ప్రస్తుతం భారత్‌లో టాటా వాహనాలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాహనదారులు టాటా వాహనాలపై నమ్మకంగా ఉన్నారు. టాటా కంపెనీకి చెందిన సక్సెస్ సాధించిన కార్లలో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ SUVకి సంబంధించి ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. E కంపెనీ ఇప్పుడు నెక్సాన్ ఈవీని కొత్త రూపంలో లాంచ్ చేయాలని చూస్తోంది. ఇటీవల ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును టెస్టింగ్ చేస్తున్న సమయంలో రోడ్లపై చూశారు. 

Continues below advertisement

దీంతో కారు లవర్స్ ఈ కొత్త మోడల్ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందా అని ఉత్సాహంగా ఉన్నారు. మరి కొత్త రూపంలో రానున్న నెక్సాన్ ఈవీలో ఏయే మార్పులు రానున్నాయి అందుబాటులో ఉన్న వివరాలివే. 

కాస్త మారనున్న లుక్

Continues below advertisement

టెస్టింగ్ మోడల్ ఫోటోలు చూస్తే, టాటా కంపెనీ దీని ఫ్రంట్, రియర్ ప్రొఫైల్‌లో కొన్ని పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గాలి ఒత్తిడి వీలైనంత తక్కువగా ఉండి రేంజ్ మెరుగుపడేలా కారు ముందు భాగాన్ని ఏరోడైనమిక్‌గా చేస్తున్నారు. ఇందులో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్ అసెంబ్లీ, కనెక్టెడ్ డిఆర్‌ఎల్‌, కొత్త డిజైన్ గ్రిల్స్ అందించవచ్చు. మెరుగైన ఎయిర్‌ఫ్లో, ఫ్యూచరిస్టిక్ లుక్ కోసం కొత్త ఏరో-డిజైన్ అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. కారు బంపర్ లుక్ కూడా గతంలో కంటే మరింత మస్కులర్, స్పోర్టీ లుక్‌లో రూపొందించారు.

రేంజ్ మెరుగయ్యే ఛాన్స్

కొత్త టాటా నెక్సాన్ ఈవీ డ్రైవింగ్ రేంజ్, పవర్ పెర్ఫార్మెన్స్ మెరుగయ్యే అవకాశాలున్నాయి. తాజా నివేదికల ప్రకారం కంపెనీ ఇందులో కొత్త జనరేషన్ బ్యాటరీ ప్యాక్, మెరుగైన ఎలక్ట్రిక్ మోటారును అమర్చవచ్చు. కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల అధిక రేంజ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల లాంగ్ జర్నీ సమయంలో పదే పదే ఛార్జింగ్ స్టేషన్‌ను వెతుక్కునే ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను సెట్ చేయనున్నారు.

Also Read: 700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం

కేబిన్‌లోనూ మార్పులు

మరోవైపు, కారు కేబిన్‌లో ప్రయాణికుల సౌకర్యం, హైటెక్ ఎక్స్‌పీరియన్స్2పై పూర్తిగా ఫోకస్ చేస్తారు. ఇందులో పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కొత్త టూ స్పోక్ ఇల్లుమినేటెడ్ స్టీరింగ్ వీల్ రానున్నాయి. కనెక్టివిటీ కోసం వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు అందించనున్నారు.

సేఫ్టీ పరంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు కూడా చేర్చవచ్చు.

ధరపై క్లారిటీ లేదు

టాటా మోటార్స్ నుంచి న్యూ లుక్ వస్తున్నప్పటికీ నెక్సాన్ ఈవీ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. టెస్టింగ్ ఫేజ్, ప్రొడక్షన్ రెడీనెస్‌ను బట్టి చూస్తే, కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. టాటా నెక్సాన్ కంటే దీని ధర ఎక్కువగా ఉండనుంది. పాత మోడల్ కంటే కాస్త ఎక్కువ ధర ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?