New Gen Tata Tiago Vs Old Model Comparison Price Design Features: టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ టియాగోను సరికొత్త అప్‌డేట్స్‌తో నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ లో లాంచ్ చేసింది. పాత మోడల్ ప్రారంభ ధర రూ. 4.60 లక్షలుగా ఉండగా, కొత్త జనరేషన్ పెట్రోల్ వెర్షన్ ధర స్వల్పంగా పెరిగి రూ. 4.69 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. పాత కారుతో పోలిస్తే కొత్త మోడల్ లో డిజైన్, క్యాబిన్, సేఫ్టీ ఫీచర్లలో భారీ మార్పులు చేశారు. గతంలో కేవలం పెట్రోల్ మాన్యువల్, ఏఎమ్‌టీ, సీఎన్‌జీ మాన్యువల్ ఆప్షన్లు మాత్రమే ఉండగా, సరికొత్త మోడల్ లో ఐసీఎన్‌జీ ఏఎమ్‌టీ (iCNG AMT) ఆప్షన్ ను కూడా జోడించారు. ఈ సెగ్మెంట్ లోనే అత్యధిక ఫ్యూయల్, ట్రాన్స్‌మిషన్ ఛాయిస్ ఉన్న కారుగా ఇది నిలిచింది.

Continues below advertisement

లక్స్ బీమ్ హెడ్‌ల్యాంప్స్.. 

పాత టియాగోతో పోలిస్తే కొత్త నెక్స్ట్ జనరేషన్ మోడల్ పూర్తిగా డిఫరెంట్ డిజైన్ ట్రీట్‌మెంట్ ను కలిగి ఉంది. ఇందులో కొత్తగా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ తో కూడిన లక్స్ బీమ్ హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు కనెక్టెడ్ స్టైల్ హాలో లైట్‌బార్ టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. పాత కారులో చాలా సింపుల్ ఫ్రంట్ గ్రిల్, నార్మల్ టెయిల్ లైట్స్ ఉండేవి. కొత్త వెర్షన్ లో రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ తో పాటు వారణాసి వైబ్రెన్స్, సోహో సర్జ్, పాంగోంగ్ పల్స్ లాంటి సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. దీనివల్ల కారుకు పాత మోడల్ కంటే వైడర్ విజువల్ స్టాన్స్, షార్పర్ లుక్ లభించింది.

Continues below advertisement

Read Also: Fuel Price Impact Automobile Demand:  పెరుగుతున్న ఇంధన ధరలతో ఆటోమొబైల్ రంగానికి షాక్: కార్ల అమ్మకాలపై పడనున్న ఇంపాక్ట్..!!  

డ్యూయల్ స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్

కొత్త టియాగో ఇంటీరియర్ లో పాత మోడల్ కంటే చాలా ప్రీమియం మార్పులు కనిపిస్తున్నాయి. పాత కారులోని ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో సరికొత్త 10.24-ఇంచ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్, సరికొత్త స్టరింగ్ వీల్ డిజైన్ ఇచ్చారు. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఐఆర్ఏ (iRA) టెక్నాలజీతో కూడిన కనెక్టెడ్ కార్ ఫీచర్లు డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను మరింత ఈజీగా మారుస్తాయి. పాత టియాగో టాప్ ట్రిమ్స్ లో టచ్‌స్క్రీన్ ఉన్నప్పటికీ, కొత్త మోడల్ లో డైలీ యూసేజ్ కోసం మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు యాడ్ చేశారు.

Read Also: Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం! 

స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్స్..

సేఫ్టీ పరంగా టాటా మోటార్స్ ఈ కారును నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కొత్త టియాగోలో ఇప్పుడు స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ తో కూడిన ఈఎస్‌పీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, బ్లైండ్ వ్యూ మానిటర్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్ లోనే ఫస్ట్ టైమ్ 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాను ఆఫర్ చేయడం విశేషం. పాత మోడల్ లో ఈ ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు లేవు. లగేజ్ స్పేస్ కోసం ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కొనసాగిస్తూనే, ఈసారి సీఎన్‌జీ ఆప్షన్ లో కూడా స్పోర్టీ డ్రైవింగ్ కోసం స్టరింగ్ వెనుక ప్యాడల్ షిఫ్టర్స్ ఆప్షన్ ఇవ్వడం కస్టమర్లను ఆకట్టుకుంటోంది.