భారత మార్కెట్లో కొత్త Renault Duster మార్చి 17న లాంచ్‌కు సిద్ధంగా ఉంది. రెనాల్ట్ కంపెనీ కొత్త డస్టర్‌తో 7 ఏళ్ల వారంటీని అందించడం ఇదే తొలిసారి. ఈ కారు బుకింగ్‌లు రూ. 21,000 తో ప్రారంభమయ్యాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు ఏప్రిల్ 2026 నాటికి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ డెలివరీలు ఈ ఏడాది దీపావళి సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement

కారు డిజైన్ ఎలా ఉంటుంది?న్యూ రెనాల్ట్ డస్టర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ లుక్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ (LED) టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఎత్తుగా ఉన్న బోనెట్ దీనికి పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ముందు భాగంలో పెద్ద బంపర్, గ్రిల్‌పై రెనో లోగో అమర్చారు. అలాగే వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్, వెనుక వైపు పలు రంగుల్లో ఉన్న బంపర్ ఇన్సర్ట్ కొత్త రెనాల్డ్ డస్టర్‌ను మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.

రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?లోపలి భాగంలో కూడా కొత్త డస్టర్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ఇంటీరియర్‌లో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ సపోర్ట్‌తో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇవి కాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. 

Continues below advertisement

మీరు డ్రైవర్ సీటును వివిధ రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు సీట్లలో కూలింగ్ సదుపాయం (Ventilated seats) కూడా ఉంటుంది. సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, 17 ఫీచర్లు ఉన్న ADAS ప్యాకేజీ ఇవ్వనున్నారు. రెనాల్ట్ కంపెనీ ప్రకారం, దీని బూట్ స్పేస్ రూఫ్ వరకు కొలిస్తే సుమారు 700 లీటర్లు ఉంటుంది. ఇది లాంగ్ జర్నీ చేసేవారికి బెస్ట్ ఛాయిస్‌గా నిలవనుంది. 

ఈ డస్టర్ SUV గతంలో కూడా మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో బాగా ఫేమస్ అయింది. కస్టమర్ల ఆదరణతో భారీగా అమ్మకాలు జరిగాయి. కంపెనీ తన కొత్త వ్యూహాలతో పని చేస్తున్నందున డిసెంబర్ 2022లో డస్టర్ మోడల్ నిలిపివేసింది. ఇప్పుడు కంపెనీ నేరుగా కొత్త గ్లోబల్ మోడల్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది.