New Kia Seltos Variants And Specifications: ఇండియాలో, మిడ్‌ సైజ్‌ SUV విభాగం ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో మరింత పోటీగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త Kia Seltos (2026) మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ SUV, డిజైన్‌, సైజు, ఫీచర్లలో గణనీయమైన అప్‌డేట్స్‌తో పాటు మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, ఇంత పెద్ద లైనప్‌లో మీకు ఏ వేరియంట్‌ సరిపోతుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

Continues below advertisement

కొత్త Kia Seltos వేరియంట్లు

HTEHTE (O)HTKHTK (O)HTXHTX (A)GTXGTX (A)

Continues below advertisement

ధరలు

వేరియంట్‌ను బట్టి కొత్త Kia Seltos ధరలు రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి. ఈ ధరల శ్రేణిలో Hyundai Creta, Tata Sierra, Maruti Grand Vitara, Honda Elevate వంటి బలమైన ప్రత్యర్థులతో Seltos పోటీ పడుతోంది.

ఇంజిన్‌ ఆప్షన్లు

కొత్త Seltos‌లో ప్రస్తుతం మూడు ఇంజిన్‌ ఎంపికలు ఉన్నాయి.- 1.5 లీటర్‌ న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ (115hp)- 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ (160hp)- 1.5 లీటర్‌ డీజిల్‌ (116hp)

పెట్రోల్‌ హైబ్రిడ్‌ ఆప్షన్‌ను 2027 నాటికి తీసుకువస్తామని Kia ఇప్పటికే కన్ఫర్మ్‌ చేసింది.

బేస్‌ వేరియంట్‌ - HTE

బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే వారికి HTE వేరియంట్‌ మంచి ఎంట్రీ పాయింట్‌. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, LED హెడ్‌ల్యాంప్స్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి కీలక భద్రతా, కంఫర్ట్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫస్ట్‌ టైం SUV కొనుగోలు చేసేవారికి ఇది సరైన ఎంపిక.

HTE (O), HTK - ఫ్యామిలీ యూజ్‌కు బెస్ట్‌

HTE (O), HTK వేరియంట్లలో మరిన్ని కంఫర్ట్‌, యుటిలిటీ ఫీచర్లు యాడ్‌ అవుతాయి. స్ప్లిట్‌ రియర్‌ సీట్లు, సన్‌షేడ్స్‌, స్మార్ట్‌ కీ, పెద్ద వీల్స్‌ లాంటి అంశాలు రోజువారీ వాడకాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. బడ్జెట్‌ కంట్రోల్‌లో ఉంచుకుంటూనే మంచి ఫీచర్లు కావాలనుకునే కుటుంబాలకు ఇవి బాగా సరిపోతాయి.

HTX - బ్యాలెన్స్‌డ్‌ వేరియంట్‌

రూ.15.59 లక్షల నుంచి వచ్చే HTX వేరియంటే చాలా మందికి గోల్డెన్‌ చాయిస్‌గా చెప్పొచ్చు. 12.3 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్‌, ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ సీట్లు, Bose సౌండ్‌ సిస్టమ్‌, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మూడు ఇంజిన్‌ ఆప్షన్లూ అందుబాటులో ఉండటం దీని పెద్ద ప్లస్‌.

HTX (A), GTX - టెక్నాలజీ ప్రేమికుల కోసం

డ్రైవింగ్‌ అసిస్ట్‌ టెక్నాలజీ కావాలంటే HTX (A) సరైన ఎంపిక. Level-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇంకా... స్పోర్టీ లుక్‌, ప్రీమియం టచ్‌ కావాలంటే GTX, GTX (A) వేరియంట్లు సరైనవి. 18 ఇంచుల అలాయ్‌ వీల్స్‌, మెమరీ సీట్స్‌, స్పెషల్‌ స్టైలింగ్‌ ఇవి ప్రత్యేక ఆకర్షణ.

ఏ వేరియంట్‌ కొనాలి?

మొత్తంగా చూసుకుంటే, HTX లేదా HTX (A) వేరియంట్లు ధర, ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్ల మధ్య మంచి బ్యాలెన్స్‌ను ఇస్తాయి. బడ్జెట్‌ తక్కువైతే HTK సరైన ఎంపిక. ప్రీమియం లుక్‌, టెక్నాలజీ కావాలంటే GTX వైపు చూడొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.