Hyundai Venue New vs Old Comparison: హ్యుందాయ్‌ వెన్యూ కొత్త తరం మోడల్‌ ఈ రోజు (మంగళవారం, 4 నవంబర్‌ 2025) లాంచ్‌ అయింది. కొత్త వెన్యూ ఇప్పుడు చాలా అప్‌డేట్‌ అయింది. డిజైన్‌ నుంచి ఇంటీరియర్‌ వరకూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కానీ ఇంజిన్‌ మాత్రం పాత వెర్షన్‌ లానే ఉంది. 

Continues below advertisement

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో పెద్ద మార్పులుకొత్త హ్యుందాయ్‌ వెన్యూ 3,995 మిల్లీమీటర్ల పొడవు, 1,800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,665 మిల్లీమీటర్ల ఎత్తుతో పాత వెర్షన్‌ కంటే 48 మిల్లీమీటర్లు ఎత్తుగా, 30 మిల్లీమీటర్లు వెడల్పుగా వచ్చింది. కొత్త వెన్యూ బాక్సీ లుక్‌తో మరింత SUV తరహాలో కనిపిస్తుంది. ఫ్లేర్డ్‌ ఫెండర్స్‌, రెక్టాంగ్యులర్‌ గ్రిల్‌, ఎల్‌-షేప్‌ DRLs‌, LED లైట్‌ బార్‌, డార్క్‌ క్రోమ్‌ టచ్‌ ఉన్న ఫ్రంట్‌ ఫేసియా కొత్తగా ధగధగ మెరిసిపోతోంది.

సైడ్‌ ప్రొఫైల్‌లో కూడా పెద్ద మార్పులే కనిపిస్తున్నాయి. బాక్సీ విండోలు, అప్‌డేట్‌ చేసిన రూఫ్‌రైల్స్‌, కొత్త 16 ఇంచ్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఆకర్షణగా ఉన్నాయి. వెనుక భాగంలో ‘VENUE’ లెటరింగ్‌తో LED లైట్‌ బార్‌, పెద్ద స్పాయిలర్‌, అగ్రెసివ్‌ స్కిడ్‌ ప్లేట్స్‌ SUV లుక్‌ను మరింత పెంచాయి.

Continues below advertisement

ఇంటీరియర్‌ - మరింత ప్రీమియం ఫీల్‌కేబిన్‌లో అడుగు పెట్టగానే కొత్త వెన్యూ “వావ్‌” అనిపిస్తుంది. బ్లూ-బీజ్‌ కలర్‌ స్కీమ్‌, కొత్త డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌, డ్యూయల్‌ 12.3 అంగుళాల స్క్రీన్‌ సెటప్‌ (ఇన్ఫోటైన్‌మెంట్‌ + డిజిటల్‌ క్లస్టర్‌) చాలా మోడర్న్‌గా ఉన్నాయి. ఇంటీరియర్‌లో కొత్త 3-స్పోక్‌ ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉంది, ఇందులో హ్యుందాయ్‌ లోగో స్థానంలో ఐయోనిక్‌ సిరీస్‌లో ఉన్న "4 డాట్‌ మోర్స్‌ కోడ్‌" డిజైన్‌ ఇచ్చారు.

క్లైమేట్‌ కంట్రోల్‌ బటన్‌లు, కొత్త గేర్‌ లివర్‌, డ్రైవ్‌ మోడ్‌ రొటరీ స్విచ్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటి ఫీచర్లు కొత్త మోడల్‌లో మాత్రమే కనిపిస్తాయి. పాత వెర్షన్‌తో పోలిస్తే ఇప్పుడు వెనుక సీట్లలో లెగ్‌ రూమ్‌ కూడా పెరిగింది. దాంతో లాంగ్‌ డ్రైవ్స్‌లో కంఫర్ట్‌ మరింత మెరుగైంది.

ఫీచర్స్‌ పరంగా అప్‌గ్రేడ్‌కొత్త వెన్యూ ఫీచర్స్‌లో హ్యుందాయ్‌ ఫుల్‌ జోరు చూపించింది. డ్యూయల్‌ 12.3 ఇంచ్‌ స్క్రీన్‌లు, వెంటిలేటెడ్‌ సీట్లు, లెవల్‌ 2 ADAS, అంబియంట్‌ లైటింగ్‌, రియర్‌ సన్‌ షేడ్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌, 360° కెమెరా, ఆటో హోల్డ్‌ సిస్టమ్‌ ఉన్న ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటి ఫీచర్లు చేర్చారు.

ADAS లెవల్‌ 2తో ఇప్పుడు అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ స్పాట్‌ వార్నింగ్‌, రియర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌, సేఫ్‌ ఎగ్జిట్‌ వార్నింగ్‌ వంటి స్మార్ట్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ వచ్చాయి. బాడీ షెల్‌ (కారు గట్టిదనం) కూడా మరింత బలంగా ఉందని కంపెనీ చెబుతోంది.

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌ఇంజిన్‌ ఆప్షన్లు పాత వెర్షన్‌ లానే ఉన్నాయి. 1.2 లీటర్‌ పెట్రోల్‌ (83hp), 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ (120hp), 1.5 లీటర్‌ డీజిల్‌ (100hp) మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డీజిల్‌ ఆటోమేటిక్‌ (6-స్పీడ్‌) ఆప్షన్‌ కూడా ఇచ్చారు. టర్బో పెట్రోల్‌ DCTతో కూడా అందుబాటులో ఉంటుంది.

సింపుల్‌గా చెప్పాలంటే…కొత్త హ్యుందాయ్‌ వెన్యూ డిజైన్‌ & ఫీచర్స్‌ పరంగా పెద్ద జంప్‌ తీసుకుంది. యువతరానికి నచ్చే బోల్డ్‌ SUV స్టైల్‌, టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్‌ ఈ వెన్యూ స్పెషల్‌. కానీ ఇంజిన్‌ విషయంలో మాత్రం పాత ఫార్ములానే కొనసాగింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.