిమ్ బాడీ, తేలికైన ఫ్రేమ్, సిటీ ట్రాఫిక్‌లో సులువైన హ్యాండ్లింగ్ ఈ బైక్‌కి హైలైట్స్. కాబట్టి, వయస్సులో పెద్దవాళ్లు, మహిళలు ఈ బండిని చాలా ఈజీగా నడిపించొచ్చు.
బ్యాటరీ & పనితీరుn-First ఎలక్ట్రిక్ బైక్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అందులో i-Max+ టాప్ మోడల్, ఇది 3 kWh బ్యాటరీతో 109 కి.మీ. (IDC రేంజ్) ఇస్తుంది. 2.5 kWh వెర్షన్‌లు సుమారు 91 కి.మీ. వరకు రన్ అవుతాయి. అన్ని వెర్షన్‌లలోనూ మిడ్-మౌంటెడ్ PMSM మోటర్, చైన్ డ్రైవ్, అలాగే OTA (Over-the-Air) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్ లభిస్తుంది.
ఫుల్ ఛార్జింగ్‌కి బ్యాటరీ ఆధారంగా 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
16 అంగుళాల చక్రాలు - ప్రత్యేక ఫీచర్‌స్కూటర్‌లలో చాలా అరుదుగా కనిపించే 16 అంగుళాల చక్రాలను ఈ బైక్‌కు బిగించారు. దీనివల్ల రోడ్డు గుంతల్లో కూడా రైడ్ స్టేబుల్‌గా ఉంటుంది. కంపెనీ ప్రకారం, n-First మోడల్‌ను జైసల్మేర్ వేడి వాతావరణం, మనాలి చలికాలం వంటి ఎక్స్‌ట్రీమ్ కండిషన్లలో కూడా టెస్ట్ చేశారు.
స్మార్ట్ టెక్ ఫీచర్లుn-First యాప్ ద్వారా రైడర్లు థెఫ్ట్ అలర్ట్స్, జియో ఫెన్సింగ్, రిమోట్ లాక్, లైవ్ లొకేషన్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ఈ బండిని ఎక్కడ కొనాలి?ప్రస్తుతం n-First బుకింగ్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఓపెన్ అయ్యాయి. సిటీ రైడర్లకు స్టైలిష్‌గా, చవకగా ఉండే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ నిజంగా గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది.
దక్షిణ భారతదేశంలో విస్తరణఇటీవలే Diplos Max+ మోడల్ కూడా లాంచ్ చేసిన Numeros... ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చి, త్రిస్సూర్ వంటి నగరాల్లో డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.
Numeros Motors గురించి... 2020లో ఏర్పాటైన న్యూమెరోస్ మోటార్స్ కంపెనీకి బెంగళూరు సమీపంలో 70,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఇప్పటివరకు ఈ కంపెనీ 13.9 మిలియన్ కి.మీ. పైగా EV టెస్టింగ్ డేటా సేకరించింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.