జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ కొత్త రికార్డును సృష్టించింది. నిస్సాన్ కారు మాగ్నైట్ మనదేశంలో లాంచ్ అయిన రెండు సంవత్సరాల లోపే లక్ష బుకింగ్‌లను దాటింది. ఎస్‌యూవీ విభాగంలో అత్యంత చవకైన ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. 2020 డిసెంబర్‌లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ అయింది. హ్యుండాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజాలకు పోటీగా దీన్ని లాంచ్ చేశారు.


నిస్సాన్ మాగ్నైట్ మొత్తంగా 15 దేశాల్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి గ్లోబల్ ప్రొడక్ట్ ఇదే. దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిస్సాన్ మాగ్నైట్‌కు మంచి పేరుంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఈ కారు నాలుగు స్టార్ల రేటింగ్‌ను పొందింది.


ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్‌లో 10 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 1.0 లీటర్ బీ4డీ నాచురల్లీ పెట్రోల్ యూనిట్ 71 బీహెచ్‌పీని అందించనుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 బీహెచ్‌పీని అందించనుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే... పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజ్‌ను, సీవీటీ వేరియంట్ 18 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.


ఇందులో 8 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.5.88 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ మోడల్ వేరియంట్ ధర రూ.10.56 లక్షలుగా నిర్ణయించారు. ఇవి రెండూ ఎక్స్-షోరూం ధరలే.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?