MG Windsor EV Pro Price And Features: ఎంజీ మోటర్‌ ఇండియా కొత్తగా లాంచ్‌ చేసిన Windsor EV Pro ఇప్పుడు 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌'గా నిలిచింది. ఈ బండి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి కార్‌ ప్రేమికులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు, సొంత బ్రాండ్‌లోని మునుపటి మోడళ్ల కంటే మెరుగ్గా ఉండటమే కాకుండా, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఇతర బ్రాండ్‌ ఎలక్ట్రిక్ కార్ల కంటే కూడా ఓ అడుగు ముందుంది. 

విండ్‌సోర్‌ ఈవీ ప్రో టాప్-10 ఫీచర్లు

1. పెద్ద బ్యాటరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా, MG విండ్‌సోర్‌ EV ప్రో 52.9 kWh పెద్ద బ్యాటరీతో లాంచ్‌ అయింది. ఈ బ్యాటరీ, ఈ కంపెనీ అంతర్జాతీయ మోడళ్ల కంటే శక్తిమంతమైనది. దీని అర్థం, ఇప్పుడు ఈ కారు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని పెంచుకుంది, కాబట్టి, మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

2. 449 km సుదూర పరిధి52.9 kWh పెద్ద బ్యాటరీ కారణంగా, MG విండ్‌సోర్‌ EV ప్రో వెర్షన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే దీని పరిధి 117 కిలోమీటర్లు పెరిగింది. తద్వారా.. దూర ప్రయాణాలకు & హైవే డ్రైవింగ్‌కు బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.

3. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60 నిమిషాల్లో 80% ఛార్జ్ఈ బండి ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనిలో అందించిన 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ కారు కేవలం 1 గంటలోనే 20% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. పాత మోడల్‌లో 45kW ఛార్జింగ్ ఉంది, దీని కంటే ప్రస్తుత ఛార్జర్‌ సూపర్‌ ఫాస్ట్‌.

4. అధునాతన ADAS ఫీచర్లు MG విండ్‌సోర్‌ EV ప్రో అధునాతన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లతో ప్యాక్‌ అయింది. ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & టెక్నికల్‌గా మారుస్తింది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది, ఇది ట్రాఫిక్‌ రద్దీని బట్టి వాహనం వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది, పదే పదే బ్రేక్ వేయడం & స్పీడ్‌ పెంచడం అవసరాలను తొలగిస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్‌ ఈ వాహనాన్ని సరైన లైన్‌లో ఉంచుతుంది, హైవేపై డ్రైవింగ్‌ను సులభంగా మారుస్తుంది. 

5. పవర్డ్ టెయిల్‌గేట్ - లగ్జరీ కారు లాంటి ఫీచర్ఈ కారులో పవర్డ్ టెయిల్‌గేట్ సౌకర్యాన్ని కూడా MG యాడ్‌ చేసింది. ఇప్పుడు ఒకే ఒక్క బటన్‌ నొక్కి బూట్‌ను తెరవవచ్చు లేదా మూసివేయవచ్చు. తరచూ లగేజీని లోడ్ చేసుకునేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

6. కొత్త స్పోర్టీ అల్లాయ్ వీల్ డిజైన్ విండ్‌సోర్‌ EV ప్రోను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి స్పోర్టీ అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ చక్రాలు అందంగా కనిపించడమే కాకుండా, కారు ఏరోడైనమిక్స్ & రోడ్ గ్రిప్‌ను మెరుగుపరుస్తాయి.

7. V2L & V2V టెక్నాలజీMG విండ్‌సోర్‌ EV ప్రో V2L (వెహికల్ టు లోడ్) & V2V (వెహికల్ టు వెహికల్) టెక్నాలజీతో వచ్చింది. అంటే, కారు పవర్ స్టేషన్‌గానూ మారుతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మీ మొబైల్, గృహోపకరణాలు & ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మీ కారు బ్యాటరీ నుంచి నేరుగా ఛార్జ్ చేయవచ్చు. ఈ వ్యవస్థ 3kW వరకు విద్యుత్ అందించగలదు, ఇది అత్యవసర పరిస్థితుల్లో లేదా బహిరంగ ప్రయాణాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

8. మూడు కొత్త రంగులు MG విండ్‌సోర్‌ EV ప్రో మూడు కొత్త & ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ రంగులు కారును మునుపటి కంటే స్టైలిష్‌గా & ఫ్రెష్‌ లుక్‌ ఇస్తున్నాయి. కంపెనీ, పాత బీజ్‌ కలర్‌ను నిలిపేసింది, ఈ కొత్త రంగులతో ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.

9. డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ కారు లోపలి భాగం కూడా మరింత లగ్జరీగా మారింది. బీజ్‌ & బ్లాక్‌ కలర్‌ల డ్యూయల్-టోన్ థీమ్‌తో ప్రీమియం ఫీలింగ్‌ కలుగుతోంది.

10. కొత్త టాప్ వేరియంట్ - "ఎసెన్స్ ప్రో"MG విండ్‌సోర్‌ EV ప్రోలో టాప్-ఎండ్ వేరియంట్‌గా కొత్త Essence Pro లాంచ్‌ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.50 లక్షలు. ఇది గత ఎసెన్స్ వేరియంట్ కంటే రూ.1.35 లక్షలు ఎక్కువ ఖరీదు.