ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ (Renault) తన పాపులర్ SUV Dusterను భారత్‌లో మళ్లీ లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని ఏళ్ల క్రితం ఈ కారును భారత మార్కెట్లో నిలిపివేసిన  కంపెనీ ఇప్పుడు సరికొత్త లుక్, ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. భారత మార్కెట్‌లో కొత్త రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మార్చి 17న లాంచ్ కానుంది. కంపెనీ కొత్త డస్టర్‌తో పాటు 7 ఏళ్ల వారంటీని అందించనుండటం విశేషం. ఈ కారు బుకింగ్స్ కేవలం రూ. 21,000 తో ప్రారంభమయ్యాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు ఏప్రిల్ నాటికి ప్రారంభం కావచ్చు, కాగా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ డెలివరీలు అయితే ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 

Continues below advertisement

కారు డిజైన్ ఎలా ఉంటుంది ?

కొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ లుక్ మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. ముందుండే బోనెట్ దీనికి పవర్‌ఫుల్ లుక్‌ని ఇస్తుంది. ముందు భాగంలో పెద్ద బంపర్, గ్రిల్‌పై రెనాల్ట్ లోగో ఇచ్చారు. అలాగే వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్, వెనుక భాగంలో పలు రంగుల బంపర్ ఇన్సర్ట్‌లు డస్టర్ ఎస్‌యూవీని మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.

Continues below advertisement

ఇంటీరియర్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

న్యూ రెనాల్ట్ డస్టర్ లోపలి భాగంలో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ సపోర్ట్‌తో కూడిన 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. వీటితోపాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 

డ్రైవర్ సీటును వివిధ రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు సీట్లలో కూలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, 17 ఫీచర్లు కలిగిన ADAS ప్యాకేజీని అందించారు. కంపెనీ ప్రకారం, దీని బూట్ స్పేస్ రూఫ్ వరకు కొలిచినప్పుడు సుమారు 700 లీటర్లు ఉంది. ఇది లాంగ్ జర్నీలకు మంచి వాహనంగా భావించవచ్చు. 

ఈ SUV గతంలో కూడా మిడ్ సైజ్ సెగ్మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ తన కొత్త ప్లాన్‌పై పని చేస్తున్న కారణంగా డిసెంబర్ 2022లో దీనిని నిలిపివేశారు. ఇప్పుడు కంపెనీ నేరుగా కొత్త గ్లోబల్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది.

రెనాల్ట్ డస్టర్‌లో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్రకొత్త Renault Dusterను డిజైన్, డెవలప్ చేయడంలో IIT కాన్పూర్ కీలక పాత్ర పోషించింది.  కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త డస్టర్‌ను రూపొందించడానికి Renault బృందం IIT కాన్పూర్‌తో కలిసి పనిచేసింది. మోడ్రన్ నేషనల్ విండ్ టన్నెల్ ఫెసిలిటీ (NWTF)ని ఉపయోగించి కారు ఏరోడైనమిక్స్‌ను పరీక్షించారు. ఈ టెస్ట్ ద్వారా గాలి కారుపై ఎలా ప్రభావం చూపుతుంది, కారు లోపలికి వచ్చే గాలి శబ్దాన్ని ఎలా తగ్గించవచ్చు అని పరిశీలించారు. లాంచ్ అయితే  ఈ కారు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి సుజుకీ గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) వంటి వాహనాలకు గట్టి పోటీని ఇవ్వవచ్చు.

కొత్త మిడ్ సైజ్ SUV Dusterలో ఆర్టిక్యులేషన్ ఇండెక్స్ (AI) 73 శాతంగా ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో చాలా మంచిదని Renault ఇండియా  తెలిపింది. కారులో కూర్చున్న వారికి బయటి శబ్దం, వైబ్రేషన్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి. అంటే కారు క్యాబిన్లో కూర్చుని ప్రజలు హాయిగా మాట కంపెనీ కొత్త Renault Dusterను భారత్‌లో మార్చి 17న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

గ్లోబల్ మోడల్ కంటే భిన్నంగా భారత Dusterకొత్త Renault Dusterను మోడ్రన్‌గా చేసేందుకు కంపెనీ అనేక కంప్యూటర్ బేస్డ్ ఇంజనీరింగ్ టూల్స్‌ను ఉపయోగించింది. దాంతో కారు డ్రాగ్ కోఎఫీషియంట్ దాదాపు 13 శాతం తగ్గింది.  అంటే కారుపై గాలి ఒత్తిడి తగ్గుతుంది. భారత్‌లో తయారయ్యే కొత్త Duster గ్లోబల్ మోడల్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది దాదాపు 50 మిమీ ఎక్కువ ఎత్తులో, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. వీటితో భారత కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.