Honda New Electric Scooter: భారత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో TVS iQube, Bajaj Chetak, Ather Rizta వంటి మోడళ్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది, ఇవి జనం చేత జేజేలు అందుకున్నాయి. కానీ, హోండా మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. Activa e:, QC1 పేరిట రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో EV సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన హోండా, వాటి అమ్మకాలు ఆశించినంతగా జరగకపోవడంతో ఇటీవల వాటి ఉత్పత్తినే నిలిపివేసింది. అయితే ఇప్పుడు ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది.

Continues below advertisement

కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీలో హోండా తాజా సమాచారం ప్రకారం, హోండా కొత్త లోకలైజ్డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై పని చేస్తోంది. ఈ స్కూటర్‌ను పూర్తిగా భారత మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోంది. ముఖ్యంగా పోటీ ధరను ఉంచడం కోసం భారీగా లోకలైజేషన్‌ చేయాలని హోండా ప్లాన్‌ చేస్తోంది.

Activa e: లోపాలే కొత్త స్కూటర్‌కు పాఠాలుActiva e: టెక్నాలజీ పరంగా కొత్తదైనప్పటికీ, దానిలో కొన్ని పెద్ద లోపాలు ఉన్నాయి. బ్యాటరీ స్వాపింగ్‌ విధానం ఉన్నా, ఆ నెట్‌వర్క్‌ చాలా పరిమితంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. హోమ్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ లేకపోవడం వల్ల, స్వాపింగ్‌ స్టేషన్‌ దగ్గర నివసించే వారికే ఇది ఉపయోగకరంగా మారింది. అంతేకాదు, బ్యాటరీలు సీటు కింద ఉండటంతో బూట్‌ స్పేస్‌ దాదాపు లేకపోవడం కూడా వినియోగదారులను నిరాశపరిచింది.

Continues below advertisement

QC1 లో ఉన్న పరిమితులుQC1 స్కూటర్‌లో బూట్‌ స్పేస్‌, హోమ్‌ ఛార్జింగ్‌ వంటి సమస్యలు కొంతవరకు పరిష్కరించినా, పనితీరులో మాత్రం అది వెనుకబడింది. కేవలం 50 kmph టాప్‌ స్పీడ్‌, 80 కిలోమీటర్ల క్లెయిమ్డ్‌ రేంజ్‌, దాదాపు 7 గంటల ఛార్జింగ్‌ టైమ్‌... ఇవన్నీ ఈ స్కూటర్‌ను మెయిన్‌స్ట్రీమ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోలిస్తే బలహీనంగా చేశాయి.

హోండా కొత్త స్కూటర్‌లో ఏం మారనుంది?ఇప్పుడు, ఈ రెండు మోడళ్ల అనుభవాలను కలిపి, హోండా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను డిజైన్‌ చేస్తోంది. ఈ స్కూటర్‌లో...- మంచి బూట్‌ స్పేస్‌- TVS iQube, Bajaj Chetak, Ather వంటి స్కూటర్లకు సమానమైన రేంజ్‌- సరైన ఫీచర్‌ లిస్ట్‌- హోమ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌వంటివి అందించాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.

ధరే కీలకంఇప్పటివరకు హోండా EVలు ధర విషయంలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఈసారి లోకలైజేషన్‌ ద్వారానే ధరను కంట్రోల్‌ చేయాలని కంపెనీ గట్టిగా భావిస్తోంది. ఇదే కొత్త స్కూటర్‌ విజయానికి కీలకంగా మారుతుందని ఆశిస్తోంది.

లాంచ్‌ టైమ్‌లైన్‌ప్రస్తుతం ఈ కొత్త హోండా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌పై అధికారిక సమాచారం లేదు. లాంచ్‌ టైమ్‌ దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. 

మొత్తానికి, హోండా ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తన తప్పులను సరిదిద్దుకుని, బలంగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇది నిజంగా జరిగితే, భారత EV స్కూటర్‌ మార్కెట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.