New Kia Seltos Midsize SUV Comparison: భారత మార్కెట్‌లో మిడ్‌ సైజ్‌ SUVల విభాగం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మారుస్తూ, కొత్త Kia Seltos సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ SUV.... పాత మోడల్‌తో పోలిస్తే మరింత పొడవుగా, వెడల్పుగా ఉండటమే కాకుండా, వీల్‌బేస్‌ కూడా పెరిగింది. డిజైన్‌, ఫీచర్లు మాత్రమే కాదు, ధరల విషయంలో కూడా ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Continues below advertisement

ధరల పోలికలో కొత్త Seltos స్థానంకొత్త Kia Seltos ధరలు రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉన్నాయి. ఇదే విభాగంలో ఉన్న Hyundai Creta ధర రూ.10.73 లక్షల నుంచి రూ.20.20 లక్షల వరకు వెళ్తోంది. Tata Sierra రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉంది. ధరల వివరాలు ఇవిగో:

కొత్త కియా సెల్టోస్‌ vs రైవల్స్‌ - ధరల పోలిక (రూ.లక్షల్లో)

Continues below advertisement

Seltos - 10.99-19.99Creta - 10.73-20.20Sierra - 11.49-21.29Victoris - 10.5-19.9Grand Vitara - 10.76-19.72Hyryder - 10.99-19.76Kushaq - 10.66-18.49Taigun - 10.58-19.19Aircross X - 8.29-13.69Astor - 9.65-15.16 

టాప్‌ వేరియంట్‌ విషయానికి వస్తే.... Seltos ధర Creta, Sierra కంటే తక్కువగా ఉండటం గమనార్హం. Victoris, Grand Vitara, Hyryder లాంటి మోడళ్లతో పోలిస్తే కూడా Seltos రేటు బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. బేస్‌ వేరియంట్‌ ధర Sierra కంటే తక్కువగా ఉండగా, Creta కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది.

సైజ్‌లో ఏ కారు పెద్దది?కొత్త Seltos, ఈ విభాగంలో పొడవులో ముందుంది. అయితే వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్‌ విషయంలో Tata Sierra స్పష్టంగా పైచేయి సాధించింది. పెద్ద బూట్‌ స్పేస్‌, పెద్ద వీల్స్‌ కూడా Sierra బలమైన అంశాలు. Honda Elevate ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో నిలుస్తే, Citroen Aircross X ఒక్కటే 7 సీట్ల ఆప్షన్‌ను ఇస్తోంది. అంటే అవసరాన్ని బట్టి ప్రతి SUVకి ప్రత్యేక బలం ఉంది.

ఇంజిన్‌ ఆప్షన్లు, పవర్‌పవర్‌ట్రెయిన్‌ విషయంలో కొత్త Seltos చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌ అనే మూడు ఇంజిన్‌ ఆప్షన్లు అందిస్తోంది.1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ విభాగంలో Seltos, Creta, Sierra మూడు కూడా సమాన శక్తిని ఇస్తున్నాయి. అయితే టార్క్‌ విషయంలో Tata Sierra కొంచెం ముందుంది.డీజిల్‌ ఆప్షన్‌ ఉన్న SUVలు Seltos, Creta, Sierra మాత్రమే. ఇందులో పవర్‌, టార్క్‌ పరంగా Sierra డీజిల్‌ ఇంజిన్‌ బలంగా ఉంది.

హైబ్రిడ్‌, CNGలో ప్రత్యర్థుల ఆధిక్యంMaruti Grand Vitara, Victoris, Toyota Hyryder మోడళ్లు స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో పాటు ఫ్యాక్టరీ CNG ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఇంధన సామర్థ్యాన్ని చూసేవారికి ఇది పెద్ద ప్లస్‌. అయితే, Seltos మూడు ఇంజిన్‌లకూ రెండు గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థులకు తగిన సమాధానం చెబుతోంది.

మొత్తం మీద, కొత్త Kia Seltos ధరలు, సైజు, ఇంజిన్‌ ఎంపికల విషయంలో చాలా సమతుల్యంగా ఉంది. హైబ్రిడ్‌ లేకపోయినా, ఫీచర్లు, డిజైన్‌, పనితీరు కలిపి చూసుకుంటే మిడ్‌ సైజ్‌ SUV విభాగంలో Seltos మళ్లీ ఒక బలమైన ప్లేయర్‌గా నిలుస్తోంది. Creta, Sierra లాంటి బలమైన ప్రత్యర్థుల మధ్య కూడా Seltos తన ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.