Bajaj Pulsar Classic 2026: బజాజ్ పల్సర్... భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒక ఐకానిక్ నేమ్. 2001లో పల్సర్ ప్రవేశించినప్పటి నుంచి యువతతో పాటు కుటుంబ వినియోగానికి కూడా బాగా ఆదరణ పొందింది. ఇక 2026లో పల్సర్ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తి కానుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ మోడళ్లను లాంచ్ చేయడానికి బజాజ్ సిద్ధమవుతోంది.
బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO రాజీవ్ బజాజ్, “2026 పల్సర్ సంవత్సరం” అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా, పల్సర్ క్లాసిక్ రేంజ్‌లో, గత రెండు దశాబ్దాల్లోనే అతి పెద్ద అప్‌డేట్ రానుందని సమాచారం.
కొత్త ప్లాట్‌ఫామ్‌పై పల్సర్ క్లాసిక్‌ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లు పాత డబుల్ క్రేడిల్ ఫ్రేమ్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లతో కొనసాగుతున్నాయి. అయితే 2026లో రానున్న కొత్త మోడళ్లు సరికొత్త చాసిస్‌పై రూపొందనుండటం కీలక మార్పు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో మోనోషాక్ సస్పెన్షన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పల్సర్ N సిరీస్‌లో ఈ సెటప్ మంచి రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్‌ను చూపించింది. అదే అనుభవాన్ని ఇప్పుడు క్లాసిక్ పల్సర్‌లకు తీసుకురావాలని బజాజ్ యోచిస్తోంది.
ఇంజిన్‌లో మార్పులుకొత్త చాసిస్ వస్తే, ఇంజిన్‌లో కూడా మార్పులు సహజం. ఈసారి ఇంజిన్‌ను స్ట్రెస్డ్ మెంబర్‌గా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే 125cc, 150cc సెగ్మెంట్‌లను మాత్రం బజాజ్ మార్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ ఇంజిన్ సామర్థ్యాలే పల్సర్ క్లాసిక్ అమ్మకాలకి ప్రధాన బలం.
డిజైన్‌లో గుర్తించదగిన మార్పులు2006లో వచ్చిన వుల్ఫ్ ఐ డిజైన్ పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటికీ పల్సర్ 150, 125 మోడళ్లలో అదే డిజైన్ స్పూర్తి కనిపిస్తుంది. కొత్త మోడళ్లలో కూడా ఇదే మ్యాచ్ లుక్‌ను కొనసాగిస్తూ, ఎవల్యూషనరీ డిజైన్ తీసుకురానున్నారు. ఇంకా... పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ లైన్స్, అగ్రెసివ్ స్టాన్స్ కొనసాగుతాయని అంచనా. అదనంగా LED హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మోడ్రన్ ఫీచర్లు అందే అవకాశం ఉంది.
లాంచ్ టైమ్‌లైన్‌నెక్స్ట్ జనరేషన్ పల్సర్ క్లాసిక్ బైక్స్ 2026 రెండో అర్ధ భాగంలో, అంటే ఆగస్టు ప్రాంతంలో లాంచ్ కావచ్చని అంచనా. పండుగల సీజన్‌ను టార్గెట్‌గా చేసుకుని బజాజ్ ఈ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
అంచనా ధరలుకొత్త పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండొచ్చు. పల్సర్ 150 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి, రెండు దశాబ్దాల తర్వాత పల్సర్ క్లాసిక్‌కు రానున్న ఈ భారీ అప్‌డేట్‌తో... 2026లో పల్సర్ పేరు మళ్లీ రోడ్లపై గట్టిగా వినిపించనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.