ఆటోమొబైల్ మార్కెట్ నుంచి నిరంతరం కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రెనాల్ట్ కంపెనీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన SUV రెనో డస్టర్ మరొకసారి కొత్త అవతార్‌లో రీఎంట్రీకి సిద్ధమైంది. ఎందుకంటే, కంపెనీ తమ ఈ ఐకానిక్ వాహనం నెక్స్ట్-జనరేషన్ హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పుడు రెనో కంపెనీ దీనిని మోడ్రన్ హైబ్రిడ్ టెక్నాలజీ, బోల్డ్ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేయబోతోందని సమాచారం. 

Continues below advertisement

కస్టమర్లు చాలా కాలం నుంచి ఈ కొత్త SUV కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న డస్టర్ తన సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వాహనాలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. ఇక ధర విషయానికి వస్తే భారత్‌లో తయారీ, హైబ్రిడ్ టెక్నాలజీతో రావడం వల్ల దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 11 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశరాు. దీని టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షలు ఉండే అవకాశం ఉంది.  కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌లో ఏమేం ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు ,ప్రత్యేకమైన అప్‌డేట్స్ లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పది లక్షల వాహనం అయితే 2 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. మిగతా మొత్తానికి మీరు ఎంచుకునే టర్మ్ 4 నుంచి 7 ఏళ్లు ఆధారంగా, వడ్డీ శాతాన్ని బట్టి నెలవారీ EMI 13 వేల నుంచి 20 వేలు వరకు ఉండవచ్చు. త్వరలో కారు ధర, బుకింగ్ వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

అక్టోబర్ 17న లాంచ్ 

Continues below advertisement

 కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌ను అక్టోబర్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కొత్త SUVని భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. లాంచ్ రోజునే దీని బుకింగ్ , డెలివరీకి సంబంధించిన పూర్తి టైమ్‌లైన్ వెల్లడి కానుంది. ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

Also Read: 1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి

హైబ్రిడ్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు

కొత్త రెనాల్ట్ డస్టర్‌లో కస్టమర్లకు పవర్‌ఫుల్, ఫ్యూయల్-ఎఫిషియంట్ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ 1.6 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్ అని అంచనా వేస్తున్నారు. ఇది 2 ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లభించవచ్చు. ఈ కొత్త హైబ్రిడ్ సెటప్ కారుకు అద్భుతమైన పవర్ ఇవ్వడమే కాకుండా దాని మైలేజ్ అద్భుతంగా ఉండబోతోంది.

మస్కులర్ డిజైన్ 

కంపెనీ కొత్త డస్టర్ ఎక్స్‌టీరియర్‌ను అంతకుముందు కంటే మరింత అగ్రెసివ్, మస్కులర్‌గా తయారు చేసిందని తెలుస్తోంది. ఇందులో కొత్త Y- షేప్డ్ LED DRLs, సిగ్నేచర్ గ్రిల్, రూఫ్ రైల్స్, వెడల్పాటి అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. కారు కేబిన్ లోపల మీకు పూర్తిగా కొత్త , ప్రీమియం డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో 10.1 ఇంచుల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇచ్చారు. 

Also Read: యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!సేఫ్టీ విషయానికి వస్తే కొత్త రేనో డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,  అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.