Renault కంపెనీ భారత మార్కెట్లో మరోసారి తన పాపులర్ SUV Duster కొత్త జనరేషన్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. రెనాల్ట్ కంపెనీ సోషల్ మీడియాలో ఒక కొత్త టీజర్‌ను విడుదల చేసింది. అందులో ఈ SUV లుక్ చూపించారు. అలాగే, కొత్త Renault Duster ను 26 జనవరి 2026న భారత మార్కెట్లో లాంచ్ చేస్తారని స్పష్టం చేశారు. చాలా కాలం నుంచి ఈ SUV కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు డస్టర్ రీఎంట్రీ ఫిక్స్ కాగానే దాని ఫీచర్లు, ధర కోసం కస్టమర్లు చెక్ చేస్తున్నారు.
కొత్త టీజర్‌లో ఏం కనిపించింది?
Renault విడుదల చేసిన టీజర్‌లో SUV పూర్తి లుక్ చూపించలేదు. కానీ డిజైన్‌కు సంబంధించి కొన్ని సూచనలు మాత్రం ఇచ్చింది. టీజర్ నుండి కొత్త Duster గతంలో కంటే మరింత దృఢంగా, మోడ్రన్ లుక్ ఉంటుందని స్పష్టమైంది. దీని స్టాన్స్ మరింత వెడల్పుగా ఉంటుంది. SUV ఫీల్ గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తుంది.
డిజైన్, ఇంటీరియర్ ఎలా ఉంటుంది?
కొత్త జనరేషన్ Renault Duster లో పాత మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. ఎక్స్టీరియర్‌లో కొత్త ఫ్రంట్ డిజైన్, LED హెడ్‌లైట్స్, కొత్త అలాయ్ వీల్స్, మరింత బోల్డ్ లుక్ లభించే అవకాశం ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వొచ్చు. ఈ రెనాల్డ్ డస్టర్ SUV గతంలో కంటే మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.
మరింత అడ్వాన్స్‌డ్‌గా ఫీచర్లు
ఫీచర్ల విషయంలో కూడా కొత్త రెనాల్ట్ Duster చాలా ముందుండవచ్చు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, లెవెల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆధునిక ఏసీ వెంట్స్ కూడా ఇవ్వవచ్చు.
ఇంజిన్, పోటీ
కొత్త Renault Duster లో 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనితో పాటు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ సైతం లభించవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉండనున్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ కారు హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), Maruti Grand Vitara, టయోటా హైరైడర్ (Toyota Hyryder), Honda Elevate తో పోటీ పడనుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.