New Mahindra Bolero Launch Date, Price, And Features Details: మహీంద్రా బొలెరో, భారతదేశంలో నమ్మకమైన & బలమైన SUVల్లో ఒకటి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో దీనికి చాలా ప్రజాదరణ, బలమైన పట్టు ఉంది. ఇప్పుడు, ఈ కంపెనీ, బొలెరో కొత్త అవతారంతో పరిచయం చేయబోతోంది. కొత్త మహీంద్రా బొలెరోను 15 ఆగస్టు 2025న పరిచయం చేయవచ్చు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఇది 2026 ప్రారంభంలో లాంచ్‌ (Mahindra Bolero 2025 launch) అవుతుంది. 

కొత్త మహీంద్రా బొలెరో డిజైన్ (New Mahindra Bolero design), శక్తిని & ఆధునికతను రెండింటినీ సంపూర్ణంగా కలిపి ఉంటుంది. ఈసారి కొత్త బొలెరో బయటి భాగం పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఇది బొలెరో నియో లేదా TUV300 కి ఫేస్‌లిఫ్ట్‌ తరహాలో ఉంటుంది, అదే సమయంలో పూర్తిగా కొత్త SUV గా పరిచయం అవుతుంది. ముందు భాగంలో కొత్త & పెద్ద మహీంద్రా లోగో, విభిన్నమైన గ్రిల్ డిజైన్‌ ఉంటాయి. ఫలితంగా, స్కార్పియో & థార్ కంటే భిన్నమైన గుర్తింపును తెచ్చుకుంటుంది.

ఇంటీరియర్‌లోనూ ప్రీమియం ఫీచర్లుకారు లోపల, బొలెరో క్యాబిన్ మరింత ప్రీమియం & హైటెక్‌గా ఉంటుంది. స్కార్పియో N వంటి సొగసైన టచ్‌లతో, అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌లా ఉండొచ్చు. కొత్త బొలెరో డాష్‌బోర్డ్‌లో, స్కార్పియో N ఇన్‌స్పిరేషన్‌తో ఇన్‌స్ట్రుమెంట్ డయల్స్ & కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. పెద్ద హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కూడా మనం చూడవచ్చు, దీని పరిమాణం 10 అంగుళాల వరకు ఉంటుంది. మెరుగైన మెటీరియల్ నాణ్యత & సాఫ్ట్-టచ్ ఇన్సర్ట్స్‌ బొలెరో లోపలి భాగాన్ని గతంలో కంటే మరింత మెరుగ్గా, ప్రీమియంగా మారుస్తాయి.

ఫీచర్లు ఎలా ఉంటాయి?2025 బొలెరోలో... సన్‌రూఫ్, ADAS (లేన్ అసిస్ట్ & ఆటో బ్రేకింగ్ వంటివి), 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లను యాడ్‌ చేసే అవకాశం ఉంది.

ఇంజిన్ & డ్రైవ్ ట్రైన్ఇంజిన్ & డ్రైవ్‌ట్రెయిన్‌కు కూడా ఒక ప్రధాన అప్‌డేట్‌ ఇవ్వొచ్చు. కొత్త బొలెరో mHawk సిరీస్ డీజిల్ ఇంజిన్‌తో రావచ్చు, ఇది 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో పని చేస్తుంది. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మొదటిసారిగా, బొలెరోకు పూర్తి 4WD (ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌) డ్రైవ్‌ట్రెయిన్ ఇస్తున్నారు, ఇది ఈ SUVని థార్ కంటే మరింత ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా & స్కార్పియో కంటే తక్కువ ధర ఎంపికగా చేస్తుంది.

ధర & లాంచ్‌ డేట్‌మహీంద్రా బ్రాండ్‌లోని ఇతర ప్రీమియం SUVలతో పోలిస్తే, కొత్త బొలెరో తక్కువ ధర 4WD SUVగా రావచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14 లక్షల వరకు ఉండవచ్చు. 

ఈ SUV టాటా పంచ్ EV, మారుతి సుజుకి ఫ్రాంక్స్ & రెనాల్ట్ కైగర్ వంటి కాంపాక్ట్ SUVలతో పోటీ పడుతుంది.