Kia తన న్యూ జనరేషన్ Seltos ని తీసుకురావడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. కియా కంపెనీ దీనిని డిసెంబర్ 10, 2025 న భారతదేశంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన వివరాల ప్రకారం, Seltos కొత్త మోడల్ మరింత పటిష్టంగా, మోడ్రన్ లుక్‌తో రాబోతుంది. దీని ముందు భాగం గతంలో కంటే కాస్త వెడల్పుగా ఉంటుంది. టైట్-మెష్ గ్రిల్ ఉంటుంది. ఇది SUV కి ప్రీమియం లుక్ ఇస్తుంది. ముందు భాగంలో నిలువు LED హెడ్‌లైంప్‌లు, బంపర్ అంచులకు కలిసే C-ఆకారపు DRLలు దీనికి బోల్డ్ గుర్తింపునిస్తాయి.

Continues below advertisement

కొత్త బోనెట్ లైన్స్ లోతుగా ఉండటం వల్ల డ్రైవింగ్ సమయంలో రోడ్ ప్రెజెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో మార్పులు ఉన్నప్పటికీ, చూడటానికి చాలా తేడాను చూపుతాయి. కొత్త Y-ప్యాటర్న్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన రియర్ క్వార్టర్ గ్లాస్, మరింత స్ట్రాంగ్ వీల్ ఆర్చెస్ దాని స్పోర్టీ ఆకర్షణను పెంచుతాయి.

వెనుక డిజైన్‌లో పెద్ద మార్పులు, మోడ్రన్ టైల్‌ల్యాంప్‌లు

కారు వెనుక భాగంలో కొత్త C-ఆకారపు LED టైల్ లాంప్స్ ఇచ్చారు. ఇవి టెయిల్‌గేట్‌పై ఉన్న సన్నని LED స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. బంపర్ డిజైన్ పూర్తిగా కొత్తది. టెయిల్‌గేట్ ఆకారం కూడా అప్‌డేట్ చేశారు. ఈ మార్పులన్నీ SUVకి సరికొత్త గుర్తింపునిస్తాయి. ఇంటీరియర్‌లో కంపెనీ పెద్ద అప్‌డేట్ చేయబోతోంది. డాష్‌బోర్డ్ ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఫ్లాట్,  వైడ్ లేఅవుట్‌తో వస్తుంది. క్యాబిన్‌లో ప్రీమియం ఫినిష్, మెరుగైన స్పేస్, కొత్త యాంబియంట్ లైటింగ్ సెటప్ ఉండవచ్చు.

Continues below advertisement

ఇన్ఫోటైన్‌మెంట్, ఫీచర్లు, ADASలో మెరుగుదల

కొత్త Seltos ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పెద్ద సింగిల్ గ్లాస్ ప్యానెల్. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. Kia కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్, అదనపు కనెక్టెడ్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్ సహా కొత్త ADAS సెటప్ వంటి ఫీచర్లు గతంలో కంటే ప్రీమియంగా ఉంటాయి. ADASలో మరింత సహాయక సేఫ్టీ టెక్నాలజీని సైతం తీసుకురానుంది. 

ఇంజిన్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి

న్యూ జనరేషన్ Kia Seltosలో 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్‌లు కొనసాగుతాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో ఈ SUV ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికతో కూడా అందించే అవకాశం ఉంది. కొన్ని రోజుల తరువాత, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో లాంచ్ ప్రారంభించిన తర్వాత, ఈ SUV హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), గ్రాండ్ విటారా (Grand Vitara), టాటా హారియర్ (Toyota Hyryder), VW Taigun, Skoda Kushaq, టాటా కర్వ్ (Tata Curvv), టాటా సియోర్రా (Tata Sierra) వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.