Next Generation Hyundai i20 Premium Hatchback: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండై తన నెక్స్ట్ జనరేషన్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫస్ట్ అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేసింది. వచ్చే నెలలో జరగబోయే గ్లోబల్ డెబ్యూ కంటే ముందే ఈ కార్ డిజైన్ ఎలా ఉండబోతోందో కంపెనీ ఒక హింట్ ఇచ్చింది. ఈ ఫోర్త్ జనరేషన్ ఐ20 ఆల్రెడీ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ రోడ్లపై కూడా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. గ్లోబల్ లాంచ్ ముగిసిన వెంటనే ఈ సరికొత్త మోడల్ ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హ్యుండై గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఎన్నో మోడ్రన్ చేంజెస్ తో ఈ కార్ రానుంది.

Continues below advertisement

Read Also: Zero Lompico Electric Motorcycle: జీరో లంపియాకో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్: హీరో విడా వీఎక్స్ జెడ్ లాంటి ఫీచర్లతో రాబోతున్న కొత్త మోడల్.. అదిరిపోయే రెట్రో ఫ్యూచరిస్టిక్ లుక్..

ఫుల్ విడ్త్ లైట్ బార్ తో సరికొత్త లుక్.. 

Continues below advertisement

లీకైన టీజర్ ఇమేజ్ ప్రకారం కార్ ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్ లో పెద్ద మార్పులు చేశారు. కొత్త ఐ20 లో ఫుల్ విడ్త్ లైట్ బార్, వై షేప్ (Y-shaped) ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మల్టీ ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన యాంగులర్ హెడ్‌ల్యాంప్స్ ఇచ్చారు. పాత మోడల్ లో ఉన్న పెద్ద కాస్కేడింగ్ గ్రిల్ స్థానంలో ఈసారి కాంపాక్ట్ రెక్టాంగులర్ గ్రిల్ ను అమర్చారు. దీనికి కింద వైడ్ ఎయిర్ ఇన్‌టేక్ ఉంటుంది. ఫ్రంట్ బంపర్ పై స్క్వేర్ షేప్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ ఇచ్చారు. ఇవి కారుకు మరింత షార్ప్, స్ట్రక్చర్డ్ లుక్ ను ఇస్తున్నాయి. వెనుక వైపు స్పోర్టీ లుక్ కోసం కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, స్టీప్ రియర్ విండ్‌స్క్రీన్ ఉన్నాయి.

Read Also: Green SM Electric Limo Taxi Service: ఇండియాలో గ్రీన్ ఎస్ఎమ్ ఎలక్ట్రిక్ లిమో టాక్సీ సర్వీస్ స్టార్ట్: .. విన్ ఫాస్ట్ ఈవీ కార్లతో సరికొత్త లగ్జరీ రైడింగ్..  సేవలు ఎక్క‌డ  ప్రారంభమంటే..?  

కర్వ్డ్ డిస్ప్లే తో లగ్జరీ ఇంటీరియర్.. 

కార్ లోపలి భాగంలో కూడా హ్యుండై చాలా ప్రీమియం అప్‌డేట్స్ ఇచ్చింది. టెస్ట్ వెహికల్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం ఇందులో రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ కలిసి ఉండేలా ఒక లగ్జరీ కర్వ్డ్ డిస్ప్లే ను అమర్చారు. దీంతో పాటు లేటెస్ట్ వెన్యూ కార్ లో ఉన్నట్లుగానే సరికొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ ను ఇందులో ఉపయోగించారు. వేరియంట్లను బట్టి ఇంటీరియర్ ఫీచర్లు మారే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు.. 

గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ కొత్త ఐ20 లో 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఆప్షన్ ను ఇవ్వనున్నారు. ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ లనే కంపెనీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. 2030 నాటికి ఇండియాలో తన హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని హుండై ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్ లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము.