New FASTag Rules 2025: దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ గుడ్‌ న్యూస్‌. ఫాస్టాగ్‌ లేకపోతే, ఇకపై టోల్ ప్లాజాల్లో డబుల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త నియమాలను ప్రకటించింది. నవంబర్‌ 15, 2025 నుంచి ఈ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.

Continues below advertisement

ఫాస్టాగ్‌ లేకపోయినా సాగేను ప్రయాణంఇప్పటివరకు ఫాస్టాగ్‌ లేకుండా ప్రయాణించే వాహనదారులు టోల్ ప్లాజాలో క్యాష్ చెల్లిస్తే డబుల్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు ₹100 టోల్ ఉన్న చోట, ఫాస్టాగ్‌ ఉంటే ₹100, ఫాస్టాగ్‌ లేకపోతే క్యాష్‌లో ₹200 వసూలు చేసేవారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం, మీరు UPI ద్వారా చెల్లిస్తే కేవలం 25% అదనంగా మాత్రమే, అంటే ₹125 చెల్లిస్తే సరిపోతుంది.

డిజిటల్ ట్రాన్సాక్షన్‌లకు పెద్ద బూస్ట్‌“క్యాష్ తగ్గించండి, డిజిటల్ పెంచండి” అని ఈ కొత్త రూల్‌తో ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. UPI చెల్లింపుల ద్వారా టోల్‌ ఫీజు చెల్లించడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది, క్యాష్ లావాదేవీల్లో ఉండే అవినీతి, ఆలస్యం కూడా తగ్గుతుంది. NHAI వెల్లడించిన ప్రకారం, నవంబర్‌ 15 నాటికి అన్ని టోల్ ప్లాజాలు UPI QR కోడ్‌లతో సిద్ధంగా ఉంటాయి.

Continues below advertisement

జాతీయ రహదారుల్లో స్మార్ట్‌ టోల్ సిస్టమ్‌ఈ మార్పు ‘National Highway Fee Rules, 2025’ కింద తెచ్చారు. ఇది డిజిటల్ ఇండియా మిషన్‌ లక్ష్యాలకు సరిపోయే నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం త్వరలో పూర్తిగా క్యాష్‌లెస్ టోల్ సిస్టమ్ అమలు చేయాలని చూస్తోంది. అంటే ఫాస్టాగ్‌, UPI వంటి ఆన్‌లైన్ చెల్లింపులు తప్ప ఇంకేదీ ఉండదు.

ప్రయాణం వేగంగా, సమయం సేవ్‌UPI ద్వారా చెల్లింపులు చేస్తే ప్లాజాలో నిలబడే సమయం తగ్గుతుంది. క్యాష్ కోసం క్యూ లైన్‌ల్లో వేచి ఉండడం, రావలసిన చిల్లర కోసం ఎదురు చూడడం వంటివి ఉండవు. ఒక్క స్కాన్‌తో చెల్లింపు అయిపోతుంది &వాహనాల కదలిక సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ వంటి తెలుగు నగరాల మధ్య ప్రయాణించే వాహనదారులు ఈ మార్పుతో ప్రయోజనం పొందనున్నారు.

సెక్యూరిటీ & పారదర్శకతUPI చెల్లింపులు సురక్షితమైనవి, ప్రతి లావాదేవీ ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. దీంతో అవినీతి లేదా టోల్ దుర్వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఫాస్టాగ్‌ లేదా UPI రెండింట్లో ఏది ఉపయోగించినా కేంద్ర ప్రభుత్వం ఆ లావాదేవీని ట్రాక్‌ చేయగలదు.

తెలుగు రాష్ట్రాల వాహనదారుల కోసం సూచనహైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, తిరుపతి వంటి మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ఈ మార్పును వెంటనే అర్థం చేసుకోవాలి. మీ వాహనానికి ఫాస్టాగ్‌ లేకుంటే ముందుగానే UPI యాప్‌లో టోల్‌ QR కోడ్‌ స్కాన్‌ చేసే ప్రాక్టీస్‌ పెట్టుకోవడం మంచిది.

ఈ కొత్త మార్పు, టోల్‌ ప్లాజాల వద్ద వాహన కదలికలను సులభతరం చేయబోతుంది. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహంతో దేశ రహదారులపై ప్రయాణం స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా మారనుంది. నవంబర్‌ 15 నుంచి కొత్త టోల్‌ అనుభవం కోసం అందరం సిద్ధం కావాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.