Hero Vida VX2 Price, Range And Features In Telugu: భారత మార్కెట్లో పెట్రోల్‌ లేదా డీజిల్‌ బాధల నుంచి విముక్తి పొందాలని, తమకు సాధ్యమైనంత మేర కాలుష్యం తగ్గించాలన్న ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత కూడా నానాటికీ వృద్ధి చెందుతోంది. ఇప్పుడు, కొత్త టూవీలర్‌ కొనేవాళ్లలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకుంటున్నారు, ముఖ్యంగా నగరాలు & పట్టణాల్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో, హీరో మోటోకార్ప్‌ ఇటీవల విడుదల చేసిన విడా VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చాలా చవకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మీరు ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కేవలం రూ. 44,990 కే కొనుగోలు చేయవచ్చు. 

హీరో మోటోకార్ప్‌, Vida VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) మోడల్‌లో అందిస్తోంది. అంటే, బండితో పాటు మీరు బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదు, నెలకు నిర్దిష్ట మొత్తం చెల్లించి బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. హీరో మోటోకార్ప్‌ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది, అవి - Vida VX2 Go & Vida VX2 Plus. 

BaaS ఆప్షన్‌తో Vida అందిస్తున్న బేస్ మోడల్ VX2 Go వేరియంట్‌ను కేవలం 44,990 రూపాయల ఎక్స్-షోరూమ్ ధరకే ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ మీరు ఈ బండిని బ్యాటరీతో కలిపి కొనాలన్నా కూడా అందుబాటులో ఉంది, బ్యాటరీతో కలిపి VX2 Go  ఎక్స్-షోరూమ్ ధర 85,000 రూపాయలు. 

టాప్‌ వేరియంట్‌ ధర ఎంత?దీనిలో టాప్‌ వేరియంట్‌ Vida VX2 Plus. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర BaaS మోడల్‌లో రూ. 58,000 కాగా, బ్యాటరీతో కలిపి కొనాలంటే 1 లక్ష రూపాయలు.

బ్యాటరీ అద్దె ఎంత?BaaS మోడల్ కింద, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని అద్దెకు ఇస్తారు. మీకు అవసరమైనప్పుడు, ఫుల్‌ ఛార్జ్‌తో ఉన్న బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. కిలోమీటరుకు రూపాయి కంటే తక్కువగా, కేవలం 96 పైసల అద్దెను ఈ కంపెనీ వసూలు చేస్తుంది. అయితే, ఇది పరిచయ ధర, తరువాత ఈ రేటు పెంచవచ్చు. 

హీరో విడా VX2 డిజైన్ & ఫీచర్లుVida VX2 డిజైన్ & ఫీచర్లను EICMAలో మొదట లాంచ్‌ చేసిన Vida Z కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. VX2 అనేది Vida V2 కంటే చౌకైన వెర్షన్, బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇది చాలా యూత్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్‌ అయింది. దీని బ్యాటరీ ప్యాక్ తేలికగా & సమర్థవంతంగా ఉంటుంది. బాడీ డిజైన్‌ ఈజీగా కనిపిస్తున్నప్పటికీ, ఆకర్షణీయంగా ఉంది. Vida VX2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో TFT డిస్‌ప్లే కూడా అందింతారు, ఇది స్కూటర్‌కు స్మార్ట్ టచ్ ఇస్తుంది.

హీరో విడా VX2 రేంజ్‌హీరో విడా VX2 Go వేరియంట్‌లో 2.2 kWh తొలగించగల బ్యాటరీ ఉంది, ఇది ఫుల్‌ ఛార్జ్‌తో 92 కి.మీ. దూరం ప్రయామిస్తుంది, దీనికి IDC సర్టిఫికెట్‌ ఉంది. టాప్‌ ఎండ్‌ VX2 Plus వేరియంట్‌ 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 142 కి.మీ. రేంజ్‌ (IDC సర్టిఫైడ్) అందిస్తుంది. విడా VX2 Go వేరియంట్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. కాగా & VX2 Plus వేరియంట్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.