హ్యుండాయ్ కొత్త తరం టక్సన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. ఈ కొత్త టక్సన్‌ను జులై 13వ తేదీన మనదేశంలోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో 2020 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. టక్సన్ ప్రపంచవ్యాప్తంగా హ్యుండాయ్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అయితే మనదేశంలో మాత్రం టక్సన్ ఊహించిన సక్సెస్ కాలేదు. హ్యుండాయ్ క్రెటా కంటే టాప్ వెర్షన్‌గా ఈ కారు లాంచ్ కానుంది.


హ్యుండాయ్ టక్సన్ లుక్స్ విషయంలో ఎంతో అటెన్షన్ పొందింది. దీని ఫ్రంట్ గ్రిల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. గ్రిల్ డిజైన్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఎస్‌యూవీ వెనకవైపు నుంచి చాలా అద్భుతంగా ఉండనుంది.


ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే... ఇందులో 4 స్పోక్ స్టీరింగ్ వీల్, హుడ్‌లెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, బోస్ సౌండ్ సిస్టం, వాయిస్ అసిస్టెంట్, ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ సెకండ్ రో సీట్లు, డ్యూయల్ వర్టికల్లీ స్టాక్డ్ టచ్‌స్క్రీన్లు సెంట్రల్ కన్సోల్‌లో ఉండనున్నాయి. దీని బూట్ స్పేస్ 1096 లీటర్లుగా ఉండనుంది. టక్సన్ మనదేశంలో ఏ ఫీచర్లతో లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఈ సందర్భంగా ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉండనుంది. కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, 64 కలర్ యాంబియంట్ లైటింగ్‌లు కూడా ఉన్నాయి.


ఈ టక్సన్ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్. అప్ డేట్ చేసిన బ్లూలింక్ సహా లేటెస్ట్ ఫీచర్లు ఎన్నిటినో ఇందులో అందించారు. త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్‌ను కూడా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడీఏఎస్‌ను ఇందులో పరిచయం చేయనున్నట్లు సమాచారం.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?